Political News

అమరావతిపై జగన్ మరో సంచలన నిర్ణయం

సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ రాజధానిని అమరావతి నుంచి తరలించాలని ముమ్మరంగా ప్రయత్నాలు చేసిన సంగతి తెలిసిందే. పాలనా రాజధానిగా మాత్రమే అమరావతిని కొనసాగించేందుకు మొగ్గు చూపిన జగన్….మూడు రాజధానులంటూ కొత్త రాగం అందుకున్నారు. దీంతో, అమరావతి కోసం వేల ఎకరాలిచ్చిన రైతులు ఆందోళన చేపట్టారు. 3 రాజధానుల ఏర్పాటును నిరసిస్తూ ఏడాది నుంచి ఆందోళనలు, దీక్షలు కొనసాగిస్తోన్నారు. అయినప్పటికీ జగన్ తన మొండి వైఖరిని వీడకుండా …

Read More »

తమ్ముడి పై అన్న సవాలు

ఇంతకాలం డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ విషయంలో మౌనం వహించిన అన్నయ్య అళగిరి ఒక్కసారిగా బరస్టయ్యారు. మధురైలో పార్టీ నేతలు, మద్దతుదారులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతు తన తమ్ముడు ఎప్పటికీ తమిళనాడు ముఖ్యమంత్రి కాలేడంటు చేసిన ప్రకటన సంచలనంగా మారింది. పార్టీ పగ్గాల కోసం చాలా కాలంగా అన్న, తమ్ముళ్ళ మధ్య పెద్ద గొడవలే జరుగుతున్నాయి. వివిధ కారణాలతో కరుణానిధి ఉన్నపుడు అళగిరిని పార్టీ నుండి …

Read More »

తిరుపతి ఉపఎన్నికకు బండి ఇన్చార్జా ?

Bandi Sanjay

చూస్తుంటే వ్యవహారం అలాగే ఉంది. తెలంగాణా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కు తిరుపతిలో బీజేసీ+జనసేన అభ్యర్ధిని గెలిపించే బాధ్యతను పార్టీ అగ్రనాయకత్వం అప్పగించినట్లే ఉంది. లేకపోతే తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో బైబిల్ పాలన కావాలా ? లేకపోతే భగవద్గీత పాలన కావాలో జనాలు తేల్చుకోవాలని పిలుపువ్విటమే ఆశ్చర్యంగా ఉంది. బండి మాటలు వింటుంటే తెలంగాణాలో జరిగిన ఎన్నికల సమయంలో జనాలను ఎంతగా రెచ్చగొట్టారో అందరికీ తెలిసిందే. తెలంగాణాలో …

Read More »

కలియుగం క్లైమాక్స్ ఇదే.. జగన్ సంచలన వ్యాఖ్యలు

కొంత కాలంగా ఏపీలో హిందూ ఆలయాలు, దేవుళ్ల విగ్రహాల ధ్వంసం ఘటనలు తీవ్ర కలకలం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలపై ప్రభుత్వం ఉదాసీనంగా ఉండడం వల్లే దుండగులు రెచ్చిపోతున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. తమ ప్రభుత్వంపై బురదజల్లేందుకే కొందరు కావాలని ఈ తరహా దాడులను ప్రోత్సహిస్తున్నారని వైసీపీ నేతలు అంటున్నారు. ఈ ఘటనలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీరియస్‌ అయిన సంగతి తెలిసిందే. దేవుడితో చెలగాటమాడవద్దని, దేవుడితో పెట్టుకుంటే …

Read More »

టీడీపీ రెండు విధాల నష్టపోతుందా ?

చివరకు తెలుగుదేశంపార్టీ రెండు విధాల నష్టపోతుందేమో అనే సందేహం మొదలైంది. ఎందుకంటే చంద్రబాబునాయుడు అనుసరిస్తున్న విధానాలు అలాగే ఉన్నాయి మరి. చంద్రబాబు తాజా వైఖరి చూసిన తర్వాత అందరికీ అర్ధమైంది ఇదే. తనకు అలవాటు లేని మతపరమైన అజెండాను చంద్రబాబు నెత్తికెత్తుకున్నారు. విజయనగరం జిల్లా నెల్లిమర్లలోని బొడకొండమీద రామతీర్ధం ఆలయం దగ్గర చంద్రబాబు చూపించిన అత్యుత్సాహం, చేసిన హడావుడి చూసి అందరు ఆశ్చర్యపోతున్నారు. నిజానికి ఇటువంటి అజెండాను భుజాన వేసుకున్నంత …

Read More »

ఆయన పేరు కొడాలి నాని.. ఆయన అలానే మాట్లడతారు

నిండు కుండలో పాలు ఉన్నా.. చిటికెడు ఉప్పు చాలు.. మొత్తాన్ని పాడు చేయటానికి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనూ ఇప్పుడు అలాంటి పరిస్థితే నెలకొంది. సంక్షేమం కోసం కష్టపడుతున్న జగన్ కు భిన్నంగా ఆయన పార్టీకి చెందిన కొద్దిమంది నేతల పుణ్యమా అని.. తరచూ వివాదాల్లోకి చిక్కుకుపోవాల్సి వస్తోంది. ప్రభుత్వ ఇమేజ్ ను డ్యామేజ్ చేసేలా వారి మాటలు ఉండటం ఇప్పుడు ఇబ్బందికరంగా మారింది. అలాంటి వారిలో మంత్రి కొడాలి …

Read More »

పిక్ టాక్: కూతురికి సీఐ సెల్యూట్ చేస్తే..

పిల్లలు పుట్టినప్పటి కంటే వాళ్లు ప్రయోజకులై, సమాజంలో మంచి పేరు సంపాదించినపుడు, ఒక స్థాయి అందుకున్నపుడు తల్లిదండ్రుల ఆనందానికి అవధులు ఉండవు. అందులోనూ ఒక తండ్రి పని చేస్తున్న చోటే కూతురు ఉన్నతోద్యోగిగా చేరితే.. ఆమెకు ఆ తండ్రి సెల్యూట్ చేయాల్సి వస్తే అది అమితానందాన్ని, ఎంతో స్ఫూర్తిని ఇచ్చే విషయమే. తిరుపతిలో తాజాగా ఇలాంటి దృశ్యమే కనిపించింది. ఇక్కడ సీఐగా పని చేస్తున్న శ్యామ్ సుందర్.. డీఎస్పీ అయిన …

Read More »

టాక్ ఆఫ్ ఏపీ: యామిని సాదినేని కన్నీళ్లు

2014 ఎన్నికల తర్వాత.. గత ఏడాది ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఆ పార్టీలో బాగా హైలైట్ అయిన మహిళా నేతల్లో యామిని సాధినేని ఒకరు. పార్టీలో మహిళా నేతల వాయిస్ తగ్గిపోతున్న సమయంలో యామిని తెరపైకి వచ్చి బలంగా తన వాయిస్ వినిపించింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద ఆమె చేసిన ‘మల్లెపూలు’ కామెంట్ అప్పట్లో సంచలనం రేపింది. ఈ కామెంట్ వల్ల …

Read More »

మిత్రపక్షాలను కలిపిన ‘రామతీర్ధం’

విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని రామతీర్ధం దేవాలయం దగ్గరకు మిత్రపక్షాలైన బీజేపీ, జనసేన ఆధ్వర్యంలో ధర్మయాత్ర జరగబోతోంది. ఈనెల 5వ తేదీన ఉదయం 11 గంటలకు ఛలో రామతీర్ధం దర్మయాత్ర పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నట్లు జనసేన ప్రెస్ నోట్ విడుదల చేసింది. మామూలుగా అయితే ఈ కార్యక్రమాన్ని జనసేన ఒకటే నిర్వహించాలని అనుకున్నది. కానీ ఏమైందో ఏమో చివరి నిముషంలో బీజేపీని కూడా కలుపుకుంది. రెండుపార్టీలు మిత్రపక్షాలై సుమారుగా …

Read More »

మహానాడుకు ఎంఐఎంకు ఆహ్వానం

హెడ్డింగ్ చూసి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. జనవరి 6వ తేదీన చెన్నైలో జరగబోతున్న డీఎంకే మహానాడులో పాల్గొనాల్సిందిగా ఏఐఎంఐఎంకు ఆహ్వానం అందింది. బీహార్లో మంచి ఫలితాలు సాధించిన మజ్లిస్ పార్టీకి ఇతర రాష్ట్రాల్లో కూడా మంచి గుర్తింపు వస్తోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 25 నియోజకవర్గాల్లో పోటీ చేసిన ఎంఐఎం ఐదు నియోజకవర్గాల్లో గెలిచిన విషయం తెలిసిందే. అంతకుముందు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ చేసి రెండు …

Read More »

కేసీయార్ సరెండర్ అయిపోయినట్లేనా ?

క్షేత్రస్ధాయిలో జరుగుతన్నది చూస్తుంటే కేంద్రప్రభుత్వానికి కేసీయార్ పూర్తిగా సరెండర్ అయిపోయినట్లే అనుమానాలు పెరిగిపోతోంది. దుబ్బాక ఎన్నికలకు ముందు కేంద్రంలోని నరేంద్రమోడి సర్కార్ పై ఎంతమాట పడితే అంత మాట్లాడేసేవారు కేసీయార్. ఆయుష్మాన భవ లాంటి కొన్ని కేంద్ర పథకాలను రాష్ట్రంలో అమలు చేసేది లేదని ప్రతిజ్ఞ చేశారు. ఈమధ్యనే కేంద్రం చేసిన మూడు నూతన వ్యవసాయ చట్టాలను రాష్ట్రంలో అమలు చేసేదే లేదని తెగేసి చెప్పారు. గ్రేటర్ ఎన్నికల సందర్భంలో …

Read More »

బీజేపీతో పోటీ పడుతున్న పవన్ ?

అవును వినటానికి విచిత్రంగానే ఉన్నా ఇదే నిజం. ఒకవైపు తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో పోటీ చేయటమే టార్గెట్ గా బీజేపీ గట్టి ప్రయత్నాలు చేసుకుంటోంది. తెరవెనుక ఒకవైపు ప్రయత్నాలు చేసుకుంటునే మరోవైపు ఏవో కార్యక్రమాలు, ఏవో ఆరోపణలు, విమర్శలతో నిత్యం మీడియాలో కనబడుతోంది. పనిలో పనిగా అవసరం ఉన్నా లేకపోయినా తిరుపతి నియోజకవర్గం మీదే ఎక్కువగా దృష్టిపెట్టింది. ఇందులో భాగంగానే లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ …

Read More »