నేషనల్ హైవే నిర్మాణంలో 2 గిన్నిస్ వరల్డ్ రికార్డులకు రాష్ట్రం వేదికగా నిలిచిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. బెంగళూరు -కడప- విజయవాడ ఎకనామిక్ కారిడార్లను కలిపే 28.95కి.మీ రహదారిని 24గంటల్లోనే నిర్మించారని తెలిపారు. దీనికోసం 10,675 మెట్రిక్ టన్నుల బిటుమినస్ కాంక్రీట్ వాడకం మరో రికార్డు అన్నారు. భారత ప్రభుత్వ, కేంద్ర మంత్రి గడ్కరీ విజన్, ఇంజినీర్లు, కార్మికులు, ఫీల్డ్ టీమ్స్ నిబద్ధతకు నిదర్శనమని కొనియాడారు. బెంగళూరు–కడప–విజయవాడ …
Read More »కలలో కూడా ఊహించని కాంగ్రెస్ – బీజేపీ పొత్తు
ఔను.. మీరు చదివింది నిజమే. నిత్యం ఉప్పు-నిప్పుగా ఉండే.. రెండు రాజకీయాలు.. ఒకరిపై ఒకరు దుమ్మె త్తిపోసుకునే రాజకీయ పార్టీలు.. చేతులు కలిపాయంటే ఆశ్చర్యం వేస్తుంది. అంతేకాదు.. ఒకపార్టీపై మరోపార్టీ నిరంతరం విమర్శలు చేసుకునే బీజేపీ-కాంగ్రెస్‌లు పొత్తు పెట్టుకున్నాయంటే.. కలలో కూడా ఊహించలేం. కానీ.. రాజకీయ అవసరాలు.. ఈ రెండు.. పార్టీలను కలపడం విశేషం. అయితే.. ఇదేదో రాష్ట్రస్థాయి ఎన్నిక కోసం కాదు!. కేవలం మేయర్ సీటు కోసమే!. అయినా.. …
Read More »కేటీఆర్ పర్యటనలో ‘జై జగన్.. జై కేసీఆర్’
వైసీపీ శ్రేణులు బీఆర్ఎస్ విజయం కోసం, బీఆర్ఎస్ కార్యకర్తలు వైసీపీ గెలుపు కోసం కోరుకుంటున్నారని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి చెప్పారు. ఆ మాటలు ఇరు పార్టీల కేడర్ మనోభావాల్లోనూ ప్రతిఫలిస్తున్నాయేమో అన్న భావనకు తాజాగా చోటుచేసుకున్న ఘటనలు బలాన్నిస్తున్నాయి. ఇటీవల జగన్ పుట్టినరోజు సందర్భంగా తాడేపల్లిలోని ఆయన నివాసం సమీపంలో కేటీఆర్, కేసీఆర్ చిత్రంతో శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. తాజాగా కేటీఆర్ …
Read More »రాజధాని రైతుల రుణమాఫీపై బాబు ఏమన్నారు?
ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు ఇచ్చిన రైతు కుటుంబాలకు శుభవార్త చెప్పారు మంత్రి నారాయణ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు, ఈ నెల 6వ తేదీ వరకు తీసుకున్న రూ.1.50 లక్షల వరకు రుణాలను మాఫీ చేయనున్నట్లు ప్రకటించారు. రాజధాని ప్రాంత రైతులకు రుణమాఫీ చేయాలని ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ చేసిన విజ్ఞప్తిపై సీఎంతో చర్చించగా, ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. అలాగే రైతులకు చెల్లించే కౌలు పెంపుపై …
Read More »రాజ్యసభ ఎఫెక్ట్: 4 మాసాల ముందే కర్చీఫ్‌లు వేసేశారా.. ?
రాష్ట్రంలో ఈ ఏడాది నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వీటిలో మూడు వైసిపి అభ్యర్థులకు సంబంధించినవి ఉండడం విశేషం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్, ఉత్తరాది రాష్ట్రానికి చెందిన పరిమళ నత్వాని, అదేవిధంగా మంగళగిరి కి చెందిన ఆళ్ల అయోధ్య రామిరెడ్డి ఈ ముగ్గురు వైసీపీ తరఫున రాజ్యసభకు ఎంపికయ్యారు. టీడీపీకి చెందిన సానా సతీష్ బాబు కూడా ఈ ఎడాది రిటైర్ కారున్నారు. …
Read More »కవిత రాజీనామాకు ఆమోదం… ఇంత ఆలస్యం ఎందుకు?
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన ఎమ్మెల్సీ పదవికి, బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఎమ్మెల్సీ పదవికి కవిత చేసిన రాజీనామాను శాసన మండలి ఛైర్మన్ ఆమోదించలేదు. ఈ క్రమంలోనే మండలి సమావేశాల్లో సోమవారంనాడు పాల్గొన్న కవిత..తన తండ్రి కేసీఆర్ పై, సోదరుడు కేటీఆర్ పై, బీఆర్ఎస్ పార్టీపై సంచలన ఆరోపణలు చేశారు. అయితే, మండలి సమావేశాలు ముగిసిన వెంటనే కవిత రాజీనామాను …
Read More »సుజనా చౌదరిని చూసి నేర్చుకోవాల్సిందే.. !
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో విజయం సాధించిన బిజెపి నాయకుడు ప్రముఖ పారిశ్రామికవేత్త సుజనా చౌదరి ఆదర్శంగా నిలుస్తున్నారు. తన నియోజకవర్గంలో చేపడుతున్న పనులను నిశితంగా పరిశీలించడంతోపాటు ఆయా పనులకు అవుతున్న ఖర్చులు అదేవిధంగా క్షేత్రస్థాయిలో ఉన్న అవసరాలను పసిగట్టి దానికి అనుగుణంగా ఆయన వ్యవహరిస్తున్నారు. అధికారులు చెప్పారని, స్థానికంగా ఉన్న నాయకులు వచ్చి కోరారని కాకుండా క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలను స్వయంగా తెలుసుకుని ఆయా పనులకు …
Read More »అసత్య కథనంపై అలుపెరగని పోరాటం
తనపై వచ్చిన అసత్య కథనంపై ఏపీ మంత్రి నారా లోకేష్ అలుపెరగని పోరాటం చేస్తున్నారు. విశాఖలోని 12వ అదనపు జిల్లా న్యాయస్థానంలో సాక్షి పత్రికపై దాఖలు చేసిన పరువునష్టం దావా కేసుకు సంబంధించి ఈరోజు ఆయన కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో ఇప్పటికే రెండు దఫాలు క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తికాగా, మూడోసారి క్రాస్ ఎగ్జామినేషన్‌కు తన న్యాయవాదులతో కలిసి హాజరయ్యారు. ‘చినబాబు చిరుతిండి.. 25 లక్షలండి’ అనే శీర్షికతో 2019 …
Read More »భారీ టాస్క్ భుజాన వేసుకున్న పవన్.. సక్సెస్ అయ్యేనా.. ?
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. పాలన పరంగా భారీ టాస్కులు భుజాన వేసుకుంటున్నారు. గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేయడంతోపాటు.. గిరిజన ప్రాంతాల్లో రహదారులు కూడా నిర్మిస్తున్నారు. ఇక, ఎక్కడ సమస్య ఉంటే అక్కడ పరిష్కారానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే.. ఇవన్నీ ఒక ఎత్తయితే.. మరోవైపు.. తాజాగా ఆయన తీర ప్రాంత పరిరక్షణ సహా పచ్చదనం పెంచేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. దీనిపై కొన్నాళ్లుగా కసరత్తు ముమ్మరం చేసిన ఆయన …
Read More »జనవరి వచ్చిందంటూ గుర్తుచేస్తున్న షర్మిల
ఏటా జనవరి వస్తోంది.. పోతుంది… సంవత్సరాలు మారుతూ క్యాలెండర్ మారుతున్నాయి అంటూ ఏపీసీసీ చీఫ్ షర్మిల గుర్తు చేస్తున్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే కదా అని సరిపెట్టుకోవడం కాదండీ.. జనవరి వచ్చింది. ఫస్ట్ తారీఖున ఇస్తామని చెప్పిన జాబ్ క్యాలెండర్ ఏదీ అంటూ ఆమె ప్రశ్నిస్తున్నారు. పనిలో పనిగా గత వైసీపీపై కూడా ఆమె సెటైర్లు వేశారు. ఐదేళ్లపాటు జాబ్ క్యాలెండర్ పేరుతో ఆ పార్టీ యువత చెవుల్లో …
Read More »ముగిసిన `మండలి`- కవిత స్పీచే రికార్డ్!
తెలంగాణ శాసన మండలి శీతాకాల సమావేశాలు ముగిశాయి. ఈ సీజన్‌లో మొత్తం 5 రోజుల పాటు మాత్రమే ఈ సమావేశాలు నిర్వహించాలని బిజినెస్ అడ్వైజరీ కమిటీ(బీఏసీ) నిర్ణయంతో ఐదు రోజుల పాటు జరిగిన సమావేశాలు మంగళవారం సాయంత్రంతో ముగిసినట్టు చైర్మన్ ప్రకటించారు. అనంతరం.. నిరవధికంగా మండలిని వాయిదా వేశారు. ఈ ఐదు రోజుల్లో మొత్తం దాదాపు 20 గంటల పాటు మండలి కార్యకలాపాలు సాగాయి. వాస్తవ సమయం 19 గంటల …
Read More »పోలవరం పరుగులు పెడుతుందండోయ్
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టు పనులు, వేగం పుంజుకున్నాయి. గత 18 నెలల వ్యవధిలో ప్రాజెక్టు పనులు 13 శాతం మేర పూర్తికాగా, మొత్తం నిర్మాణం ఇప్పటివరకు 87.8 శాతానికి చేరుకుంది. 2014 నుంచి 2019 మధ్యకాలంలోనే సివిల్ పనులు 72 శాతం పూర్తయ్యాయని అధికారులు చెబుతున్నారు. అయితే 2019 నుంచి 2024 వరకు ఐదేళ్ల పాలనలో కనీసం 2 శాతం పనులు కూడా ముందుకు …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates