తెలంగాణలో గత ఏడాది నవంబరు-డిసెంబరు మధ్య కాలంలో ఏర్పడిన కాంగ్రెస్ పాలనకు సుమారు 250 రోజులు పూర్తయ్యా యి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పాలనపట్ల ప్రజలు ఏమనుకుంటున్నారు? ఎలా ఫీలవుతున్నారు? అనే విషయాలు ఆసక్తికరం. వాస్తవానికి 250 రోజులంటే పెద్దలేక్కలోకి రాకపోయినా.. ప్రస్తుతం సమస్యలతో సవాళ్లు చేస్తున్న ప్రభుత్వాలు.. ప్రజలను మెప్పించడంలో ఒక్కరోజు సక్సెస్ అయినా.. అది ఏడాదిపాటు ఆక్సిజన్‌లా మారిన పరిస్థితుల నేపథ్యంలో రేవంత్ పాలన వ్యవహారం.. ప్రజల సంతృప్తి వంటివి ఇప్పుడు చర్చకుదారితీశాయి.
ఇదే విషయంపై తాజగా ఓ న్యూస్ సర్వీస్ తెలంగాణలో సర్వే చేపట్టింది. ఈ నెల 1-10 తేదీల మధ్య రాష్ట్ర వ్యాప్తంగా 12 -20 జిల్లా ల్లో ప్రజలను పలకరించి.. రేవంత్ పాలనపై అభిప్రాయాలు తీసుకుంది. దీనిలో 72 శాతం మంది ప్రజలు సంతృప్తి వ్యక్తం చేసినట్టు సదరు సర్వే పేర్కొంది. ఈ సర్వేలో మెజార్టీ ప్రజలు రేవంత్ రెడ్డి పాలన పట్ల సంతృప్తి వ్యక్తం చేశారని, పాలన నుంచి సంక్షేమం వరకు.. ఆయనకు జైకొట్టారన్న సర్వే సారాంశం. ప్రధానంగా పలు సంక్షేమ పథకాలకు తోడు.. ప్రజలకు చేరువైన ముఖ్యమంత్రి గా ఆయన ఆదరణ పొందడం విశేషం. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి ఎక్కువ మార్కులు పడినట్టు సర్వే పేర్కొంది.
అదేవిధంగా విద్యార్థులు, నిరుద్యోగులు కూడా రేవంత్ పాలనపై సంతృప్తిగానే ఉన్నారని సర్వే తెలిపింది. ఎక్కువగా ప్రజలకు అందుబాటులో ఉంటున్న ముఖ్యమంత్రి అని రేవంత్‌ను ఉద్దేశించి ప్రజలు పేర్కొనడం గమనార్హం. నిరాడంబరత్వం.. ప్రజలకు అందుబాటులో ఉండడం.. ఏ విషయంపైనైనా తక్షణమే స్పందించడం.. బలమైన గళం వంటివి రేవంత్ ప్రభుత్వానికి మంచి మార్కులు పడేలా చేశాయి. ఇక, రైతు రుణమాఫీ కూడా..గ్రామీణ స్థాయిలో కాంగ్రెస్ సర్కారుకు మార్కులు వేసినట్టు తెలుస్తోం ది. ఆడంబరాలకు, వివాదాలకు దూరంగా.. ఉండడాన్ని మెజారిటీ ప్రజలు ఆహ్వానిస్తున్నట్టు సర్వే పేర్కొంది.
ఇక, సర్వే ఫలితాలపై.. కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఆరు గ్యారెంటీలను అమలు చేస్తుండడమే తమ సర్కారుకు మంచి మార్కులు వేసేలా చేసిందని నాయకులు తెలిపారు. ముఖ్యంగా మహిళలు, రైతుల పక్షపాత ప్రభుత్వంగా ఉందని అందుకే ప్రజలు తమ వెంటే ఉన్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ కవరేజీని రూ.10 లక్షలకు పెంపు వంటి హామీలు ప్రజల మనసును చూరగొన్నాయని తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన 7 మాసాల్లోనే ఇంత భారీ స్థాయిలో ప్రజల మద్దతు కూడగట్టడం అభిమానం సంపాయించుకో వడం సంతోషంగా ఉందన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates