Political News

ఏపీలో ముఠాల పాల‌న‌: జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఏపీలో ప్ర‌జా పాల‌న స్థానంలో ముఠాల పాల‌న జ‌రుగుతోంద‌ని వైసీపీ అధినేత‌, ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రం రాజ‌కీయ హింస‌కు కేంద్రంగా మారిపోయింద‌ని విమ‌ర్శించారు. గ‌త రెండు నెల‌ల కాలంలో రాష్ట్రంలో హింసాయుత కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయ‌ని పేర్కొన్న ఆయ‌న‌.. రాజ‌కీయ ప్రేరేపిత దుర్మార్గాలు కొన‌సాగుతున్నాయ‌ని వ్యాఖ్యానించారు. రోజూ ఏదో ఒక చోట హింస జ‌రుగుతూనే ఉంద‌ని పేర్కొన్నారు. అంతేకాదు.. రాష్ట్రం ఎన్నిక‌ల‌కు ముందు చంద్ర‌బాబు ఇచ్చిన …

Read More »

  బెంగ‌ళూరుకు జ‌గ‌న్ వెనుక‌.. లోట‌స్ పాండ్ వివాదం!

వైసిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇటీవల కాలంలో తరచుగా బెంగళూరుకు వెళ్తున్న విషయం తెలిసిందే. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత నుంచి ఆయన ఇప్పటికి మూడుసార్లు బెంగళూరు పర్యటనకు వెళ్లడం.. అక్కడ కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవడం.. తిరిగి తాడేపల్లికి చేరుకోవడం తెలిసిందే. అయితే అధికారంలో ఉండగా ఆయన ఒకే ఒక్కసారి బెంగళూరుకు వెళ్లారు. ఆ తర్వాత మళ్లీ అధికారం కోల్పోయిన తర్వాత మాత్రమే ఆయన బెంగుళూరు …

Read More »

బొత్స ఎఫెక్ట్ .. తూర్పు కాపుల ఆగ్ర‌హం రీజ‌నేంటి?

వైసిపి సీనియర్ నాయకుడు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి బలవుతున్నారా? ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయన కుటుంబంలోని నలుగురికి వైసీపీ టికెట్ ఇచ్చింది. అయినా కూటమి తుఫాన్ నేపథ్యంలో అందరూ తుడిచిపెట్టుకుపోయారు. ఈ నేపథ్యంలో తాజాగా ఉత్తరాంధ్ర స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోటాలో బొత్స సత్యనారాయణ కు జగన్మోహన్ రెడ్డి అవకాశం కల్పించారు.  సత్యనారాయణ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఏక‌గ్రీవంగా పార్టీలో ఎన్నికయ్యారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితిని తీసుకుంటే …

Read More »

పాద‌యాత్ర.. మ‌ళ్లీ సై అంటున్న ష‌ర్మిల‌!

Sharmila

ఏపీ కాంగ్రెస్ చీఫ్‌ వైఎస్ షర్మిల పాదయాత్రకి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఆమె ఏర్పాట్లు కూడా సిద్ధం చేసుకుంటున్నారని సమాచారం. వాస్తవానికి ఎన్నికల ఫలితాలు వచ్చి 2 నెలలు కూడా కాకుండానే ఆమె ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని ఎవ‌రూ ఊహించ‌రు. కానీ, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎన్నికలకు ముందు కాకుండా ఇప్పటి నుంచే పార్టీని బలోపేతం చేయాలని, ముఖ్యంగా తన హవా చలాయించాలంటే కచ్చితంగా తన ముద్రపడాలంటే ప్రజల్లో …

Read More »

బాబు బ్రాండ్‌.. రెచ్చిపోతున్న వ్యాపారులు.. జాగ్ర‌త్త‌!!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు కూట‌మి పార్టీల‌తో క‌లిసి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. స‌హ‌జంగానే వ్యాపారాలు, వాణిజ్య సంబంధ‌మైన కార్య‌క్ర‌మాలు పుంజుకుంటాయి. దీనిలో ఎలాంటి సందేహం లేదు. అయితే.. పాల‌న ఇంకా పూర్తిస్థాయిలో గాడిలో ప‌డ‌లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు అధికారుల మార్పులు.. గ‌త స‌ర్కారు చేసిన త‌ప్పుల‌ను స‌రిదిద్ద‌డం వ‌ర‌కే చంద్ర‌బాబు ప‌రిమితం అయ్యారు. ఈ నెల నుంచి చంద్ర‌బాబు త‌న‌దైన మార్కుతో పాల‌న ప్రారంభించ‌నున్నారు. అయితే.. చంద్ర‌బాబు వ‌చ్చీ రావ‌డంతోనే.. …

Read More »

అంగ‌ళ్ల దాడికి ఏడాది… బాబు ఏం చేస్తారో?

చిత్తూరు జిల్లా అంగళ్లు ప్రాంతంలో టిడిపి అధినేత చంద్రబాబుపై జరిగిన రాళ్ల దాడికి ఏడాది కాలం పూర్తయింది. గత ఏడాది ఆగస్టు 4వ తారీఖున చిత్తూరు జిల్లాలో పర్యటించిన చంద్రబాబును పుంగనూరు నియోజకవర్గంలోకి రాకుండా అప్పటి వైసిపి కార్యకర్తలు నాయకులు అడ్డుపడ్డారు. ఈ క్రమంలో చంద్రబాబు లక్ష్యంగా రాళ్ల దాడి చేశారు. అయితే పోలీసులు ముందుగానే ఆయనను అంగళ్ళు ప్రాంతంలోకి రాకుండా అడ్డుకున్నారు. అయినా చంద్రబాబు మాత్రం తన సొంత …

Read More »

ఇక‌, ఎస్టీల‌ వంతు.. రిజ‌ర్వేష‌న్ల‌పై పోరే!

ఇప్ప‌టి వ‌ర‌కు కొన్ని ద‌శాబ్దాలుగా పోరాటం చేసిన ఎస్సీలకు భారీ ఊర‌టే క‌లిగింది. ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌కు.. సుప్రీంకోర్టు ధ‌ర్మాస‌నం ఓకే చెప్పింది. ఈ అధికారాన్ని రాష్ట్రాల‌కు ఇచ్చేసింది. అయితే.. రాజ‌కీయ జోక్యం కూడ‌ద‌ని తేల్చి చెప్పింది. దీనిపై చిన్న చిన్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నా.. మొత్తానికి ఎస్సీల‌కు న్యాయం అయితే జ‌రిగింద‌న్న వాద‌న ఇటు రాజ‌కీయ వ‌ర్గాల నుంచి అటు సామాజిక వ‌ర్గాల నుంచి కూడా వినిపిస్తోంది. ఇంత వ‌ర‌కు బాగానే …

Read More »

బాబు లో ఏంత మార్పు!

టీడీపీ అధినేత‌, ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కొన్ని కొన్ని విష‌యాల్లో చాలా వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రి స్తున్నారు. గ‌తానికి ఇప్ప‌టికీ.. పాల‌న విష‌యంలోనూ, రాజ‌కీయాల విష‌యంలోనూ ఆయ‌న‌లో చాలా మార్పు క‌నిపించింది. గ‌తంలో ఎలా వ్య‌వ‌హ‌రించినా.. అప్ప‌టి సంగ‌తి వేరు. కానీ, ఇప్పుడు ఓడిపోయిన ప్పటికీ వైసీపీ బ‌లంగా ఉండ‌డం.. 40 శాతం ఓటు బ్యాంకుతో క్షేత్ర‌స్థాయిలో నిల‌దొక్కుకున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. దీనిని త‌క్కువ‌గా అంచ‌నా వేసేందుకు వీల్లేదు. అందుకే చంద్ర‌బాబుకూడా …

Read More »

ఈ ఒక్క ప‌నైనా చేసి ఉంటే.. వైసీపీలో గుస‌గుస‌…!

వైసీపీ అధికారంలో ఉండ‌గా.. చేస్తాన‌ని చెప్పిన వాటిలో ర‌చ్చ‌బండ‌ కార్య‌క్ర‌మం కీల‌క‌మైంది. సీఎంగా ఉన్న జ‌గ‌న్‌.. అప్ప‌ట్లో ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌చ్చి వారి స‌మ‌స్య‌లు వినాల‌ని అనుకున్నారు. ఈ క్ర‌మంలో న‌లుగురు కీల‌క నాయ‌కుల‌తో ఒక క‌మిటీని కూడా ఏర్పాటు చేసి.. కార్య‌క్ర‌మానికి రూప‌క‌ల్ప‌న చేసే బాధ్య‌త‌ల‌ను కూడా అప్ప‌గించారు. 2009లో ఇదే కార్య‌క్ర‌మానికి బ‌య‌లు దేరిన అప్ప‌టి సీఎం వైఎస్ దుర‌దృష్ట‌వ శాత్తు మ‌ర‌ణించారు. దీంతో ఆ కార్య‌క్ర‌మం …

Read More »

అమ‌రావ‌తికి విరాళాలు.. ఇంత సెంటిమెంటు వుందా

సెంటిమెంటు ఎలా ఉంటుందో.. అది ఏ రూపంలో ఉంటుందో ప‌సిగ‌ట్ట‌డం.. రాజ‌కీయ నాయ‌కుల‌కు వెన్న తో పెట్టిన విద్య. అందుకే.. రాజ‌కీయాల్లో ఉన్న‌న్ని సెంటిమెంట్లు ఎక్క‌డా ఉండ‌వు. 2019లో జ‌గ‌న్ అధికా రంలోకివ‌చ్చేందుకు సెంటిమెంటే కార‌ణ‌మైంది. ఆయ‌న చేసిన పాద‌యాత్ర కార‌ణంగానే వైసీపీ భారీ విజ‌యాన్ని న‌మోదు చేసింది. మ‌రి అలాంటిది కీల‌క‌మైన సెంటిమెంటును అంచ‌నా వేయ‌డంలో జ‌గ‌న్ ఎక్క‌డో త‌ప్పు చేశార‌నే భావ‌న ఇప్పుడు వ్య‌క్త‌మ‌వుతోంది. అదే.. రాజ‌ధాని …

Read More »

మోడీ డబుల్ గేమ్ బయటపెట్టిన షర్మిల

ఏపీ మాజీ సీఎం జగన్ తో పాటు గత వైసీపీ ప్రభుత్వంపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా బీజేపీతో ఐదేళ్లపాటు అంటకాగిన జగన్ రాష్ట్రానికి ఎటువంటి ప్రయోజనం చేకూర్చలేదని షర్మిల తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. వైసీపీని బిజెపి ఉంచుకుందంటూ పరుష పదజాలంతో సైతం షర్మిల చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా కేంద్రంలోని మోడీ సర్కార్ పై …

Read More »

మడకశిరతో కొత్త కల్చర్ కు తెర తీసిన చంద్రబాబు

ప్రభుత్వం ప్లాగ్ షిప్ గా తీసుకున్న కార్యక్రమాన్ని ఎంత భారీగా చేపడుతుందో.. అందుకు రెట్టింపు ప్రచారాన్ని కోరుకోవటం మామూలే. ఇందుకు మీడియాలో ఫుల్ పేజీ ప్రకటనలు మొదలుకొని.. కవరేజ్ కోసం ప్రత్యేకంగా విన్నపాలు ఇస్తుంటారు. ఇవి సరిపోనట్లుగా.. తాము చేపట్టే కార్యక్రమానికి వేలాది మంది హాజరయ్యేలా చేయటం.. జనసమీకరణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయటం.. అందుకు లక్షలాది రూపాయిల్ని ఖర్చు చేయటం చూస్తుంటాం. అందుకు భిన్నంగా చేయాల్సిన పనిని చేసుకుంటూ …

Read More »