పోయింది.. వెళ్లిపోయిందనుకున్న కరోనా తిరిగి వచ్చేసింది. వెళ్లేటప్పుడు ఎంత బలహీనంగా వెళ్లిందో.. తిరిగి వచ్చేటప్పుడు మరింత బలంగా విరుచుకుపడుతోంది. ఇటీవల కాలంలో దేశంలో పాజిటివ్ కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. దేశంలో నమోదవుతున్న కేసుల్లో అత్యధికం మహారాష్ట్రలోనే కావటం గమానార్హం. ఒకరోజులో ఇంత భారీగా కేసులు విరుచుకుపడుతున్న వైనం చూస్తే.. ఇతర రాష్ట్రాల వారికి గుండెల్లో రైళ్లు పరిగెత్తే పరిస్థితి. ఈ ఏడాది ఇప్పటివరకు ఎప్పుడూ లేని రీతిలో ఒకే …
Read More »మళ్ళీ పెరిగిపోతున్న లాక్ డౌన్
ప్రపంచాన్ని కరోనా వైరస్ ఇప్పట్లో వదిలేట్లు కనబడటం లేదు. ఒకరూపం కాకపోతే మరోరూపంలో విజృభిస్తునే ఉంది. తాజాగా 8 దేశాల్లో మళ్ళీ లాక్ డౌన్ విధించారంటేనే పరిస్ధితి ఎంత భయంకరంగా ఉందో అర్ధమైపోతోంది. సౌదీ అరేబియా, టాంజానియా, బ్రెజిల్, యూకే, ఫ్రాన్స్ , ఇటలీ, స్పెయిన్ దేశాలు సంపూర్ణ లాక్ డౌన్ విధించాయి. బయట ప్రపంచంతో పై దేశాలు అన్నీ రకాల రాకపోకలను నిషేధించాయి. పై దేశాల్లో అంతర్గత పరిస్ధితులను …
Read More »కరోనా టీకా వృథా అవుతోందట
ప్రపంచమంతా ఎంతో ఆతృతతో ఎదురు చూస్తుంటే తెలుగురాష్ట్రాల్లో మాత్రం కరోనా వైరస్ టీకా వృధా అవుతోంది. గడచిన ఏడాదిగా యావత్ ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికించేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. దాదాపు పదిమాసాల తర్వాత వైరస్ కు విరుగుడు టీకాను కొన్ని ఫార్మాకంపెనీలు తయారుచేశాయి. టీకాను వేసుకోవటానికి కూడా కోట్లాదిమంది జనాలు ఎదురుచూస్తున్నారు. ఇలాంటి నేపధ్యంలోనే మనదేశంలో కూడా వ్యాక్సినేషన్ మొదలైంది. ఇందులో భాగంగానే తెలుగురాష్ట్రాల్లో 10 శాతం టీకాలు …
Read More »దేశంలో రూ.7 కోట్ల కనీస ఆస్తి ఉన్న కుటుంబాలు ఎన్నో తెలుసా?
మినిమం రూ.7కోట్ల సంపద ఉన్న కుటుంబాలు దేశంలో ఎన్ని ఉన్నాయన్న ప్రశ్నకు తాజాగా సమాధానం లభించింది. డాలర్ మిలియనీర్ లో భాగంగా ఈ లెక్కింపును చేపట్టారు. హురున్ ఇండియావెల్త్ రిపోర్టు 2020 ప్రకారం.. దేశంలో రూ.7కోట్లు కనీసం ఆసక్తి ఉన్న కుటుంబాలు ఏకంగా 4.12 లక్షలు ఉన్నట్లుగా తేల్చారు. అంతేకాదు.. ఈ సంపన్న కుటుంబాల్లో 70 శాతం దేశంలోని టాప్ 10 రాష్ట్రాల్లోనే ఉన్నట్లుగా ఈ నివేదిక వెల్లడించింది. ఈ …
Read More »బ్రేకింగ్.. భారత్-ఇంగ్లాండ్ టీ20లు ఖాళీ స్టేడియంలో
ఇండియాలో లాక్ డౌన్ షరతులన్నీ దశలు వారీగా తొలగించేశారు. థియేటర్లలో 50 పర్సంట్ ఆక్యుపెన్సీ రూల్ తొలగిపోయింది. స్టేడియాల్లోకి కూడా అభిమానులను అనుమతించేస్తున్నారు. 50 శాతం మంది అభిమానులతో మ్యాచ్‌లు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 1 నుంచి అభిమానులకు అనుమతులు లభించగా.. ఇంగ్లాండ్‌తో తొలి టెస్టును మాత్రమే ఖాళీ స్టేడియంలో నిర్వహించారు. తర్వాత నుంచి స్టేడియాలు 50 శాతం ఆక్యుపెన్సీతో కళకళలాడుతున్నాయి. ముఖ్యంగా ప్రపంచంలోనే అతి పెద్దదైన స్టేడియంగా …
Read More »అమ్మకానికి హైదరాబాద్ ఎయిపోర్టు.. కేంద్రం కీలక నిర్ణయం
రూ.2.5లక్షల కోట్లు కావాలి. భారీ నిధుల సమీకరణ కోసం ఆస్తుల్ని అమ్మేయటమే పనిగా పెట్టుకున్న మోడీ సర్కారు.. ఇప్పటికే ఎయిరిండియా.. బీఎస్ఎన్ఎల్.. వైజాగ్ స్టీల్ ను విక్రయించేందుకు సిద్ధం కావటం తెలిసిందే. తాజాగా హైదరాబాద్ ఎయిర్ పోర్టుతో పాటు.. మరిన్ని ఎయిర్ పోర్టుల్ని అమ్మేయాలన్న ఆలోచనకు వచ్చేసినట్లుగా చెబుతున్నారు. తన వాటాలు అధికంగా ఉన్న నాలుగు ఎయిర్ పోర్టులను తాజాగా సేల్ కు పెట్టినట్లుగా తెలుస్తోంది. కేంద్రానికి చెందిన ఎయిర్ …
Read More »పిల్లల ఆసుపత్రికి రూ.300 కోట్లు ఇచ్చిన పెద్ద మనిషి
కోటి కాదు రెండు కోట్లు కాదు. ఏకంగా రూ.300 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించి సంచలనంగా మారారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి భారీ మొత్తంలో విరాళం ఇవ్వటమే కాదు.. తిరుపతిలో చిన్నపిల్లల ఆసుపత్రి నిర్మాణానికి తన వంతుగా చేసిన సాయం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. ఇంతకూ రూ.300కోట్ల భారీ విరాళాన్ని ఇచ్చిందెవరంటే.. ముంబయికి చెందిన ఉద్వేగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అండ్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ (చిన్నగా చెప్పుకోవాలంటే యూఐసీ) సంస్థ. …
Read More »టమాటా కోసం ఆ దేశం రెండుగా విడిపోయి కొట్టుకుంది
వినేందుకు విచిత్రంగా అనిపించినా ఇది నిజం. చిన్న గొడవలే తర్వాతి దశల్లో పెద్దవిగా మారుతుంటాయి. మహాభారతాన్నే చూస్తే.. ఈగో అనే మాట లేకపోతే లక్షలాది మంది మరణాలకు కారణమైన యుద్ధమే లేదు. ఆ పురాణాన్ని పక్కన పెడితే.. గంపెడు టమాటా కోసం దేశం రెండు వర్గాలుగా చీలి పరస్పర దాడులతో అతలాకుతలం కావటాన్నిఊహించగలరా? సంచలనంగా మారిన ఈ ఘర్షణ ఎక్కడ జరిగాయన్నది చూస్తే.. ఆఫ్రికాలోని నైజీరియాలో టమోటా బుట్టల కారణంగా …
Read More »వివాదంలోకి జొమాటో.. ఆర్డర్ ఇచ్చిన మహిళ ఇంట్లోకి వెళ్లి పిడిగుద్దులు
అవసరమైన ఫుడ్ ను ఆన్ లైన్ లో ఆర్డర్ చేయటం.. ఆ వెంటనే ఇంటికి తీసుకొచ్చి డెలివరీ చేసే ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో మరోసారి వివాదంలో చిక్కుకుంది. తాజా ఉదంతంలో డెలివరీ బాయ్ మహిళపై దాడి చేసిన ఉదంతం షాకింగ్ గా మారింది. చిన్న విషయానికే రక్తం వచ్చేలా కొట్టటమే కాదు.. తీవ్ర గాయానికి పాల్పడిన అతడి తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇంతకూ …
Read More »రెండో పెళ్లి చేసుకుంది.. భర్తను చంపేసి ఇంట్లోనే పూడ్చి పెట్టింది
షాకింగ్ హత్య ఒకటి వెలుగు చూసింది. హైదరాబాద్ శివారులోని వనస్థలిపురంలో చోటు చేసుకున్న ఈ దారుణం గురించి తెలిసిన వారంతా అవాక్కు అవుతున్నారు. ఇలాంటోళ్లు కూడా ఉంటారా? అని ఆశ్చర్యానికి గురవుతున్నారు. కనిపించకుండా పోయాడనుకున్న వ్యక్తి ఇంట్లోనే హత్యకు గురై.. అదే ఇంట్లోనే పాతి పెట్టేశారన్న దారుణ నిజాన్ని జీర్ణించుకోలేని పరిస్థితి. అసలేం జరిగిందంటే.. రెండేళ్ల క్రితం మొదటి భార్యకు విడాకులు ఇచ్చేసిన గగన్ అగర్వాల్ అనే వ్యక్తి గత …
Read More »హైదరాబాద్‌లో నో ఐపీఎల్.. బేఫికర్
ఈసారి ఐపీఎల్ ఇండియాలోనే నిర్వహిస్తున్నప్పటికీ.. హైదరాబాద్‌కు మ్యాచ్‌లు కేటాయించకపోవడం ఇక్కడి అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. టోర్నీ వేదికల్ని ఎనిమిది నుంచి ఆరుకు కుదించడానికి కరోనానే కారణం. ఐతే కరోనా కేసులు ఎక్కువగా ఉన్న ముంబయిని ఐపీఎల్ కోసం ఎంపిక చేసి.. వైరస్ ప్రభావం తక్కువగా ఉన్న హైదరాబాద్‌కు మొండి చేయి చూపించడం విడ్డూరంగా తోచింది అందరికీ. అలాగే అసలు ఐపీఎల్ ఫ్రాంఛైజీనే లేని అహ్మదాబాద్‌ను ఒక వేదికగా …
Read More »బుమ్రా పెళ్లి ఆమెతో కాదు.. ఈమెతో
భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా పెళ్లి గురించి కొన్ని రోజులుగా ఎంత చర్చ జరుగుతోందో తెలిసిందే. ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్టు నుంచి వ్యక్తిగత కారణాలు చెప్పి తప్పుకున్నప్పటి నుంచి అతడి వివాహం గురించి ఊహాగానాలు మొదలయ్యాయి. అతను పెళ్లి చేసుకోబోతుండటం వాస్తవమే కానీ.. వధువు ఎవరనే విషయంలోనే సస్పెన్స్ నడిచింది. దక్షిణాది సినీ తార అనుపమ పరమేశ్వరన్తో బుమ్రా వివాహం అంటూ సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం సాగింది. …
Read More »