బాబు ప్ర‌యాస‌.. త‌మ్ముళ్ల కులాసా..

ఏమాట‌కు ఆమాటే చెప్పుకోవాలి. వ‌య‌సు మీద‌ప‌డుతున్నా.. న‌వ‌ యువ‌కుడిగా.. క‌ష్ట‌ప‌డుతున్నారు టీడీపీ అధినేత చంద్ర‌బాబు. క‌రోనా స‌మ‌యంలోనూ ఆయ‌న తిరుప‌తి పార్ల‌మెంటు ఉప ఎన్నిక ప్ర‌చారానికి వ‌చ్చారు. వారం పాటు అక్క‌డే మ‌కాం వేసి ప్ర‌చారం చేశారు. ఇక‌, ఆ త‌ర్వాత.. మునిసిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లోనూ విజ‌య‌వాడ‌, విశాఖ‌, గుంటూరు కార్పొరేష‌న్ల‌లో ప్ర‌చారం చేశారు. ఇక‌, ఎప్పుడు అవ‌కాశం వ‌స్తే.. అప్పుడు.. జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డు తున్నారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. మ‌రి ఇలా ఎన్నాళ్లు? అనేదే ఇప్పుడు ప్ర‌శ్న‌. ఎన్నిక‌లు వ‌చ్చేందుకు మ‌రో మూడేళ్ల స‌మ‌యం ఉంది.

అంటే.. ఈ మూడేళ్ల‌ పాటు.. పోనీ ఎన్నిక‌ల‌కు ఆరు మాసాల స‌మ‌యం తీసేసినా.. మ‌రో రెండున్న‌రేళ్ల‌పాటు.. చంద్ర‌బాబు చ‌మ‌టో డ్చాల్సిందేనా? సీనియ‌ర్లు ఎవ‌రూ బ‌య‌ట‌కు రారా? పార్టీ అదికారంలోకి వ‌స్తే.. ప‌ద‌వులు పంచుకునేందుకు రెడీగా ఉన్న వారు కూడా ఇప్పుడు క‌నిపించ‌డం లేదే! ఇదీ.. టీడీపీ సానుభూతిప‌రులు వ్య‌క్తం చేస్తున్న అభిప్రాయం. గుంటూరు జిల్లానే తీసుకుం టే.. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఇద్ద‌రు ఉంటే.. ఒక‌రు వైసీపీలోకి జంప్ చేసినా.. మ‌రొక‌రు యాక్టివ్‌గా ఉండాలి. కానీ, అది క‌నిపించ‌డం లేదు. విజ‌య‌వాడ‌లో గెలిచిన నాయ‌కులు.. ఇద్ద‌రు కూడా ఎడ‌మొహం పెడ‌మొహం అన్న‌చందంగానే ఉన్నారు. కృష్ణాజిల్లా విష‌యానికి వ‌స్తే.. ఇద్ద‌రు మాజీ మంత్రులు మాత్ర‌మే వాయిస్ వినిపిస్తున్నారు..

ఇక‌, అనంత‌పురంలో జేసీ కుటుంబం గురించి ఎంత త‌క్కువ చెప్పుకొన్నా ఎక్కువే. ఇవి.. కొన్ని ఉదాహ‌ర‌ణ‌లు మాత్ర‌మే. ప్ర‌స్తుతం టీడీపీ ఎదుర్కొంటున్న పరిస్థితిని త‌క్కువ‌గా అంచ‌నా వేయ‌డం సాధ్య‌మ‌య్యే ప‌నికాదు. గ‌తంలో మాదిరిగా.. ఇప్పుడు పాల‌న సాగ‌డం లేదు. అభివృద్ధి జ‌ర‌గ‌డం లేద‌నో.. రాజ‌ధాని లేద‌నో.. పోల‌వ‌రం ఆగింద‌నో.. చూపించి.. ప్ర‌జ‌ల్లోకి వెళ్లి జ‌గ‌న్ పై పైచేయి సాధించేద్దాం.. అనుకుంటే.. నిజంగా దీనిని మించిన త‌ప్పులేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎందుకంటే.. ఇప్పుడు మెజారిటీ ఓట‌ర్లుగా ఉన్న మ‌హిళ‌ల‌కు, పేద‌ల‌కు, దిగువ మ‌ధ్య‌త‌ర‌గ‌తి వారికి.. జ‌గ‌న్ పంచుతున్న సంక్షేమం.. ఎవ‌రు కాద‌న్నా.. ప్ర‌భావం చూపిస్తోంది.

గ‌తంలో వైఎస్ ఉన్న‌ప్పుడు అంటే.. సెకండ్ ట‌ర్మ్‌2009లో ఎన్నిక‌లు జ‌రిగిన‌ప్పుడు.. ఒక కీల‌క కామెంట్ వినిపించేది. అధికా రంలో ఉన్న‌వారు.. తింటేతిన్నీ.. మాకు కూడా ఎంతో కొంత పెడుతున్నారుగా! అని ఎక్కువ ప్ర‌చారంలోకి వ‌చ్చింది. అంటే.. ప్ర‌జ‌ల్లో మెజారిటీ వ‌ర్గం.. పాల‌కులు అవినీతి చేసినా.. లేక అభివృద్ధి చేయ‌క‌పోయినా.. ప‌ట్టించుకోర‌నే విష‌యం.. నిర్వివాదాంశం. దీనిని ప్ర‌జాస్వామ్య వాదులు ఒప్పుకోక‌పోయినా.. 2019 ఎన్నిక‌ల్లో ఏపీలో జ‌రిగింది ఇదే క‌దా!! అభివృద్ది చేస్తున్న పార్టీని కాద‌ని.. కేసులు ఉన్నాయ‌ని.. జైలుకు కూడా వెళ్లివ‌చ్చార‌ని తెలిసి కూడా జ‌గ‌న్‌కు ఛాన్స్ ఇచ్చేశారు. సో.. ఈ మొత్తం ఎపిసోడ్‌లో చెప్పొచ్చేదేంటంటే.. టీడీపీ నేత‌లు.. ఇప్ప‌టి నుంచే రంగంలోకి దిగక‌పోతే.. క‌ష్ట‌మ‌నే వ్యాఖ్య‌లే వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్ర‌యోజనాల క‌న్నా కూడా.. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు పెరుగుతున్నందున .. ఏపీ ప్ర‌జ‌ల‌కు జ‌గ‌న్ వ్య‌తిరేకుడు కాక‌పోవ‌చ్చు.. అనే స‌త్యం గ్ర‌హిస్తే.. ఇప్ప‌టి నుంచే ఇంటిని స‌రిదిద్దుకునే ప్ర‌య‌త్నం చేయ‌క‌త‌ప్ప‌దు!!