Political News

ఢిల్లీ టూర్లపై రేవంత్ దిమ్మతిరిగే కౌంటర్!

తెలంగాణ సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి తన ఢిల్లీ టూర్లపై విపక్షాలు చేస్తున్న విమర్శలపై శుక్రవారం అదిరిపోయే సమాధానం ఇచ్చారు. రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టులకు అనుమతులు సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం కొలువై ఉండే ఢిల్లీకి కాకుండా… దుబాయి వెళతానా? అంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగని ఆయన తానేమీ ఇతర నేతల మాదిరిగా దోచేసిన డబ్బును దాచుకునేందుకు దుబాయి వెళ్లలేదని కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు నిజంగానే …

Read More »

ఓడితేనే ఓట్ చోరీ గుర్తుకొస్తుందా?: పవన్ కల్యాణ్

భారత 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశంలో ప్రస్తుతం అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తున్న ఓ కీలక అంశంపై జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విపక్షాల విమర్శలను తిప్పికొడుతూనే.. వాటి వెనుక ఉన్న పెను ముప్పును కూడా పవన్ కల్యాణ్ వివరించి.. అందరినీ ఆలోచనలో పడేశారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా శుక్రవారం కాకినాడలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్ర మరియు …

Read More »

నిశ్శ‌బ్ద విప్ల‌వం కొన‌సాగాలి: చంద్ర‌బాబు

2024 ఎన్నికల్లో ‘ప్రజలు గెలవాలి- రాష్ట్రం నిలవాలి’ అనే ఎన్డీయే నినాదాన్ని ప్రజలు నమ్మి చారిత్రాత్మకమైన తీర్పునిచ్చారని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. ఓ నిశబ్ద విప్లవాన్ని సృష్టించారని అన్నారు. ఈ విప్లవం వ‌చ్చే ఎన్నికల్లోనూ కొన‌సాగాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. 79వ స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌ల‌ను పుర‌స్క‌రించుకుని విజ‌య‌వాడ‌లో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో సీఎం పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మువ్వ‌న్నెల ప‌తాకాన్ని ఆవిష్క‌రించారు. అనంత‌రం… రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. రాష్ట్రాన్ని …

Read More »

నేత‌ల ‘అతి’ వైసీపీ కొంప ముంచుతోందా!

నేత‌లు త‌మ త‌మ స్థాయిని గుర్తించి వ్య‌వ‌హరించాలి. అది ఏ పార్టీ అయినా.. నాయ‌కుల తీరులో స్ప‌ష్ట‌త‌.. చేసే ఆరోప‌ణ‌ల‌కు ప్రాధాన్యం తెలుసుకుని వ్య‌వ‌హ‌రించాలి. కానీ.. వైసీపీలో విజ్ఞ‌త‌లేని నాయ‌కులు చేస్తున్న అతి కార‌ణంగా.. ఆ పార్టీ పుట్టి మునిగిపోతోంది. అస‌లు ఆ పార్టీ అధినేత‌కే విజ్ఞ‌త లేద‌ని అనే వారు కూడా ఉన్నారు. స‌రే.. తాజాగా పులివెందుల‌, ఒంటిమిట్ట జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల్లో వైసీపీ ఘోర ప‌రాజ‌యం పాలైంది. స‌హ‌జంగానే …

Read More »

పాక్‌కు పరోక్ష హెచ్చరిక – భారత్ ఆత్మరక్షణలో రాజీ పడదు!

దాయాది దేశం పాకిస్థాన్‌కు భార‌త ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ గ‌ట్టి హెచ్చ‌రిక చేశారు. మూడు కీల‌క అంశాల‌పై ఆయ‌న స్పందిస్తూ.. ఈ విష‌యాల్లో పాక్ పేరు ఎత్త‌కుండానే ఆయ‌న వార్నింగ్ ఇచ్చారు. 79వ భార‌త స్వాతంత్య్ర దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని ప్ర‌ధాన మంత్రి శుక్ర‌వారం ఢిల్లీలోని చ‌రిత్రాత్మ‌క ఎర్ర‌కోట‌పై జాతీయ జెండాను ఆవిష్క‌రించారు. అనంత‌రం.. జాతిని ఉద్దేశించి ప్ర‌ధాని మాట్లాడుతూ.. అనేక విష‌యాల‌ను ప్ర‌స్తావించారు. ప్ర‌ధానంగా పాకిస్థాన్‌కు గ‌ట్టి వార్నింగ్ …

Read More »

జీఎస్టీ త‌గ్గిస్తాం: ప్ర‌ధాని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

దేశ ప్ర‌జ‌ల‌కు తీవ్ర ఆర్థిక భారంగా మారిన జీఎస్టీ వ్య‌వ‌హారంపై ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ స్పందించారు. స్వాతంత్య్ర దినోత్సవ వేళ‌.. ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించిన ఆయ‌న‌.. జీఎస్టీ వ్య‌వ‌హారాన్ని ప్ర‌స్తావించారు. దేశ ప్ర‌జ‌లు జీఎస్టీ గురించి ఏమ‌నుకుంటున్నారో.. త‌న‌కు వినిపిస్తోంద‌న్నారు. దీనిపై ఉద్దీప‌న‌లు (రాయితీ) ప్ర‌క‌టించ‌నున్నామ‌ని ఆయ‌న చెప్పారు. వ‌చ్చే దీపావ‌ళి నాటికి.. జీఎస్టీలో కొత్త సంస్క‌ర‌ణ‌లు తీసుకురానున్న‌ట్టు చెప్పారు. త‌ద్వారా ప్ర‌జ‌ల‌పై భారాలు త‌గ్గిస్తామ‌న్నారు. సామాన్యులకు కొత్త …

Read More »

ఆ ’65 ల‌క్ష‌ల ఓట్ల’పై ప్ర‌జ‌ల‌కు చెప్పాల్సిందే: సుప్రీంకోర్టు

కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి సుప్రీంకోర్టు షాకిచ్చింది. ఓట‌ర్ల‌ను తొల‌గించే హ‌క్కు త‌మ‌కు ఉంద‌ని.. అదేసమ‌యంలో ఎందుకు తొల‌గించామో.. చెప్పాల్సిన అవ‌స‌రం మాత్రం త‌మ‌కు లేద‌ని.. నిబంధ‌న‌లు కూడా త‌మ‌కు అనుకూలంగానే ఉన్నాయ‌ని వాదిస్తూ వ‌చ్చిన ఎన్నిక‌ల సంఘానికి సుప్రీంకోర్టు గ‌ట్టి షాక్ ఇచ్చిం ది. “ప్ర‌జాస్వామ్యంలో ఓట్లు తొల‌గించ‌డం అంటే.. ప్ర‌జ‌ల హ‌క్కుల‌ను తొల‌గించిన‌ట్టే. దీనిని తెలుసుకునే అవ‌కాశం, అవ‌స‌రం కూడా వారికి ఉంటుంది. ఈ విష‌యంలో ఎన్నిక‌ల సంఘం …

Read More »

నిజమేగా… ప్రోత్సాహకాల్లేకుండా పెట్టుబడులు ఎలా?

ఇది అసలే పోటీ ప్రపంచం. ఓ కంపెనీ తన రెండో యూనిట్ ను నెలకొల్పాలని అనుకుంటున్నట్లు బయటి ప్రపంచానికి తెలిసిందంటే… ఆ కంపెనీ ముందు పలు దేశాలు, ఆయా దేశాల్లోని పలు రాష్ట్రాలు వాలిపోతాయి. తమ పరిధిలో ఆ యూనిట్ ను ఏర్పాటు చేయాలంటే… కాదు మా పరిధిలో ఏర్పాటు చేయాలంటూ ఇంకో దేశమో, రాష్ట్రమో ప్రతిపాదిస్తాయి. ఈ క్రమంలో తమ పరిధిలో ఆ యూనిట్ ను ఏర్పాటు చేస్తే.. …

Read More »

పులివెందుల‌లో అసెంబ్లీ రౌడీ ‘సీన్‌’.. దీనికి స‌మాధాన‌మేంటి జ‌గ‌న్!

బ్యాలెట్ల‌లో సాధార‌ణంగా ఓట‌ర్లు.. త‌మ ఓటు హ‌క్కును మాత్ర‌మే వినియోగించుకుంటారు. కానీ.. తొలిసారి ఏపీలో ఓట‌ర్లు త‌మ ఓటు హ‌క్కుతో పాటు.. మ‌నోభావాల‌ను ప్ర‌తిబింబించేలా కొన్ని వ్యాఖ్య‌లు రాసి.. వేరేగా కూడా స్లిప్పులు వేశారు. వీటిని ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పులివెందుల‌, ఒంటిమిట్టల్లో ఈ నెల 12న జెడ్పీటీసీ అభ్య‌ర్థుల స్థానాల‌కు ఉప ఎన్నిక జ‌రిగింది. దీనిని ఈవీఎంతో కాకుండా బ్యాలెట్ విధానంలోనే నిర్వ‌హించారు. కేవ‌లం అసెంబ్లీ, పార్ల‌మెంటు …

Read More »

ఆర్. ఎస్‌. ప్రవీణ్ అరెస్టు.. కేటీఆర్ ఫైర్‌!

బీఆర్ ఎస్ పార్టీ నాయ‌కుడు, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్‌.ఎస్ ప్ర‌వీణ్‌కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అయితే.. ఈ ఘ‌ట‌న రాజ‌కీయంగా దుమారం రేపింది. ప్ర‌జ‌ల కోసం పోరాటం చేస్తున్న‌వారిని అరెస్టు చేయ‌డం, వారి గొంతు నొక్క‌డం సీఎం రేవంత్ రెడ్డికి వెన్న‌తో పెట్టిన విద్య అంటూ.. బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ విమ‌ర్శ‌లు గుప్పించారు. త‌క్ష‌ణ‌మే ప్ర‌వీణ్ కుమార్‌ను విడిచి పెట్టాల‌ని డిమాండ్ చేశారు. లేక‌పోతే.. …

Read More »

పులివెందుల పోరు: బాల‌య్య ఫ‌స్ట్ రియాక్ష‌న్‌

పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక‌ల్లో టీడీపీ ఘ‌న విజ‌యం ద‌క్కించుకుంది. ఆ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ ర‌వి(మారెడ్డి ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి) స‌తీమ‌ణి మారెడ్డి ల‌త ఇక్క‌డ పోటీ చేసి విజ‌యం ద‌క్కించుకున్నారు. ఆమెకు ఏకంగా 6 వేల పైచిలుకు ఓట్లు ప‌డ్డాయి. అంతేకాదు.. వైసీపీ త‌ర‌ఫున పోటీలో ఉన్న హేమంత్‌కుమార్ రెడ్డి డిపాజిట్‌(రూ.2500) కోల్పోయారు. ఈ ప‌రిణామాల‌పై అధికార పార్టీలో హ‌ర్షం వ్య‌క్త‌మ‌వుతోంది. మంత్రుల నుంచి ఎమ్మెల్యేల వ‌ర‌కు …

Read More »

‘జ‌గ‌న్ అంటే అస‌హ్యం వేస్తోంది’

‘జ‌గ‌న్ అంటే అస‌హ్యం వేస్తోంది. ఇంత నిర్ల‌జ్జ‌గా మాట్లాడ‌డం నేను ఎప్పుడూ చూడ‌లేదు.’ అని టీడీపీ సీనియ‌ర్ నేత‌, ఏపీ అసెంబ్లీ స్పీక‌ర్ అయ్య‌న్న పాత్రుడు అన్నారు. ప్ర‌జాస్వామ్యం గురించి, విలువ గురించి.. ఆయ‌న మాట్లాడుతుంటే.. అస‌హ్యంగా ఉంద‌న్నారు. తాజాగా స్పీక‌ర్ అయ్య‌న్న సెల్ఫీ వీడియో విడుద‌ల చేశారు. పులివెందుల‌, ఒంటిమిట్ట‌ల్లో జ‌రిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నిక‌ల‌ను ఆయ‌న ప్ర‌స్తావించారు. ప్ర‌జ‌లు స్వ‌యంగా చెబుతున్న దాని ప్ర‌కారం.. ఇక్క‌డ 30 …

Read More »