Political News

ఎన్డీయేకు తెర‌చాటు కాదు.. జ‌గ‌న్ బ‌హిరంగ మ‌ద్ద‌తు.. !

వైసిపి అధినేత జగన్ వ్యవహరిస్తున్న తీరు కూటమిలో కలవరాన్ని రేపుతోంది. ఇప్పటివరకు జగన్ తటస్థంగా ఉన్నారని భావిస్తూ వచ్చినప్పటికీ తాజా పరిణామాలతో ఆయన కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంతో చేతులు కలుపుతున్నారు అన్నది స్పష్టమైంది. ప్రస్తుత ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ కు మద్దతు ఇవ్వాలంటూ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. తాజాగా వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్‌కు ఫోన్ చేశారు. మద్దతు ఇవ్వాలని జగన్‌ను కోరారు. …

Read More »

వివేకా కుమార్తెకు ఊరట.. కేసు కొట్టేసిన సుప్రీంకోర్టు

వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసులో ఆయన కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీతకు భారీ ఊరట లభించింది. సునీత సహా ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి, అప్పట్లో ఈ కేసును విచారించిన సీబీఐ ఏఎస్పీ రాంసింగ్‌లపై కడప పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే వీటిని సవాల్ చేస్తూ సునీత దంపతులు సహా రాంసింగ్ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై పలు మార్లు విచారణ జరిపిన సుప్రీంకోర్టు తాజాగా …

Read More »

ఇండియా ఉపరాష్ట్రపతి అభ్యర్థి – ఎవరీ రెడ్డిగారు

కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేసింది. తెలుగు వారైన జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డిని ఈ పోస్టుకు ఎంపిక చేసింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిగా పనిచేసిన సుదర్శన్ రెడ్డి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రంగారెడ్డి జిల్లా ఆకులమైలారం లో జన్మించిన సుదర్శన్ రెడ్డి హైదరాబాదులోనే విద్యను కొనసాగించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా సాధించారు. అనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయవాదిగా వృత్తిని …

Read More »

ఆ ఎంపీ అంద‌రి వాడు: మంచి మార్కులే ప‌డుతున్నాయ్‌…!

రాజ‌కీయాల్లో రాక‌ముందు.. వ్య‌క్తులు ఎలా ఉన్నా.. రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన త‌ర్వాత మాత్రం వ్య‌క్తుల యాట్టి ట్యూడ్ మారుతుంది. ముఖ్యంగా ఫ‌స్ట్ టైమ్ రాజ‌కీయాల్లోకి వ‌చ్చి.. విజ‌యం ద‌క్కించుకున్న నాయ‌కుల తీరు ఇలానే ఉంది. అంతా త‌మ‌కే తెలుసున‌ని.. ఎవ‌రూ త‌మ‌కు స‌ల‌హాలు ఇవ్వాల్సిన అవ‌స‌రం లేద‌ని.. చెప్పే తొలిసారి ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఉన్నారు. అంత‌ర్గ‌తంగా ఇలాంటి వారితోనే పార్టీల‌కు, ప్ర‌భుత్వానికి కూడా ఇబ్బందులు వ‌స్తున్నాయి. అయితే.. ఇలాంటి వారికి …

Read More »

కూట‌మిలో త‌ప్పెవ‌రిది… నేత‌ల సెల్ఫ్‌గోల్స్ .. !

రాజ‌కీయ వివాదాలు ముసురుకుంటున్న స‌మ‌యంలో కూట‌మిలో అస‌లు స‌మ‌స్య ఎక్క‌డ ఉంది? నాయకుల వ్య‌వ‌హారాలు బ‌య‌ట‌కు లీకెలా అవుతున్నాయి.? అనేది ఆస‌క్తిగా మారింది. వాస్త‌వానికి త‌ప్పులు చేసే నాయ‌కుల‌ను ఎవ‌రూ వెనుకేసుకురాకూడ‌దు. త‌ప్పును త‌ప్పుగా చెప్ప‌డం కూడా మంచిదే. నాయ‌కులు మారేలా ప్రోత్స‌హించాల్సిన అవ‌స‌రం, మార్పు కోరుకోవ‌డం కూడా మంచిదే. అయితే.. ఇవ‌న్నీ.. అంత‌ర్గతంగా జ‌ర‌గాల్సిన వ్య‌వ‌హారాలు. కానీ, బ‌య‌ట‌కు వ‌చ్చేస్తున్నాయి. వీధుల్లో విప్ల‌వాలు సృష్టిస్తున్నాయి. ఒక్క టీడీపీ అనేకాదు.. …

Read More »

డిజైన్లు అధిరిపోవాలి: అమ‌రావ‌తిపై చంద్ర‌బాబు

ఏపీ రాజధాని అమరావతిని అనుసంధానిస్తూ కృష్ణా నదిపై నిర్మించే ఐకానిక్ వంతెనకు సాదా సీదా డిజైన్లు కాదు.. అద్భుత మైన డిజైన్ ఎంపిక చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సంప్రదాయ కూచిపూడి నృత్య భంగిమ సహా వేర్వేరు నూతన డిజైన్లను పరిశీలించాలని సూచించారు. సోమవారం అమరావతి లోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన 51వ సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో కీల‌క‌మైన‌ 9 ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. …

Read More »

కొరివితో గోక్కోవ‌డం అంటే ఇదే.. జ‌న‌సేన ఎమ్మెల్యే వివాదం!

కొరివితో త‌ల‌గోక్కోవ‌డం.. లేనిపోని బుర‌ద‌ను తాము అంటించుకుని పార్టీకి కూడా అంటించ‌డం.. ఇటీవ‌ల కాలంలో ఏపీలో ఉన్న కూట‌మి ఎమ్మెల్యేల‌కు అల‌వాటుగా మారిపోయింది. గ‌త ఆరు మాసాల నుంచి ఒక‌రి త‌ర్వాత ఒక‌రు అన్న‌ట్టుగా వివాదాల‌ను త‌మ చుట్టూ తిప్పుకొంటున్నారు. ఒక‌వైపు.. టీడీపీ ఎమ్మెల్యేలు దారి త‌ప్పుతున్నార‌ని.. సీఎం చంద్ర‌బాబు ల‌బోదిబోమంటున్న‌విష‌యం తెలిసిందే. వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు, పార్టీల‌పై విమ‌ర్శ‌లు చేయొద్ద‌ని ఆయ‌న చెబుతున్నారు. ఇక‌, ఇప్పుడు జ‌న‌సేన వంతు వ‌చ్చింది. …

Read More »

మోదీ – పుతిన్ ఫోన్ కాల్.. ఎంటీ సంకేతం?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా భారత్‌పై భారీ సుంకాలు విధించగా, ఆ ప్రభావం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. భారత్‌ రష్యా నుంచి చమురు కొనుగోలు కొనసాగిస్తోందనే కారణంతో ఈ చర్య తీసుకున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ పరిణామం తర్వాత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అమెరికాతో చర్చలు జరిపి, ఉక్రెయిన్ యుద్ధం పరిష్కారానికి మార్గాలు అన్వేషించారు. ఆ వెంటనే ఆయన నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫోన్ చేయడం అంతర్జాతీయ …

Read More »

మీకు బెయిల్ ఇవ్వ‌లేం: మిథున్ రెడ్డికి కోర్టు షాక్‌

వైసీపీ హ‌యాంలో జ‌రిగిన మ‌ద్యం కుంభ‌కోణం వ్య‌వ‌హారంలో ఏ-4గా ఉన్న రాజంపేట ఎంపీ, వైసీపీ కీల‌క నాయ‌కుడు పెద్ది రెడ్డి మిథున్ రెడ్డి ప్ర‌స్తుతం రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్లో ఉన్నారు. ఆయ‌న‌తోపాటు.. మాజీ ఐఏఎస్ అధికారి ధ‌నుంజ‌య్ రెడ్డి, జ‌గ‌న్ మాజీ ఓఎస్‌డీ కృష్ణ‌మోహ‌న్‌రెడ్డి, భారతీ సిమెంట్స్ సంస్థ ఆడిట‌ర్ బాలాజీ గోవింద‌ప్ప‌లు విజ‌య‌వాడ జైల్లో ఉన్నారు. అయితే.. వీరు త‌మ‌కు బెయిల్ మంజూరు చేయాల‌ని కోరుతూ.. విజ‌య‌వాడలోని ఏసీబీ …

Read More »

యాంటీ ప్ర‌చారం 4 ర‌కాలు: చంద్ర‌బాబు ప‌రిష్కారాలు

యాంటీ ప్ర‌చారం.. అధికారంలో ఉన్న పార్టీల‌కు అస్స‌లు న‌చ్చ‌నిది. గిట్టనిది కూడా. తాము ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు న‌మ్ముకున్న ఈ ప్ర‌చారమే.. అధికారంలోకి వ‌చ్చాక‌.. ఇబ్బంది పెడుతుంది. ఏపీలోనూ ఇప్పుడు అదే జ‌రుగుతోంది. కూట‌మి ప్ర‌భుత్వంపై యాంటీ ప్ర‌చారం జ‌రుగుతోంది. ఒక‌రూపంలో కాదు.. నాలుగు విధాలుగా ఈ ప్రచారం ఊపందుకుంది. ఈ విష‌యం ఎవ‌రో కాదు.. సాక్షాత్తూ సీఎం చంద్ర‌బాబు చెప్పుకొచ్చారు. తాజాగా ఆదివారం ఆయ‌న పార్టీ నాయ‌కుల‌తో జూమ్ మీటింగ్ …

Read More »

8 కేసుల్లోనూ బెయిల్… రేపు కాకాణి రిలీజ్

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డికి దాదాపుగా 3 నెలల తర్వాత ఒకింత ఊరట లభించింది. రుస్తుం మైనింగ్ కేసులో అరెస్టు అయిన కాకాణిపై ఆ తర్వాత వరుసబెట్టిన మరో 7 కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఓ కేసులో బెయిల్ వచ్చినా మరో కేసులో ఆయనకు బెయిల్ రాకపోవడంతో ఆయన నెల్లూరు జైలులో 85 రోజుల పాటు విచారణ ఖైదీగా ఉండాల్సి వచ్చింది. ఇప్పటిదాకా …

Read More »

వైసీపీ మాజీ మంత్రి ర‌జ‌నీకి సెగ‌.. వ్య‌తిరేక వ‌ర్గం భేటీ

వైసీపీ మాజీ మంత్రి, చిల‌క‌లూరిపేట మాజీ ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జ‌నీకి వ్య‌తిరేక వ‌ర్గం నుంచి భారీ సెగ త‌గిలింది. ఆత్మీయ సమావేశం పేరిట వ్యతిరేక వర్గం భేటీ అయింది. దీనికి ముందు ర్యాలీగా తరలి వచ్చిన వ్యతిరేక వర్గం నేత‌లు.. ‘డౌన్ డౌన్ విడుదల రజిని’ అంటూ నినాదాల‌తో హోరెత్తించారు. గత ఐదు సంవత్సరాల్లో అరాచకాలు, అక్రమ వసూళ్లు, భూదందాలతో ఆమె అరాచ‌కాల‌కు పాల్ప‌డ్డార‌ని వ్య‌తిరేక‌వ‌ర్గం నాయ‌కులు నినాదాలు చేశారు. …

Read More »