సినిమా స్టార్ల కొడుకులు ఈజీగానే హీరోలు అయిపోతారు. వాళ్లు కూడా స్టార్లుగా ఎదిగిపోతుంటారు. చాలా కొద్ది మంది మాత్రమే.. ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేక ఇబ్బంది పడటం, సినిమాల నుంచి వైదొలగడం చేస్తుంటారు. ఇక్కడ లుక్స్ ఎలా ఉన్నా.. పెద్దగా టాలెంట్ లేకపోయినా కూడా నడుస్తుంది కానీ.. ఆటల్లో అలా కుదరదు. ముఖ్యంగా క్రికెట్లో స్టార్ ఆటగాళ్ల వారసత్వాన్నందుకుని కెరీర్ ఆరంభించిన వాళ్లలో తమ తండ్రుల స్థాయికి ఎదిగిన వాళ్లు దాదాపుగా కనిపించరు. …
Read More »గంగూలీకి గుండెపోటు.. అసలు కారణం ఇదీ
భారత క్రికెట్‌ను గొప్ప మలుపు తిప్పి, టీమ్ ఇండియాను ప్రపంచ మేటి జట్లలో ఒకటిగా నిలబెట్టిన ఘనత సౌరభ్ గంగూలీదే. ఆటగాడిగా, కెప్టెన్‌గా గంగూలీ వేసిన ముద్ర అలాంటిలాంటిది కాదు. అందుకే అతడిని కోట్లాది మంది ఆరాధిస్తారు. ఆట నుంచి నిష్క్రమించాక క్రికెట్ పాలనలోకి అడుగు పెట్టిన గంగూలీ.. చాలా తక్కువ కాలంలో ఇంతింతై అన్నట్లు ఎదిగిపోయాడు. ఏకంగా బీసీసీఐ అధ్యక్ష పదవి చేపట్టాడు. అంతా బాగా సాగుతున్న సమయంలో …
Read More »2021 చివరి వరకూ ఇంటి నుంచే పని.. తాజా సర్వే వెల్లడి
2020 వెళ్లిపోయింది. ఎన్నో ఆశలతో మేజిక్ ఫిగర్ లాంటి ఇయర్ లో తమకు మర్చిపోలేని ఎన్నో అనుభూతుల్ని మిగులుస్తుందని భావిస్తే.. అందుకు భిన్నంగా కరోనాతో వణికించి వెళ్లిపోయింది. కొత్త సంవత్సరం వచ్చేసింది. కొత్తగా ఏమైనా ఉంటుందా? అంటే.. నో చెప్పేస్తున్నాయి ఐటీ కంపెనీలు. 2020 ప్రభావం 2021 మీద కూడా ఉంటుందని తేలుస్తున్నారు. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది చివరి వరకు ఇంటి నుంచి పని చేసే విషయంలో కంపెనీలన్ని …
Read More »షాకింగ్: సౌరభ్ గంగూలీకి హార్ట్ ఎటాక్
ఇది భారత క్రికెట్ ప్రియులకే కాదు.. భారతీయులందరికీ పెద్ద షాక్. భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత గొప్ప కెప్టెన్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్న కోల్‌కతా రాకుమారుడు సౌరభ్ గంగూలీకి గుండె పోటు వచ్చింది. అతను ప్రస్తుతం కోల్‌కతాలోని వుడ్‌ల్యాండ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతానికి గంగూలీ ఆరోగ్యం నిలకడగానే ఉందని.. అతను కోలుకుంటున్నాడని అంటున్నారు. శనివారం సాయంత్రం గంగూలీకి యాంజియోప్లాస్టీ చేయాల్సి ఉందట. ‘‘గంగూలీకి గుండె సమస్య తలెత్తింది. యాంజియోప్లాస్టీ …
Read More »జస్ట్ 4 రోజుల్లో రూ.వెయ్యి కోట్లకు పైనే తాగేశారు
తెలంగాణలో గడిచిన నాలుగు రోజులుగా సాగిన మద్యం అమ్మకాలు సరికొత్త రికార్డుల్ని క్రియేట్ చేస్తున్నాయి. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు తెలంగాణ వ్యాప్తంగా మందు అమ్మకాలు మా జోరుగా సాగినట్లుగా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఒకవైపు వేడుకలపై నియంత్రణ.. బార్లు.. పబ్బులపై పరిమితులు ఉన్న వేళలోనూ.. భారీగా అమ్మకాలు సాగటం ఆసక్తికరంగా మారింది. డిసెంబరు నెలలోని చివరి నాలుగు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా రూ.1068.4 కోట్ల మద్యం.. బీరు అమ్మకాలు …
Read More »డేవిడ్ వార్నర్.. తనకు తనే ఇచ్చేసుకున్నాడు
భారత క్రికెట్ అభిమానులకు.. ముఖ్యంగా తెలుగు క్రికెట్ ప్రియులకు ప్రస్తుతం అంత్యంత ఇష్టమైన క్రికెటర్ ఎవరు అంటే మరో మాట లేకుండా డేవిడ్ వార్నర్ పేరు చెప్పేయొచ్చు. తెలుగువారి ఐపీఎల్ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కొన్నేళ్లుగా అతనే కెప్టెన్. ప్రతి సీజన్లోనూ అద్భుతమైన ప్రదర్శనతో తన జట్టును ముందుకు నడిపిస్తూ అభిమానులను అలరిస్తుంటాడతను. 2016లో తన జట్టుకు ఐపీఎల్ ట్రోఫీ కూడా అందించాడు వార్నర్. ఇక ఈ ఏడాది లాక్ …
Read More »హైదరాబాద్ కుర్రాడు అదరగొట్టాడుగా..
పది రోజుల కిందట భారత క్రికెట్ జట్టు ఎంతటి పరాభవాన్ని ఎదుర్కొందో తెలిసిందే. అడిలైడ్‌లో ఆరంభమైన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తొలి మ్యాచ్‌లో తొలి రెండు రోజులు ఆటలో పైచేయి సాధించి.. మూడో రోజు అనూహ్యంగా రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 36 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని ఖాతాలో వేసుకుంది భారత్. భారత క్రికెట్ చరిత్రలోనే అది ఓ ఇన్నింగ్స్‌లో సాధించిన అత్యల్ప స్కోరు కావడంతో కోహ్లీ సేనకు అవమానంగా మారింది. …
Read More »ఈ దశాబ్దానికి కోహ్లీనే కింగ్
ఏటా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఇచ్చే అవార్డులను ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తారు క్రికెటర్లు. గత దశాబ్ద కాలంలో చాలా ఏళ్లు ఐసీసీ అవార్డుల్లో భారత సూపర్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీదే హవా. ఇప్పుడు ఐసీసీ ప్రకటించిన దశాబ్దపు అవార్డుల్లోనూ అతను తన ఆధిపత్యాన్ని చాటాడు. పురుషల క్రికెట్లో ఈ దశాబ్దపు ఉత్తమ క్రికెటర్‌గా విరాట్ కోహ్లీనే నిలవడం విశేషం. సచిన్, ద్రవిడ్, లక్ష్మణ్, సెహ్వాగ్, పాంటింగ్, సంగక్కర, …
Read More »మోడీ నోట విశాఖ కుర్రాడి మాట.. ఎవరీ వెంకట మురళీ ప్రసాద్?
ప్రధాని మోడీ మానసపుత్రిక మన్ కీ బాత్. తన మనసులోని మాటల్ని చెప్పేందుకు మోడీ ఎంచుకున్న ఈ కార్యక్రమంలో.. ఆయన తన వరకు వచ్చిన పలు ఆసక్తికర అంశాల్ని ప్రస్తావిస్తుంటారు. తాజాగా నిర్వహించిన మన్ కీ బాత్ లో.. విశాఖ పట్నానికి చెందిన వెంకట మురళీ ప్రసాద్ అనే విశాఖ యువకుడి ప్రస్తావనను ప్రత్యేకంగా తీసుకొచ్చారు. ఆయన ఆలోచనను మోడీ ప్రశంసించారు. అంతేకాదు.. దేశ ప్రజలతో ఆయన ఆలోచనల్నివివరంగా వెల్లడించారు. …
Read More »ఏపీలో సంచలనం రేపుతున్న ‘దిశ’ తరహా కేసు
నిర్భయ ఉదంతం మీద అంత చర్చ జరిగింది. జనాల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. నిందితులందరికీ శిక్ష పడింది. కాస్త ఆలస్యమైనప్పటికీ నలుగురిని ఉరి తీశారు. ఇక తెలంగాణలో అయితే ఓ అమ్మాయిపై అఘాయిత్యానికి ఒడికట్టి తనను పెట్రోల్ పోసి తగలబెట్టేసిన నలుగురినీ కొన్ని రోజులకే ఎన్కౌంటర్ చేసి చంపేశారు. ఇంత జరిగినా దేశంలో అమ్మాయిలపై అఘాయిత్యాలేమీ ఆగిపోలేదు. ఎక్కడో ఒక చోట తరచుగా ఇలాంటి ఘోరాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా …
Read More »కోహ్లీకి అలా.. నటరాజన్‌కు ఇలా
భారత క్రికెట్ జట్టు ఇప్పుడు తీవ్ర ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది. ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో ఘోర పరాభవం పాలైంది టీమ్ ఇండియా. రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 36 పరుగులకే కుప్పకూలి అవమాన భారాన్ని మూటగట్టుకుంది. ఆ మ్యాచ్‌లో చిత్తుగా ఓడి ఆత్మవిశ్వాసం దెబ్బ తిన్న స్థితిలో జట్టుకు మూల స్తంభం అయిన విరాట్ కోహ్లికి స్వదేశానికి వచ్చేస్తున్నాడు. అతను చివరి మూడు టెస్టులకూ …
Read More »తెలంగాణాలో పెరిగిపోతున్న ‘స్ట్రెయిన్’ టెన్షన్
స్ట్రెయిన్ కరోనా వైరస్ తెలంగాణా ప్రభుత్వాన్ని బాగా టెన్షన్ పెట్టేస్తోంది. ఎక్కడో బ్రిటన్ను రూపం మార్చుకున్న కరోనా వైరస్ వణికించేస్తోందంటే అర్ధముంది. మరి అదే వైరస్ తెలంగాణాను కూడా ఎందుకు వణికించేస్తున్నట్లు ? ఎందుకంటే బ్రిటన్ నుండి తెలంగాణాకు ఈనెలలో 3 వేలకు పైగా వచ్చారట. ఇలా వచ్చిన వారిలో అత్యధికులు అంటే సుమారు 800 మందికి పైగా హైదరాబాద్ లోనే ఉన్నట్లు ఎయిర్ పోర్టు అథారిటి నుండి అందిన …
Read More »