కరణం బలరామకృష్ణమూర్తి.. సుమారు 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నటువంటి సీనియర్ నాయకుడు. టిడిపి తో ప్రస్థానం ప్రారంభించిన కరణం బలరామకృష్ణమూర్తి అంతకుముందు కాంగ్రెస్‌లోనూ పనిచేశారు. టిడిపిలో సుదీర్ఘకాలం అద్దంకి నియోజకవర్గం నుంచి విజయం సాధించి రాజకీయంగా చక్రం తిప్పారు. 2014లో జరిగిన ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుంచి టీడీపీ టికెట్ పై విజయం సాధించిన బలరామకృష్ణమూర్తి తర్వాత కాలంలో వైసీపీ పంచన చేరిపోయారు. ఈ క్రమంలోనే తన కుమారుడు కరణం …
Read More »జూనియర్ జగన్‌కు-సీనియర్ బాబుకు మరో తేడా ఇదే!
అవునన్నా కాదన్నా.. చంద్రబాబుతో పోల్చినప్పుడు.. జగన్ జూనియరేకదా! సో.. పనితీరులోనూ అదే కని పించిందని అంటున్నారు పరిశీలకులు. జూనియర్‌గా ఆయన ఐదేళ్లు పనిచేసి.. ప్రజల మనసులు చూర గొనలేకపోయారనే వాదన సొంత పార్టీలోనే అనేక మంది నాయకులు నోరు విప్పి మరీ చెప్పేస్తున్నారు. ఇక, సీనియర్ మోస్ట్(ప్రస్తుతం ఉన్న నాయకుల్లో) నాయకుడైన చంద్రబాబు తనదైన పంథాలో ముందు కు సాగుతున్నారు. అయితే.. ఇప్పుడు ఈ విషయం ఎందుకు? అంటారా? ఇక్కడే …
Read More »దువ్వాడ గొడవ.. మాధురి భర్త లైన్లోకి
గత కొన్ని రోజులుగా వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు దివ్వెల మాధురి అనే పెళ్లయిన మహిళతో సంబంధం గురించి ఎంత రచ్చ జరుగుతోందో తెలిసిందే. తమను వదిలేసి శ్రీనివాస్.. మాధురితో ఉంటుండడంపై ఆయన భార్యాపిల్లలు రోడ్డెక్కి గొడవ చేయడంతో ఈ వ్యవహారం మీడియాలో మార్మోగుతోంది. తామిద్దరు కలిసి ఉంటున్న విషయాన్ని శ్రీనివాస్, మాధురి మీడియా ముందు ఒప్పేసుకున్నారు కూడా. ఐతే శ్రీనివాస్‌ను భార్యాపిల్లలు రెండేళ్ల నుంచి పట్టించుకోకపోవడంతోనే మరో మహిళకు …
Read More »దానంపై కేసు.. పోలీసులకు వార్నింగిచ్చిన నాగేందర్
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసిన వ్యవహారం రాజకీయ దుమారానికి దారి తీసింది. తనపై కేసు పెట్టిన వారిని ఊరుకునేది లేదని నాగేందర్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. అధికారులకు ప్రవిలేజ్(శాసన సభా హక్కులు ఉల్లంఘించడం) నోటీసులు ఇస్తానని వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. అసలు ఏం జరిగింది? గత శనివారం.. ఖైరతాబాద్ నియోజకవర్గం పరిధిలోని జూబ్లీహిల్స్ డివిజన్లో ఉన్న నందగిరిహిల్స్‌లో …
Read More »కోదండరాంను వెంటాడుతున్న దాసోజు !
తెలంగాణ శాసనమండలిలో ఉన్న గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నామినేటెడ్ వ్యవహారం మరోసారి వివాదాస్పదం అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణలను ఎమ్మెల్సీలుగా నియమించాలని అప్పటి ప్రభుత్వం అప్పటి గవర్నర్ తమిళిసైకి సిఫారసు చేసింది. అయితే రాజకీయ నాయకులైన వీరిని ఎమ్మెల్సీగా నియమించడం కుదరదు అంటూ గవర్నర్ తమిళిసై ఆ సిఫారసును తోసిపుచ్చారు. తెలంగాణ ప్రభుత్వంతో విభేదాల నేపథ్యంలో తమిళిసై ఆ నిర్ణయం తీసుకున్నారు. …
Read More »బాబు కీలక నిర్ణయం .. విశాఖ బరికి కూటమి దూరం !
విశాఖ జిల్లా స్థానిక సంస్థల శాసనమండలి ఉప ఎన్నికల పోటీకి దూరంగా ఉండాలని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఈ మేరకు పార్టీ నేతలతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ లో ఆయన ఈ విషయం స్పష్టంచేశారు. ఎన్నికలలో నిలబడి గెలవడం పెద్ద ఇబ్బంది కాకున్నా ఒక ఎమ్మెల్సీ ఎన్నిక కోసం పోటీ చేయడంకన్నా, దానికి దూరంగా ఉండడమే హుందాగా ఉంటుందని చెప్పినట్లు తెలుస్తుంది. ఉమ్మడి విశాఖలో 60 …
Read More »అగ్రిగోల్డ్ ఎఫెక్ట్: వైసీపీ నేత కొడుకు అరెస్టు
వైసీపీ మాజీ మంత్రి, ఫైర్‌బ్రాండ్ నాయకుడు జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్‌ను అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్టు చేశారు. విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంలో ఉన్న నివాసంలో రాజీవ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ‘అగ్రిగోల్డ్’ భూములకు సంబంధించిన అవకతవకల వ్యవహారంలో జోగి రమేష్‌పై ఇప్పటికే కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఇబ్రహీంపట్నంలోని జోగి ఇంట్లో మంగళవారం తెల్లవారుజాము నుంచే ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. …
Read More »నామినేషన్ సరే.. బొత్స వారి గెలుపు రేంజ్ ఎంత?
నామినేషన్ వేశారు.. కానీ, గెలుస్తామన్న ధీమా అయితే కనిపించడం లేదు. అదే.. వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పరిస్థితి! ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి వైసీపీ తరఫున బొత్స సత్యనారాయణ సోమవారం నామినేషన్ వేశారు. స్థానికంగా పట్టున్న నాయకుడే అయినా.. ఇప్పుడున్న కూటమి హవా ముందు ఆయన ఎలా ముందుకు సాగుతారన్నది ప్రశ్న. ఎందుకంటే.. ఈ ఉప ఎన్నిక ప్రజలకు …
Read More »దువ్వాడ-మాధురి పరిచయం ‘గడప గడప’లోనట
ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో చర్చనీయాంశం అంటే.. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు మాధురి అనే నడి వయస్సు మహిళతో బంధం గురించే. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యతో పాటు యుక్త వయసుకు వచ్చిన ఇద్దరు కూతుళ్లను వదిలేసి ఆయన కొన్నేళ్ల కిందట పరిచయం అయిన మాధురితో ఉంటున్నారు. దీనిపై ఆయన భార్యాపిల్లలు గొడవ చేస్తున్నారు. వాళ్ల మీద శ్రీనివాస్ దాడికి కూడా ప్రయత్నించారు. కట్ చేస్తే అసలు కొన్నేళ్ల …
Read More »కేసీఆర్ కు ఇష్టమైన అధికారి ఔట్!
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ను నాయకులు కాకా పట్టిన విషయం తెలిసిందే. ఇది రాజకీయంగా తప్పుకాదు. పదవులు, అవకాశాల కోసం.. రాజకీయ నేతలు కాకా పడతారు. కాళ్లపై కూడా పడతారు. ఇది సహజం. అయితే.. కొందరు అధికారులు కూడా ఇదే పంథాను అనుసరించారు. కాళ్లపై పడలేదు కానీ.. అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్.. బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగానే …
Read More »ఏపీలో బ్రాండెడ్ లిక్కర్.. క్వార్టర్ 110
ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాణ్యమైన మద్యాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని ఎన్నికలకు ముందు చంద్రబాబు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ హామీ మేరకు.. అక్టోబరు 1వ తేదీ నుంచి నూతన మద్యం పాలసీని అందు బాటులోకి తీసుకువచ్చేందుకు కూటమి సర్కారు రెడీ అయింది. దీనికి సంబంధించి తెలంగాణ, కేరళ, కర్ణాటక సహా తమిళనాడు రాష్ట్రాల్లో మంత్రుల బృందం పర్యటించి.. పరిశీలించింది. అక్కడ అమలవుతున్న మద్యం విధానానికి సంబంధించి …
Read More »ఐదేళ్లూ ఆటు పోట్లు తప్పవు.. జగన్‌కు తెలుస్తోందా?
చేతిలో ఉన్న అధికారాన్ని సద్వినియోగం చేసుకోకపోతే.. ఎలా ఉంటుందో వైసీపీ ఒక పాఠం. 151 సీట్లు చూసుకుని.. తమకు తిరుగులేదని, తాము ఇస్తున్న పథకాలకు ఎదురు లేదని భావించిన వైసీపీ అధినేత జగన్ తాజా ఎన్నికల్లో తీవ్ర ఎదురు దెబ్బ తిన్నారు. అయితే.. ఈ పరాజయం ఇప్పటితో పోతుందని.. త్వరలోనే పార్టీ పుంజుకునే పరిస్థితి ఉంటుందని వైసీపీలో నాయకులు అంచనా వేస్తుండవచ్చు. జగన్ ఇమేజ్ పెరుగుతుందని కూడా భావిస్తుండవచ్చు. వారి …
Read More »