తిరుమల–తిరుపతికి సంబంధించిన తప్పుడు వార్తలు సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నాయని టీటీడీ తెలిపింది. ఇలాంటి వార్తలను నమ్మకుండా, అధికారిక టీటీడీ ప్రకటనలనే విశ్వసించాలని భక్తులకు సూచించింది. నిన్న రాత్రి ఒక వ్యక్తి లోనికి ప్రవేశించారు. ఉన్నట్లుండి అతను అక్కడ ఉన్న టెంట్ కొయ్యల ద్వారా నడిమి గోపురం పైకి ఎక్కడం జరిగింది. దీనిపై టీటీడీ వివరణ ఇచ్చింది.
నిన్న రాత్రి నిజామాబాద్‌కు చెందిన కూర్మవాడ పెద్దమల్లారెడ్డి కాలనీకి చెందిన తిరుపతి అనే వ్యక్తి ఇతర భక్తుల మాదిరిగానే తిరుపతి శ్రీగోవిందరాజస్వామి ఆలయంలోకి వెళ్లాడు. కొద్దిసేపటికి అతడు అకస్మాత్తుగా ఆలయంలో ఉన్న టెంట్ కొయ్యల మీదుగా నడుచుకుంటూ గోపురం పైకి ఎక్కేందుకు ప్రయత్నించాడు. దీనిని గమనించిన విజిలెన్స్ సిబ్బంది వెంటనే పోలీస్, ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు.
పోలీసులు, ఫైర్ సిబ్బంది దాదాపు మూడు గంటల పాటు శ్రమించి అతడిని గోపురం పై నుంచి కిందికి దించారు. అతడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. గోపురంపై ఉన్న కలశాలను అతడు పగలగొట్టాడన్న ప్రచారం పూర్తిగా అసత్యమని టీటీడీ స్పష్టం చేసింది. భక్తులు ఇలాంటి వదంతులను నమ్మవద్దని, అధికారిక సమాచారం ప్రకారమే స్పందించాలని కోరింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates