దెబ్బకు దెబ్బ..! అన్నట్టుగా మారిపోయింది వైసీపీ పరిస్థితి. ఒకప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబును దెబ్బతీసేందుకు ప్రయత్నించిన ఉమ్మడి చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో అనూహ్యంగా వైసీపీకే దెబ్బ పడిపోయింది. ఇక్కడ ఇప్పుడు జెండామోసేందుకు కూడా నాయకుడు లేకుండా పోయారు. ఎన్నికల పోలింగ్ జరిగిన కేవలం రెండు మాసాల్లోనే వైసీపీ ఖాళీ అయిపోవడం.. కీలక నాయకులు జారు కోవడం.. అసలు ఇంచార్జ్ జాడ కూడా కనిపించక పోవడం చర్చనీయాంశంగా మారింది. కుప్పంలో …
Read More »సబితక్క.. రేవంత్.. అసలు ఏం జరిగింది?
తెలంగాణ అసెంబ్లీలో మాటకు మాట ఎలా ఉన్నా.. తాజాగా సెంటిమెంటు.. ఎమోషన్లు కూడా పండేశాయి. సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలతో తీవ్ర మనస్తాపం చెందిన మాజీ మంత్రి సబిత ఏకంగా కన్నీరు పెట్టేసు కున్నారు. తానే ఏం పాపం చేశానంటూ ప్రశ్నించారు. దీంతో సభలో ఒక్కసారిగా గందరగోళం ఏర్పడడం.. అదుపు తప్పడంతో సభను స్పీకర్ వాయిదా వేశారు. అనంతరం 10 నిమిషాలకు సభ ప్రారంభమయ్యాక సీఎం రేవంత్ మాట్లాడుతూ.. సబితను …
Read More »ఇది నిజంగా ‘ఎర్రిపప్ప’ వ్యాఖ్య అంటున్న నెట్టిజన్లు
కొందరు రాజకీయ నేతలను చూస్తే.. వారి వ్యాఖ్యలను గమనిస్తే.. చాలా చిత్రంగా ఉంటుంది. గతంలో వైసీపీ నాయకులు చిత్రమైన వ్యాఖ్యలు చేశారని.. పెద్ద ఎత్తున ప్రజలు చర్చించుకున్నారు. రైతులను ‘ఎర్రిపప్ప’లంటూ ఓ మంత్రి వర్యులు(పేరు చెబితే ఇంకా ఎందుకు వెంటపడతారని బాధపడతారు) వ్యాఖ్యానించారు. అప్పట్లో ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. మరొకరు న్యూడ్ యాంగిల్స్‌లో సోషల్ మీడియాలో హల్చల్ చేశారు. ఇవన్నీ అయిపోయాయిలే.. ఇప్పుడు బాగుంటుందిలే! అని అనుకున్నారు. …
Read More »సీతక్కా మజాకా.. సభలో మార్కులు కొట్టేశారుగా !
తెలంగాణ కాంగ్రెస్ నాయకురాలు, ఫైర్ బ్రాండ్ మంత్రి సీతక్క తన విశ్వరూపం చూపించారు. తాజాగా జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆమె వరుసగా రెండో రోజు కూడా.. టాక్ ఆఫ్ ది సెషన్‌గా నిలిచారు. తొలుత బుధవారం సభ ప్రారంభం కాగానే మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌పై విమర్శలు గుప్పించారు. అధికారం కోసం.. హామీలు ఇచ్చింది ఎవరు? వాటిని 100 రోజుల్లోనే అమలు చేస్తామని చెప్పిందెవరు? …
Read More »పగ తీరింది.. హమాస్ అగ్రనేతను ఏసేసిన ఇజ్రాయెల్
కారణం ఏమైనా కానీ ఇజ్రాయెల్ మీద దాడికి దిగి.. వారికి షాకిచ్చిన హమస్ అంతకంతకూ మూల్యం చెల్లించుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియెను చంపేసినట్టు ఇజ్రాయల్ పేర్కొంది. ఇరాన్ లో జరిగిన దాడిలో తమ అగ్రనేత చనిపోయినట్లుగా హమాస్ గ్రూప్ వెల్లడించింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ లోని హనియె నివాసం మీద ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఆయన ప్రాణాలు కోల్పోయినట్లుగా పేర్కొన్నారు. హమస్ అగ్రనేతతో పాటు …
Read More »జనాన్ని ఒప్పిస్తే.. చంద్రబాబు ఐడియా గ్రేటే!
అధికారంలో ఉన్న నాయకులకు.. ఒక ఐడియా రావడం వరకు బాగానే ఉంటుంది. కానీ.. దానిని అమలు చేసేందుకు, ముఖ్యంగా ప్రజలను ఒప్పించేందుకు మాత్రం ఒకింత కష్టపడాలి. అలా చేయకపోతే.. ఎంత మంచి పథకైనా.. ఎంత మంచి నిర్ణయమైనా.. ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ప్రజల్లో పలుచన కూడా అయ్యేలా చేస్తుంది. ఇప్పుడు ఇలా ఎందుకు చెప్పాల్సివస్తోందంటే.. సీఎం చంద్రబాబు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. సరికొత్త ఐడియాతో ముందుకు వచ్చారు. అదే.. పీపీపీ …
Read More »కాంగ్రెస్ అధిష్టానానికి తలనొప్పిగా తెలంగాణ !
తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరికలు ఆ పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గత పదేళ్లలో దేశంలో కాంగ్రెస్ పార్టీని, ఆయా రాష్ట్రాలలో కొన్ని పార్టీలను బలహీనపర్చేందుకు బీజేపీ అనేక రాష్ట్రాలలో ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుని బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. అయితే అన్ని చోట్లా బీజేపీ 2/3 ఫార్ములా ప్రకారం చేర్చుకుని ఆయా పార్టీల చేరికల మీద అనర్హత వేటు పడకుండా …
Read More »ఇండియా కూటమిలో జగన్ గురించి మాట్లాడుకుంటున్నారు
గత కొన్నాళ్లుగా వైసీపీ అధినేత జగన్ వ్యవహారం కాంగ్రెస్ కూటమి పక్షాలైన ఇండియాలో చర్చకు వస్తోంది. డిల్లీలో ధర్నా చేసిన సమయంలో జగన్.. కొందరు ఇండియా కూటమి పార్టీల నాయకులను ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ కు చెందిన సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, జార్ఖండ్‌కు చెందిన జేఎంఎం పార్టీ నాయకులు, పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సహా బిహార్‌లోని ఇండియా …
Read More »పవన్‌కల్యాణ్ పై కేసులు.. కోర్టు ఏమందంటే!
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై వైసీపీ హయాంలో పలు కేసులు నమోదయ్యాయి. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు.. ఆయన హైదరాబాద్ నుంచి వస్తుండగా ఏపీ పోలీసులు అడ్డుకున్నారు. అయితే, రివర్స్‌లో ఆయనపైనే విధులకు ఆటంకం కలిగించారని కేసు పెట్టారు. అదేవిధంగా విశాఖలో హోటల్లో నిర్బంధించిన విషయం తెలిసిందే. అప్పుడు కూడా.. పవన్ తమ విధులను అడ్డుకున్నారని మరో కేసు పెట్టారు. ఇవన్నీ ఒక ఎత్తయితే.. కాకినాడలో గత ఏడాది ప్రారంభంలో …
Read More »మందారం కప్పులో నయనతార తుఫాను
కొద్దిరోజుల క్రితం సమంత ఇన్ఫెక్షన్ తగ్గడానికి నెబులైజర్ లో హైడ్రాక్సిన్ పెరాక్సైడ్ వాడటంలో ప్రయోజనాలు ఉంటాయని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఎంత దుమారం రేపిందో చూశాం. లివర్ డాక్ అనే పేరుతో ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉండే ఒక ఎంబిబిఎస్ వైద్యులు సమంత ఇలాంటి సలహా ఇవ్వడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ తక్షణం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత …
Read More »ప్రహరీ గోడ వర్సెస్ సాయిరెడ్డి కుమార్తె.. అసలేంటీ స్టోరీ!
గత వారం రోజులుగా వైసీపీ కీలక నాయకుడు, రాజ్యసభ ఎంపీ సాయిరెడ్డి కుమార్తె నేహా రెడ్డి పేరు మీడియాలో వస్తోంది. దీనికి కారణం.. విశాఖ జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం భీమిలి బీచ్ వద్ద సముద్ర తీరానికి అతి సమీపంలో నిర్మించిన కాంక్రీట్ ప్రహరీ. దీనిని కూల్చివేయాలన్నది.. జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి డిమాండ్. అయితే.. తాము ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదన్నది నేహా తరఫు వాద న. దీంతో అసలు …
Read More »తెలంగాణలో రివర్స్ పాలిటిక్స్: రేవంత్ కు షాక్!
రాజకీయాల్లో కౌంటర్లు.. రివర్స్ ఎటాక్‌లు కామనే. కాకపోతే..ఇప్పుడు మాటలే కాదు.. చేతల్లోనూ రివర్స్ ఎటాక్ జరిగింది. అది కూడా.. సీఎం రేవంత్ రెడ్డి ఒకింత షాకయ్యేలా పాలిటిక్స్ ఉండడం.. ఇప్పుడు చర్చనీయాంశం అయింది. ఏం జరిగింది? బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, రాజ్యసభ సభ్యులను కూడా కాంగ్రెస్ పార్టీ చేర్చుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే అనేక మంది వెళ్లిపోయారు. ఈ పరంపర కొనసాగుతూనే ఉంది. అయితే.. …
Read More »