తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశం రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం ఈ రిజన్వేషన్లు అమలు చేయాలని రేవంత్ సర్కార్ రెడీ అయింది. అయితే, ఆ వ్యవహారం సుప్రీం కోర్టుకు చేరడంతో తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ ఏర్పడింది. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వానికి షాకిస్తూ తాజాగా సుప్రీం కోర్టు సంచలన తీర్పునిచ్చింది. బీసీ రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్‌ఎల్‌పీ)ను సుప్రీంకోర్టు కోర్టు కొట్టివేసింది. 50 శాతం రిజర్వేషన్ల పాత పద్ధతిలోనే ఎన్నికలకు వెళ్లాలని ఆదేశించింది.
సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురైంది. 50% రిజర్వేషన్లు దాటకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన SLPని సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. 50% రిజర్వేషన్లు దాటకూడదని నిబంధన ఉన్నప్పుడు సర్వే చేసి లాభం ఏంటని ప్రభుత్వం తరఫు లాయర్ ను సుప్రీం కోర్టు ప్రశ్నించింది. అసలు చట్టం చేయకుండా జీవో ఎలా ఇస్తారని దేశపు సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates