కరోనా విషయంలో ముందుగా హెచ్చరించలేదని బాధపడుతుంటాం. కానీ, కొన్ని కొన్ని హెచ్చరికలు మన దాకా వస్తే.. మాత్రం ఒళ్లు గగుర్పొడుస్తుంది! అంత భీతా వహ పరిస్థితి ఎదురవుతుందా? అని చెమటలు కూడా పడతాయి. ఇప్పుడు ఇలాంటి అంచనానే ఒకటి దేశాన్ని సైతం కలవరపరుస్తోంది. దేశంలోనే ప్రఖ్యాతి గడించిన సంస్థ.. ఐఐఎస్(ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్) తాజాగా కర్ణాటక రాజధాని, దేశానికే ఐటీ కేపిటల్‌గా ఉన్న బెంగళూరులో కరోనా పరిస్థితిపై అధ్యయనం …
Read More »ఐపీఎల్ కుర్రాడు.. అయ్యో పాపం
చేతన్ సకారియా.. ఐపీఎల్ 14వ సీజన్ మధ్యలో ఆగిపోవడానికి ముందు, లీగ్ ఆరంభంలో మార్మోగిన యువ ఆటగాళ్ల పేర్లలో ఇదొకటి. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఈ ఐపీఎల్లో ఈ కుర్రాడు మెరుపు ప్రదర్శనలు చేశాడు. రెండు మ్యాచుల్లో మూడేసి వికెట్లు పడగొట్టాడు. ప్రతిభావంతులైన లెఫార్ట్ పేసర్లు కరవైన భారత క్రికెట్లో ఈ కుర్రాడు ఆశాకిరణంలా కనిపించాడు. సౌరాష్ట్రాకు చెందిన చేతన్ వయసు 23 ఏళ్లే. ఐతే ఈ ఐపీఎల్లో మెరుపులు …
Read More »కరోనా తగ్గిన రోగులపై ‘బ్లాక్ ఫంగస్’ దాడి
కరోనా వైరస్ వచ్చి తగ్గిన రోగులపై మరో రకమైన దాడి మొదలైంది. కరోనా వైరస్ వచ్చి కోలుకున్న వారిలో మ్యూకర్ మైకోసిస్ (బ్లాక్ ఫంగస్) సమస్య పెరిగిపోతున్నట్లు వైద్య నిపుణులు గుర్తించారు. కరోనా వచ్చి కోలుకున్నా బ్లాక్ ఫంగస్ సమస్యను సకాలంలో గుర్తించి చికిత్స అందిచకపోతే చనిపోవటం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇమ్యునిటి కెపాసిటి తక్కువున్న వారిలోనే ఈ ఫంగస్ ప్రభావం చాలా ఎక్కువగా ఉందని కూడా డాక్టర్లు గుర్తించారు. …
Read More »బీసీసీఐ వినూత్న ప్రయోగం
ఒక్కో ఫార్మాట్‌కు ఒక్కో జట్టును ఎంపిక చేయడం.. వేర్వేరు ఫార్మాట్లకు వేర్వేరుగా కెప్టెన్లను ఎంపిక చేయడం విదేశీ జట్ల విషయంలో చూస్తుంటాం. కానీ ఇండియన్ క్రికెట్ టీం విషయంలో సాధారణంగా ఇలా జరగదు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ఇలా వేర్వేరు ఫార్మాట్లకు వేర్వేరు కెప్టెన్లను చూస్తుంటాం. 2007 వన్డే ప్రపంచకప్‌లో ఘోర వైఫల్యం తర్వాత సీనియర్లంతా తప్పుకుని.. ధోని నేతృత్వంలో ఓ యువ జట్టు టీ20 ప్రపంచకప్‌కు వెళ్లి …
Read More »ఐపీఎల్ ఆగింది.. కానీ కరోనా ఆగలేదు
కరోనా ధాటికి నాలుగు రోజుల కిందట ఇండియన్ ప్రిమియర్ లీగ్ 14వ సీజన్ అర్ధంతరంగా ఆగిపోయిన సంగతి తెలిసిందే. రెండు రోజుల వ్యవధిలో అరడజను దాకా కేసులు వెలుగు చూడటంతో టోర్నీని కొనసాగించే పరిస్థితి లేకపోయింది. ఎంతో సురక్షితం అనుకున్న బయో బబుల్ లోపల కరోనా కేసులు బయటపడటంతో వైరస్ ప్రభావం అంతటితో ఆగదని అర్థం చేసుకుని మరో మార్గం లేక లీగ్‌ను ఆపేసింది బీసీసీఐ. ఐతే లీగ్ ఆగినా.. …
Read More »ఆ లెజెండ్ మర్డర్ కేసులో ఇరుక్కున్నాడు
సుశీల్ కుమార్.. దేశం గర్వించదగ్గ రెజ్లింగ్ క్రీడాకారుడు. వరుసగా రెండు ఒలింపిక్స్‌లో పతకాలు సాధించి ఆ ఘనత సాధించిన తొలి భారత క్రీడాకారుడిగా రికార్డులకెక్కాడు. 2008 ఒలింపిక్స్ రెజ్లింగ్‌లో కాంస్యం సాధించిన అతను తర్వాతి ఒలింపిక్స్‌లో రజతం అందుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్షిప్ రెజ్లింగ్‌లో స్వర్ణం సాధించిన తొలి క్రీడాకారుడిగానూ అతను ఘనత వహించాడు. ఇంకా ఎన్నో గొప్ప విజయాలు, ఘనతలు అతడి ఖాతాలో ఉన్నాయి. ఇలాంటి దిగ్గజ క్రీడాకారుడు ఇప్పుడు …
Read More »ఆసుపత్రి బెడ్‌పై.. మృతదేహం పక్కనే..
ఇది కొవిడ్ టైం. కరోనాతో ఎవరైనా చనిపోతే దరిదాపుల్లోకి వెళ్లడానికి కూడా భయపడిపోతాం. ఇక మనకు కూడా కరోనా లక్షణాలు ఉన్నపుడు.. వైరస్‌తో చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని చూస్తే కంపించిపోతాం. అలాంటిది కరోనా చనిపోయిన ఓ వృద్ధుడి పక్కనే పడుకుని రెండు గంటల పాటు అత్యవసర స్థితిలో ఆక్సిజన్ ఎక్కించుకున్న వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించి చూడండి. ఈ భయానక అనుభవాన్ని అనంతపురం జిల్లాలో ఒక యువకుడు …
Read More »ఆ క్రికెటర్ పరిస్థితి దయనీయం
వేద కృష్ణమూర్తి.. భారత మహిళల క్రికెట్‌ను అనుసరించే వారికి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. ఈ ఆల్‌రౌండ్ క్రికెటర్ భారత్ తరఫున 48 వన్డేలు, 76 టీ20లు ఆడింది. కొంత కాలంగా భారత జట్టుకు దూరంగా ఉన్న వేద.. తన కుటుంబంలో వరుస విషాదాలతో తీవ్ర మానసిక వేదనను అనుభవిస్తోంది. ఆమె కుటుంబంలో జరిగిన ఘోరాలు తెలిస్తే ఎవరికైనా కన్నీళ్లు రాక మానవు. కర్ణాటకలోని కాడూర్‌లో నివసించే …
Read More »ఐసీఎంఆర్ అలా చెప్పనే లేదు
గత ఏడాది ఇండియాలో కరోనా ప్రభావం మొదలైనప్పటి నుంచి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్)కు ఎనలేని ప్రాధాన్యం పెరిగింది. అంతకుముందు ఈ పేరుతో ఓ సంస్థ ఉందని తెలియని వాళ్లు కూడా.. కరోనా ధాటికి ఆ సంస్థ ఇచ్చే మార్గదర్శకాలను పాటించడం మొదలుపెట్టారు. దేశంలో కొవిడ్‌పై పోరులో ఈ సంస్థ ఇచ్చే సూచనలు, మార్గదర్శకాలు ఎంతో కీలకంగా మారాయి. వాట్సాప్ యూనివర్శిటీ మేధావుల పుణ్యమా అని కోవిడ్ …
Read More »కరోనాపై ఆ దేశాల సక్సెస్.. ఈ దేశాల ఫెయిల్యూర్ ఒక్కటే అంశం
ఒకేలాంటి సమస్యను పది మందికి ఇస్తే.. ఒక్కొక్కరు ఒక్కోలా రియాక్టు అవుతారు. సరిగ్గా కరోనా విషయంలోనూ ఇలానే జరిగింది. అక్కడెక్కడో వూహాన్ మహానగరంలో పుట్టిన కంటికి కనిపించని మహమ్మారి.. ప్రపంచం మొత్తాన్ని పాకేసింది. అయితే.. కొన్ని దేశాలు అద్భుతంగా వ్యవహరించి.. ఆ రాకాసి కోరల్ని పీకేసి.. పక్కన పెట్టేయటమే కాదు.. తమ ప్రజలకు ఎలాంటి హాని కలుగకుండా చూసుకున్నాయి. అదే సమయంలో.. మరికొన్ని దేశాలు.. దానికి సమర్థవంతంగా చెక్ పెట్టే …
Read More »ఐపీఎల్ మళ్లీ ఎప్పుడో గంగూలీ హింటిచ్చాడు
ఇండియన్ ప్రిిమియర్ లీగ్ 14వ సీజన్ అర్ధంతరంగా వాయిదా పడిపోయి అభిమానులకు తీవ్ర నిరాశను మిగిల్చింది. కరోనా కల్లోల సమయంలో అన్ని వినోదాలూ బంద్ అయిపోయిన నేపథ్యంలో ఐపీఎల్‌తోనే ఉపశమనం పొందుతున్న అభిమానులకు ఈ పరిణామం ఎంతమాత్రం రుచించలేదు. ముందు లీగ్ ఆపేస్తున్నట్లు వార్త బయటికి రాగానే.. కొన్ని రోజులు విరామం ఇచ్చి, ఆ తర్వాత మ్యాచ్‌లు జరిపిస్తారని అనుకున్నారు. కానీ అలా కాకుండా లీగ్‌ను వాయిదా వేస్తున్నారని.. ఆటగాళ్లు …
Read More »రష్యా కొత్త వ్యాక్సిన్.. ఒక్క డోసు చాలట.. రిజల్ట్ సూపర్!!
ప్రపంచాన్ని కరోనా కమ్మేస్తున్న సమయంలో రష్యా శాస్త్రవేత్తలు గొప్ప శుభవార్త చెప్పారు. కరోనాపై పోరులో భాగంగా ఇప్పటి వరకు వ్యాక్సిన్ల రూపకల్పన జరిగిన విషయం తెలిసిందే. కోవిషీల్డ్, కోవ్యాగ్జిన్, స్పుత్నిక్, ఫైజర్ బయోఎన్ టెక్.. ఇలా వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే.. వీటిని రెండు డోసులుగా తీసుకోవాల్సి ఉంటుంది. 28 రోజుల గ్యాప్‌లో రెండు డోసులు తప్పనిసరి. పైగా సైడ్ ఎఫెక్టులు వచ్చే అవకాశం కూడా ఉందని వ్యాక్సిన్ తీసుకునేవారు …
Read More »