Political News

టీడీపీలో ఉండ‌లేక‌.. బ‌య‌ట‌కు రాలేక‌!

మారుతున్న కాలానికి అనుగుణంగా మార్పులు చేసుకోవాల్సిన అవ‌స‌రం ఏ రంగానికైనా ఉంటుంది. ఎక్క‌డ త‌ప్పులు జ‌రుగుతున్నాయో.. వాటిని విశ్లేషించుకుని ముందుకు సాగితేనే ఎవ‌రికైనా ఫ్యూచ‌ర్ ఉంటుంద‌నేది వాస్త‌వం. కానీ, ఇది మ‌రిచిపోయిన గుంటూరు జిల్లాకు చెందిన సీనియ‌ర్ రాజ‌కీయ నేత‌.. టీడీపీ మాజీ ఎంపీ.. కురువృద్ధుడు రాయ‌పాటి సాంబ‌శివ‌రావు.. వేసిన అడుగులు ఇప్పుడు ఆ కుటుంబాన్ని రాజ‌కీయంగా ప్ర‌శ్నార్థ‌కం చేస్తున్నాయి. వ‌చ్చిన అవ‌కాశాన్ని విస్మ‌రించ‌డం.. భ‌విష్య‌త్తును అంచ‌నా వేసుకోలేక పోవ‌డం …

Read More »

వైసీపీ ఎంఎల్ఏకు ప్రాణహాని ఉందట

అధికారపార్టీ ఎంఎలఏకే ప్రాణహాని ఉందట. గుంటూరు జిల్లాలోని రాజధాని నియోజకవర్గం తాడికొండ ఎంఎల్ఏ ఉండవల్లి శ్రీదేవి స్వయంగా ఈ మేరకు తానే ఫిర్యాదు చేశారు కాబట్టి నిజమే అనుకోవాల్సుంటుంది. ఇంతకీ విషయం ఏమిటంటే ఎంఎల్ఏపై నియోజకవర్గంలోని ఇద్దరు కార్యకర్తలు శృంగారపాటి సందీప్, చలివేంద్రపు సురేష్ కు ఎంఎల్ఏకు పూర్తిస్ధాయిలో గొడవలు నడుస్తున్నాయి. నాలుగు రోజుల క్రితం బాపట్ల ఎంపి నందిగం సురేష్, తాడికొండ ఎంఎల్ఏ శ్రీదేవి నుండి తమకు ప్రాణహాని …

Read More »

ఈ ఎంపి సమస్యేంటో అర్ధం కావటం లేదే ?

పార్టీ ఏమో ఈ ఎంపిపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ ను కోరింది. కానీ ఈయనేమో తాను వైసీపీ ఎంపినే అంటు చెప్పుకుంటున్నారు. టెక్నికల్ గా ఎంపి చెబుతున్నది కరెక్టే కానీ పార్టీ మాత్రం అలా అనుకోవటం లేదు. ఎందుకంటే పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాల నుండి ఎంపిని దాదాపు వెలేసినట్లే అర్ధమైపోతోంది. ఈపాటికే విషయం అర్ధమైపోయుండాలి. అవును నరసాపురం ఎంపి రఘురామ కృష్ణంరాజు గురించే ఇదంతా. మొన్నటి ఎన్నికల్లో …

Read More »

ఎస్సీ-ఎస్టీ కేసులు.. ఇకపై అలా చెల్లవు

దళితులకు రక్షణ కల్పించేందుకు తీసుకొచ్చిన ఎస్పీ, ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టాన్ని దుర్వినియోగం చేస్తుండటంపై ఎప్పట్నుంచో చర్చ జరుగుతోంది. నిజంగా ఈ చట్టం అసలైన బాధితులకు ఏమేర ఉపయోగపడుతోందన్న ప్రశ్న తరచుగా తలెత్తుతూ ఉంటుంది. రాజకీయ నాయకులు ప్రత్యర్థుల్ని ఇరుకున పెట్టేందుకు ఎస్సీ, ఎస్టీలను ఉపయోగించుకుని కేసులు పెట్టించిన సందర్భాలు ఎన్నో. అలాగే ఈ చట్టం కింద కేసులు పెట్టి కొందరు బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. సమాజంలో …

Read More »

స్కూళ్ళంటేనే తల్లి, దండ్రులు భయపడుతున్నారా ?

సుదీర్ఘకాలం తర్వాత రాష్ట్రంలో పునఃప్రారంభమైన స్కూళ్ళకు తమ పిల్లల్ని పంపాలంటేనే తల్లి, దండ్రులు భయపడుతున్నారా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎందుకంటే స్కూళ్ళు తెరిచి నాలుగు రోజులు కూడా కాకుండానే వందలమంది టీచర్లకు, విద్యార్ధులకు కరోనా వైరస్ సోకుతోంది. రాష్ట్రం మొత్తం మీద ఇఫ్పటి వరకు సుమారు 900 మంది టీచర్లకు దాదాపు 600 మందికి పైగా విద్యార్ధులకు కరోనా వైరస్ సోకినట్లు వార్తలు వస్తున్నాయి. …

Read More »

20 ఏళ్లుగా టీడీపీలోనే.. అయినా గుర్తింపు లేదాయే.. మ‌హిళా నేత ఫైర్‌

ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ త‌ర‌ఫున‌ గ‌ట్టి వాయిస్ వినిపించ‌డ‌మే కాకుండా.. త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నారు విజ‌య‌వాడ‌కు చెందిన బీసీ నాయ‌కురాలు పంచుమ‌ర్తి అనురాధ‌. 1990 ల నుంచి కూడా ఆమె టీడీపీలోనే ఉన్నారు. ప‌ద్మ‌శాలి సామాజిక వ‌ర్గానికి చెందిన అనురాధ‌.. విజ‌య‌వాడ కార్పొరేష‌న్ మేయ‌ర్‌గా కూడా ప‌నిచేశారు. అయితే.. ఆ త‌ర్వాత చాలా కాలం పాటు పార్టీకి దూరంగా ఉన్నారు. మ‌ళ్లీ రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత 2014 ఎన్నిక‌ల …

Read More »

చివరి ఎన్నికల పేరుతో సెంటిమెంటును ప్రయోగించిన నితీష్

పదేళ్ళ పాలనలో రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధి చేశానని చెప్పుకున్నా చివరకు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సెంటిమెంటునే నమ్ముకున్నట్లున్నారు. బీహార్ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో మూడో విడత ప్రచారంలో పూర్ణియా జిల్లాలో మాట్లాడుతూ ‘2020 ఎన్నికలే తన జీవితంలో చివరి ఎన్నికలం’టూ ప్రకటించేశారు. ఈ నెల 7వ తేదీన మూడో దశ పోలింగ్ జరగబోతోంది. దీనికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలతో నితీష్ బిజీగా ఉన్నారు. ఎన్డీయే తరపున ముఖ్యమంత్రి అభ్యర్ధిగా జేడీయు …

Read More »

ఏపీ స్కూళ్లలో కరోనా కలకలం?

కరోనా విజృంభణ మొదలవుతున్న తరుణంలో ముందు జాగ్రత్త చర్యగా ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికలను ఈసీ వాయిదా వేస్తే దాని మీద తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది జగన్ సర్కారు. ఐతే ఇప్పుడు ఇంకా కరోనా తగ్గుముఖం పట్టని నేపథ్యంలో ఈసీ స్థానిక ఎన్నికలు నిర్వహించడానికి ప్రయత్నిస్తుంటే ప్రభుత్వం అందుకే ససేమిరా అంటోంది. అంత వరకు బాగానే ఉంది. కానీ ఎన్నికలు నిర్వహించకపోవడానికి కరోనాను కారణంగా చూపుతున్న అదే ప్రభుత్వం ఏపీలో …

Read More »

నిమ్మగడ్డ కి పోలింగ్ సిబ్బంది ట్విస్ట్

స్ధానిక సంస్ధల ఎన్నికల నిర్వహణ వివాదం మరో కీలక మలుపు తీసుకుంది. కరోనా వైరస్ కేసుల నేపధ్యంలో రాష్ట్రంలో స్ధానిక సంస్ధల ఎన్నికలను నిర్వహించేందుకు లేదంటు ఏపిఎన్జీవో నేతలు స్పష్టంగా చెప్పారు. కరోనా కేసుల కారణంగా ఎన్నికలు నిర్వహించే పరిస్ధితులు రాష్ట్రంలో లేవని నేతలు అభిప్రాయపడ్డారు. ఎన్నికల నిర్వహించాలంటే ముందు భారం పడేది పోలింగ్ సిబ్బందిపైనే అన్న విషయాన్ని నేతలు గుర్తుచేశారు. ప్రస్తుత పరిస్దితుల్లో ఎన్నికల నిర్వహణలో పాల్గొనేందుకు ఉద్యోగులు …

Read More »

క‌ర్నూలు ‘సైకిల్‌’.. దారి త‌ప్పుతోందా?

క‌ర్నూలు జిల్లా టీడీపీ రాజ‌కీయాలు దారి త‌ప్పుతున్నాయా? ఎవ‌రికి వారే అన్న‌ట్టుగా నేత‌లు వ్య‌వ‌హ‌రిస్తు న్నారా? సైకిల్ దారి త‌ప్పుతోందా? అంటే.. ఔన‌నే సంకేతాలే వ‌స్తున్నాయి. వ్య‌క్తిగ‌త వివాదాల‌తో కొంద‌రు వ్యాపార విష‌యాల‌తో కొంద‌రు.. మ‌న‌కెందుకులే అని అనుకునే వారు మ‌రికొంద‌రు.. అధికార పార్టీ నేతల‌తో కుమ్మక్క‌వుతున్న వారు ఇంకొంద‌రు.. ఇలా టీడీపీని.. పార్టీ అధినేతను ప‌ట్టించుకునే నాయ‌కులు క‌నిపించ‌డం లేద‌న్న‌ది విశ్లేష‌కుల భావ‌న‌. క‌ర్నూలు న‌గ‌ర టీడీపీ ఇంచార్జ్‌గా …

Read More »

తొందరలోనే టీటీడీ ఎఫ్ఎం రేడియో

సుమారు ఆరు మాసాల్లోపు తిరుమల తిరుపతి దేవస్ధానం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఎఫ్ఎం రేడియో ప్రసారాలు అందుబాటులోకి రానున్నాయి. టీటీడీ ప్రత్యేకంగా ఎఫ్ఎం రేడియో ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని భక్తుల ఎప్పటి నుండో కోరుతున్నారు. ప్రత్యేకంగా ఎఫ్ఎం రేడియో కేంద్రం ఏర్పాటు చేసుకుంటే వెంకటేశ్వరస్వామి భక్తి పాటలు, అన్నమయ్య కీర్తనలు, శ్రీవారి పూజా కైంకర్యాలను, తిరుమల ఆలయంలో జరిగే కల్యాణోత్సవాలను ప్రతిరోజు వినే భాగ్యం దక్కుతుందని భక్తులు చాలా కాలంగా అడుగుతున్నారు. …

Read More »

ఆర్నాబ్ ను అరెస్టు అయ్యేలా చేసిన కేసు ఏమిటి?

తన మాటలతో.. దూకుడుతనంతో భారతదేశం మొత్తం గుర్తింపు పొందిన జర్నలిస్టు దిగ్గజం ఆర్నాబ్ గోస్వామి ఈ ఉదయం పోలీసులు అరెస్టు చేయటం తెలిసిందే. దాదాపు రెండేళ్ల క్రితం జరిగిన ఆత్మహత్య కేసులో.. ఆయన కారణంగానే అదంతా జరిగిందన్నఆరోపణలతో ఆయన్ను అరెస్టు చేశారు. అధికారంలో ఉన్న వారితో పెట్టుకుంటే.. ఎవరైనా సరే.. తమకున్నపవర్ ను చూపించే ప్రభుత్వాధినేతలకు కొనసాగింపుగా తాజా చర్యను చూడాలి. తమను.. తమ ప్రభుత్వానికి కంటి మీద కునుకు …

Read More »