తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మాజీ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీకి కేసీఆర్ ఎందుకు రావడం లేదో చెప్పాలని, సభకు రాని కేసీఆర్ కు ప్రతిపక్ష హోదా ఎందుకని రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ సభకు ఎందుకు రావడం లేదని ప్రశ్నిస్తే కేసీఆర్ తో మాట్లాడే స్థాయి కాంగ్రెస్ నేతలది …
Read More »విశాఖ గ్రేటర్ పీఠంపై జనసేన కన్ను!
గ్రేటర్ విశాఖ పట్నం కార్పొరేషన్ పీఠంపై జనసేన కన్నేసినట్టు తెలిస్తోంది. ప్రస్తుతం విశాఖ, శ్రీకాకుళం, సహా.. అనంతపురం, చిత్తూరుపై జనసేన ప్రత్యేక ఆపరేషన్ ప్రారంభించింది. ఇక, ఇప్పుడు విశాఖ గ్రేటర్ పీఠాన్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చసాగుతోంది. విషయంలోకి వెళ్తే.. విశాఖ కార్పొరేషన్‌ను గత 2021లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ దక్కించుకుంది. విజయసాయిరెడ్డి ఏకంగా పాదయాత్ర చేసి మరీ.. ఇక్కడ పార్టీని నిలబెట్టారు. అదేవిధంగా స్థానిక ఎన్నికల్లో విజయం …
Read More »తెలంగాణ కాంగ్రెస్ కొత్త టాస్క్ : టార్గెట్ బీజేపీ !
తెలంగాణలో ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మొత్తం 17 స్థానాలకు గాను ఒకటి ఎంఐఎం, 8 కాంగ్రెస్, 8 బీజేపీ పార్టీలు గెలుచుకున్నాయి. తెలంగాణలో గెలిచి అధికారం చేపట్టిన తర్వాత సీఎం హోదాలో రేవంత్ ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి మోడీ, హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్రమంత్రులను కలిసి రాష్ట్రానికి నిధుల కోసం వినతిపత్రాలు ఇచ్చాడు. తెలంగాణ పర్యటనకు వచ్చిన మోడీకి స్వాగతం పలికి బడేభాయ్ అంటూ …
Read More »తెలంగాణ టీడీపీ నేతలకు మంచిరోజులొచ్చాయ్ !
2018 ఎన్నికల తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పోటీకి దూరంగా ఉంటున్న నేపథ్యంలో తాజాగా ఏపీలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఘనవిజయం సాధించడంతో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలకు మంచి రోజులు వచ్చాయి. ఇటీవల తెలంగాణ పర్యటనలో టీడీపీకి తెలంగాణలో పూర్వ వైభవం తెస్తానని అన్నారు. గత ఐదేళ్లుగా ఏపీ, తెలంగాణలో టీడీపీ అధికారంలో లేకపోవడంతో ఆ పార్టీ నేతలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో …
Read More »ప్రశాంత్ కిషోర్ ‘కోటి’ ఆశలు !
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అక్టోబర్ 2న కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించనున్నారు. రెండేళ్ల క్రితమే ఆయన జన్ సురాజ్ అనే సంస్థను ప్రారంభించాడు. భవిష్యత్తులో దానిని రాజకీయ పార్టీగా మారుస్తానని అప్పట్లో ప్రకటించాడు. ఈ నేపథ్యంలో వచ్చే అక్టోబరు 2 న పార్టీని ప్రారంభిస్తున్నానని, పార్టీ నాయకత్వం, విధివిధానాలను త్వరలో వెల్లడిస్తానని పీకే స్పష్టం చేశాడు. బీహార్ ప్రజలకు మెరుగైన విద్య, వైద్యం జన్ సురాజ్ లక్ష్యమని, …
Read More »‘ఒకటి’ గండం తీరేనా? బాబు సర్కారుకు పెను సవాల్!
ఏపీలో ప్రభుత్వానికి ప్రతి నెలా 1వ తేదీ అంటేనే కొంత తర్జన భర్జన పరిస్థితి కనిపిస్తోంది. మూడు పద్దులను ఒకే రోజు చెల్లించాల్సి రావడం.. నిధుల పరిస్థితి చూస్తే ఆశించిన విధంగా లేకపోవడంతో గతంలో వైసీపీ ప్రభుత్వం.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా ప్రతి నెలా 1వ తేదీ అంటే.. ఒక పెద్ద ‘గండం’గా భావిస్తున్నాయి. సామాజిక భద్రతా పింఛన్లు, ఉద్యోగులకు వేతనాలు, రిటైర్డ్ ఉద్యోగులకు పింఛన్లు.. ఈ మూడు …
Read More »వైసీపీకి చెమటలు పట్టిస్తున్న శ్వేతపత్రాలు.. !
ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన శ్వేత పత్రాలు వైసీపీలో గుబులు రేపుతున్నాయి. చెమటలు పట్టిస్తున్నాయి. ఇసుక, మైనింగ్ తదితర అంశాల్లో జిల్లాల స్థాయిలో అనేకమంది వైసీపీ నాయకుల పాత్ర ఉంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. పైకి ఎవరికివారు తాము నిమిత్తమాత్రులమని తమకే పాపం తెలియదని చెబుతున్నారు. కానీ మైనింగ్, ఇసుక, ఎర్రమట్టి వంటి విషయాల్లో వైసీపీ నాయకులు బాగానే సొమ్ములు చేసుకున్నారు. ఇప్పుడు ఆ విషయాలను అసెంబ్లీ …
Read More »45 వేల కోట్ల కోసం.. చంద్రబాబు చాణక్యం!?
ఏపీలో ఏర్పడిన కూటమి సర్కారు నాయకుడు, ప్రభుత్వాధినేత చంద్రబాబు తీసుకునే కొన్ని కొన్ని నిర్ణయాలను గమనిస్తే.. చాలా వ్యూహాత్మకంగా ఆయన అడుగులు వేస్తున్నారనే విషయం స్పష్టమవుతుంది. ఎక్కడా తొందరపాటు లేకుండా.. ఆచి తూచి అడుగులు వేయడంలో చంద్రబాబు స్థితప్రజ్ఞతను అందరూ ఫాలో అవ్వాల్సిందే.. అన్నట్టుగా వ్యవహరిస్తారు. ఎక్కద తగ్గాలో.. ఎక్కడ నెగ్గాలో తెలిసిన నాయకుడిగా కూడా.. ఆయన పేరు తెచ్చుకున్నారు. విషయంలోకి వెళ్తే.. పార్టీ అయినా ఎన్నికలకు ముందు.. ఇచ్చే …
Read More »‘ఇది ‘డీఎన్ఏ’ ప్రభుత్వం కాదు.. ‘ఎన్డీఏ’ ప్రభుత్వం’
ఏపీ రాజకీయాల్లో ఎక్స్ వేదికగా నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. వైసీపీ వర్సెస్ టీడీ పీ నేతల మధ్య నిత్యం ఏదో ఒక విషయంలో వాదన జరుగుతూనే ఉంది. గత వారం రోజులుగా.. వైసీపీ ఎంపీ, సీనియర్ నేత విజయసాయిరెడ్డి వ్యవహారం హాట్ టాపిక్‌గా నడుస్తున్న విషయం తెలిసిందే. దేవదా య శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి, ఆమె బిడ్డ వ్యవహారం.. రాష్ట్రంలో అనేక మలుపులు తిరిగింది. ఈ …
Read More »చెవిరెడ్డి అలా అరెస్టు-ఇలా విడుదల ?
రాష్ట్రంలో రాజకీయంగా కలకలం రేపిన వైసీపీ సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి అరెస్టు.. వ్యవహారం ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. శనివారం రాత్రి సమయంలో బెంగళూరు విమానాశ్రయంలో మోహిత్ రెడ్డి సహా ఆయన తమ్ముడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం ఉదయం.. తిరుపతి జిల్ల కోర్టులోను ప్రవేశ పెట్టనున్నట్టు ప్రకటించారు. దీంతో ఇంకేముంది.. చెవిరెడ్డి అక్రమాలకు, దౌర్జన్యాలకు తెరపడినట్టేనని అధికార పార్టీ టీడీపీ నాయకులు అంచనాకు …
Read More »జగన్‌కు షర్మిల షార్ప్ కౌంటర్
తమకు 11 మంది ఎమ్మెల్యేలే ఉన్నా.. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వవచ్చని.. అలా ఇవ్వనప్పుడు తాము సభలకు వెళ్లినా.. ప్రయోజనం ఏంటని వైసీపీ అధినేత జగన్ రెండు రోజుల కిందట చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యాయి. తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే.. అసెంబ్లీకి వెళ్లేది లేదని.. సభలో తమపై చేసే విమర్శలకు కౌంటర్‌గా.. తాము మీడియా సమావేశాలు పెట్టి నిజాలు చెబుతామని జగన్ చెప్పారు. ఈ వ్యాఖ్యలపై …
Read More »వైసీపీ పతనమే షర్మిల లక్ష్యమా ?!
తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టి ఏ ఎన్నికలలోనూ పోటీ చేయకుండానే తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పగ్గాలను చేపట్టి కడప ఎంపీగా పోటీ చేసి ఓటమి చెందారు. ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా తన అన్న, వైసీపీ అధినేత జగన్ ను టార్గెట్ చేసి విమర్శలు చేసిన షర్మిల వైసీపీ ప్రభుత్వ పరాజయంలో కీలకపాత్ర పోషించింది. ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత …
Read More »