గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన ఈ అమ్మాయి కొన్ని రోజుల్లోనే సెలబ్రెటీ స్టేటస్ తెచ్చుకుంది. ఆ పాపులారిటీ సినిమా అవకాశాలు సైతం అందుకుంది. మోడల్‌గానూ మారింది. అలాంటి అమ్మాయి సడెన్‌గా ఇప్పుడు కేరళకు వచ్చి ఫర్మాన్ ఖాన్ అనే అబ్బాయిని పెళ్లి చేసుకోవడం సంచలనం రేపింది.
ఫేస్ బుక్ ద్వారా పరిచయం అయిన అబ్బాయి కోసం కేరళకు వచ్చి.. తమ పెళ్లికి సహకరించాలని, కుటుంబ సభ్యుల నుంచి రక్షణ కల్పించాలని ఆమె పోలీసులను కోరింది. ఇలా కోరిన కొన్ని గంటలకే ఆమె ఫర్మాన్‌ను పెళ్లి కూడా చేసుకుంది. ఐతే హిందూ అమ్మాయిలను ట్రాప్ చేసి పెళ్లి చేసుకోవడం ముస్లిం అబ్బాయిలకు అలవాటే అని.. ఇది లవ్ జిహాద్ అని కొందరు సోషల్ మీడియాలో ఆరోపిస్తున్నారు.
ఈ ఆరోపణలపై మోనాలిసా, ఫర్మాన్ జంట స్పందించింది. పెళ్లి అనంతరం మీడియా ముందుకు వచ్చిన ఈ జోడీ.. లవ్ జిహాద్ ఆరోపణలను తిప్పి కొట్టింది.
ఈ వివాదంపై ఫుర్మాన్ ఖాన్ స్పందించారు.
ఇది లవ్ జీహాద్ కాదని.. తమ మధ్య ఉన్నది స్వచ్ఛమైన ప్రేమ అని.. తామిద్దరం ఎవరి మతాలను వారు అనుసరిస్తామని.. అన్ని మతాలను గౌరవిస్తామని.. అన్నిటికంటే ముందు తామిద్దరం మనుషులం అని ఫర్మాన్ స్పష్టం చేశాడు. మరోవైపు మోనాలిసా మాట్లాడుతూ.. తనకు హిదూ ధర్మం మీద ఉన్న గౌరవం ఎప్పటికీ కొనసాగుతుందని.. పెళ్లి అనేది తన వ్యక్తిగత నిర్ణయమని, దీనికి మతం రంగు పులమవద్దని కోరింది.
మోనాలిసా, ఫర్మాన్ ఇంత స్పష్టంగా విషయం చెప్పినా.. సోషల్ మీడియాలో మాత్రం వారిపై ఎటాక్ ఆగట్లేదు. మరోవైపు మోనాలిసాకు సినిమా అవకాశం ఇచ్చిన దర్శకుడు ఆమె నిర్ణయాన్ని తప్పుబట్టాడు. కుంభమేళాలో మోనాలిసా చూపిన ధైర్యం, తన వ్యక్తిత్వం చూసి తాను ప్రభావితమయ్యానని, సనాతన ధర్మానికి ఆమె ఒక ప్రతినిధిగా నిలుస్తుందని భావించి సినిమాలో అవకాశం ఇచ్చానని.. పెళ్లి విషయంలో ఆమె నిర్ణయం తనను విస్మయానికి గురిచేసిందని ఆయనన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates