Political News

భార‌త్ జ‌నాభా: జ‌ర్మ‌నీ వివాదాస్ప‌ద కార్టూన్‌.. కేంద్రం సీరియ‌స్‌

భార‌త్‌లో జ‌నాభా.. తాజాగా చైనాను దాటేసింది. సుమారు 50 ల‌క్ష‌ల మందికి పైగా చైనా కంటే భార‌త్‌లో జ‌నాభా పెరిగార‌ని.. ఇటీవ‌లే అంత‌ర్జాతీయ నివేదిక‌లు స్ప‌ష్టం చేశాయి. అయితే.. జ‌నాభా నియంత్ర‌ణ‌కు కేంద్రం కూడా దృష్టి పెట్టింది. ఎలా త‌గ్గించాల‌నే విష‌యంపై ఇప్ప‌టికే నిపుణుల క‌మిటీని ఏర్పాటు చేసింది. వ‌చ్చే ప‌దేళ్ల‌లో జ‌నాభా నియంత్ర‌ణ‌కు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవాల‌నే అంశంపైనా మేధో మ‌థ‌నం చేస్తోంది. అయితే.. ఇంత‌లోనే.. తాజాగా భార‌త్ …

Read More »

అవినాష్ రెడ్డి అరెస్టు పై బెట్టింగులే బెట్టింగులు!

ఏపీలో ఏం జ‌రిగినా బెట్టింగు రాయ‌ళ్లు రంగంలోకి దిగుతున్నారు. కోడి పందేల నుంచి క్రికెట్ వ‌ర‌కు దేనినీ వారు వదిలి పెట్ట‌డం లేదు. ఇలానే.. ఇప్పుడు సంచ‌ల‌నంగా మారిన వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న క‌డ‌ప ఎంపీ.. సీఎం జ‌గ‌న్‌కు త‌మ్ముడు వైఎస్ అవినాష్‌రెడ్డి వ్య‌వ‌హారం కూడా .. బెట్టింగుల‌కు దారి తీసింది. ఈ కేసులో ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తారా? చేయ‌రా? అనేది తీవ్ర …

Read More »

తన మిత్రుడుకి 22 అంతస్తుల బిల్డింగ్ బహుమతి ఇచ్చిన అంబానీ

రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ తన చిరాకాల మిత్రుడు మోదీకి ముంబయిలో రూ. 1500 కోట్ల విలువ చేసే 22 అంతస్తుల భవనాన్ని కానుకగా ఇచ్చారు. అయితే, అంబానీ నుంచి కాస్ట్లీ గిఫ్ట్ అందుకుంటున్న ఈ మోదీ ప్రధాని నరేంద్ర మోదీ కాదు.. మనోజ్ మోదీ. అవును.. 40 ఏళ్లుగా రిలయన్స్‌లో పనిచేస్తున్న మనోజ్ మోదీ.మనోజ్ మోదీకి దక్షిణ ముంబయిలోని నేపియన్ సీ రోడ్‌లో ఉన్న 22 అంతస్తుల బృందావన్ …

Read More »

గుంటూరు బరిలో సుజనా చౌదరి ..?

ప్రముఖ పారిశ్రామికవేత్త, ప్రస్తుతం ఏపీ బీజేపీలో కీలక నేత సుజనా చౌదరి గుంటూరు లోక్ సభా స్థానం నుంచి పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ప్రస్తుత టీడీపీ ఎంపీ అయిన పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్ మరోసారి పోటీకి ఆసక్తి చూపడం లేదని తెలియడంతో సుజనా తన అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నంలో ఉన్నారు. గుంటూరు నగరంలో ఇటీవల టీడీపీ, బీజేపీ నేతల తేనీటి విందు జరిగింది. టీడీపీ నేత ఆలపాటి …

Read More »

సొంత జిల్లాలో ఎంత బలంగా ఉన్నాం? జగన్ సర్వే

2024లోనూ మళ్లీ అధికారంలోకి రావడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తున్న ఏపీ సీఎం జగన్ అందుకోసం ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోవడం లేదు. తమకు తిరుగులేదనుకునే సొంత జిల్లా విషయంలోనూ ఆయన చాలా ప్రతిష్ఠాత్మకంగా కనిపిస్తున్నారు. చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టాలనే సూత్రం ప్రకారం ఆయన సొంత జిల్లా కడపపైనా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పీకే టీంతో కడప జిల్లాలో సర్వే చేయిస్తున్నారట. ఇప్పటికే పీకీ టీం కడపలోని …

Read More »

నేను విజన్ 2020 అంటే.. నన్ను 420 అన్నారు

తాను విజ‌న్ 2020 అంటే.. త‌న‌ను 420 అంటూ కొన్ని రాజ‌కీయ పార్టీలు గేలి చేశాయ‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు గ‌తాన్ని గుర్తు చేసుకున్నారు. ఉమ్మ‌డి రాష్ట్రంలో ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో తాను విజ‌న్ 2020 అంటూ.. ఒక‌ కార్య‌క్ర‌మాన్ని అమ‌లు చేసేందుకు పూనుకొన్న‌ట్టు తెలిపారు. త‌ద్వారా.. రాష్ట్రాన్ని దేశంలోను.. ప్ర‌పంచంలోనూ కూడా అగ్ర‌ప‌థంలో ఉంచేందుకు ప్ర‌య‌త్నించాన‌ని చెప్పారు. ఈ క్ర‌మంలోనే సెల్ ఫోన్ల‌ను తీసుకురావ‌డంపై దృష్టి పెట్టాన‌న్నారు. అయితే.. …

Read More »

తెలంగాణ బీఆర్ఎస్ ఎమ్మెల్యే బూతు పురాణం

తెలంగాణ కీల‌క‌నాయ‌కుడు, ఎస్టీ సామాజిక వ‌ర్గానికి చెందిన రెడ్యా నాయ‌క్ నోరుపారేసుకున్నారు. ప్ర‌తిప‌క్ష నేత‌ల‌పైనా.. అధికార పార్టీ బీఆర్ ఎస్‌ను విమ‌ర్శించే వారిపైనా బూతుల‌తో విరుచుకుప‌డ్డారు. లం.. కొడుకులు, గు.. బ‌లిసి.. అంటూ.. ఆయ‌న ఒళ్లు తెలియ‌ని విధంగా బ‌హిరంగ వేదిక‌పై విరుచుకుప‌డ్డారు. ముఖ్యంగా కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డిపై మ‌రిన్ని ప‌రుష ప‌దాల‌తో విమ‌ర్శ‌లు గుప్పించారు. ప్ర‌స్తుతం ఈ వ్యాఖ్య‌లు రాజ‌కీయంగా మంట‌లు రేపుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా సిరోల్ …

Read More »

రాయలసీమ పిలుస్తోంది.. రా కేసీఆర్!

కేసీఆర్ తన పార్టీ బీఆర్ఎస్‌ను విస్తరించడానికి ఇప్పుడు ప్రధానంగా మహారాష్ట్రపై ఫోకస్ చేస్తున్నారు. అదే సమయంలో సాటి తెలుగు రాష్ట్రం ఏపీ, మరో పొరుగు రాష్ట్రం కర్నాటకలోనూ కేసీఆర్ పార్టీ రాజకీయ ప్రయత్నం చేస్తుందనడంలో సందేహం లేదు. అయితే, ఏపీలో విశాఖ కేంద్రంగా రాజకీయం మొదలుపెట్టాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే వైజాగ్ స్టీల్ అంశంలో జోక్యం చేసుకుని కాస్త బజ్ క్రియేట్ చేశారు కూడా. కానీ… విశాఖ కంటే రాయలసీమ …

Read More »

నితీష్ ప్రయత్నాలు ఫలిస్తాయా ?

వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయేని ఓడించాలని నాన్ ఎన్డీయేలోని అన్నీ పార్టీల్లో బలంగా ఉంది. అయితే అందుకు తగ్గట్లుగా కార్యాచరణే సాధ్యం కావటంలేదు. ఎందుకంటే ఏ పార్టీ కూడా త్యాగాలకు సిద్ధంగా లేదు కాబట్టే. కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏ తో కలవటానికి కొన్ని ప్రాంతీయపార్టీలు సిద్ధంగా లేవు. కాంగ్రెస్ లేకుండా ప్రత్యామ్నం సాధ్యంకాదు. ఇక్కడే చెట్టు ముందు విత్తు ముందా అనే ప్రశ్నలాగ ప్రతిపక్షాల పరిస్ధితి తయారైంది. …

Read More »

మోడీని ఎప్పుడూ వ్య‌తిరేకించ‌లేదు: చంద్ర‌బాబు

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీపై టీడీపీ అదినేత చంద్ర‌బాబు ప్ర‌శంస‌లు గుప్పించారు. మోడీ నాయ‌క‌త్వంలో దేశం అభివృద్ధిలో ప‌య‌నిస్తోం ద‌న్నారు. దేశాభివృద్ధి కోసం.. తెలుగు ప్రజల కోసం తన పరిధిలో తాను పనిచేస్తున్నానని, ప్రధాని విజన్‌తో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నానని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రధాని ఆలోచనలకు అనుగుణంగా తన పరిధి మేరకు కలిసి పనిచేయడానికి సిద్ధమని చంద్రబాబు ప్రకటించారు. దేశ బలమేంటో.. ప్రధాని మోడీ ప్రపంచానికి చాటి చెబుతున్నారని చంద్రబాబు అన్నారు. …

Read More »

పవన్ ఉద్దేశం జనసైనికులకు అర్థమవుతోందా?

2024 అసెంబ్లీ ఎన్నికల్లో తెలగుదేశం, జనసేన కలిసి పోటీ చేస్తే తమ పనైపోతుందని వైఎస్సార్ కాంగ్రెస్ బలంగానే నమ్ముతున్నట్లుగా ఉంది. అందుకే ఆ రెండు పార్టీల మధ్య పొత్తు పొడవకుండా ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేస్తోంది. టీడీపీ, జనసేన ఇప్పుడే పొత్తులపై అధికారికంగా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశాలు లేవు కాబట్టి ఈలోపు.. ఆ రెండు పార్టీల కార్యకర్తల మధ్య వీలైనంత మేర దూరం పెంచి.. పొత్తు పొడవకుండా …

Read More »

ఎన్నికల పొత్తుపై చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ .. !

2024 ఎన్నికల్లో టీడీపీ – బీజేపీ కలిసి పోటీ చేస్తాయా. టీడీపీ అధినేత చంద్రబాబు ఓ మెట్టు దిగి ప్రధాని మోదీతో మాట్లాడతారా.. గతాన్ని మరిచి రాజీకి రెండు పార్టీలు సిద్ధమవుతాయా. చాలా కాలంగా వినిపిస్తున్న ఇలాంటి ప్రశ్నలకు టీడీపీ అధినేత స్వయంగా సమాధానమిచ్చారు. నేరుగా ఆ మాట చెప్పకుండానే పొత్తుకు పచ్చజెండా ఊపారు.. రిపబ్లిక్ టీవీ చర్చావేదికలో మాట్లాడిన చంద్రబాబు, బీజేపీతో పొత్తుకు సిద్ధమన్నట్లుగానే మాట్లాడారు. ప్రధాని మోదీ …

Read More »