ప్రముఖ సినీ క్రిటిక్ కత్తి మహేష్… ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన చెన్నైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా… చెన్నై అపోలో అసుపత్రిలో శస్త్ర చికిత్స అనంతరం ఆయన ప్రాణాపాయం నుండి బయటపడ్డారు.
కాగా కత్తి మహేష్ వైద్య ఖర్చులకు ఏపి ప్రభుత్వం రూ.17లక్షలు మంజూరు చేసింది. ఈ మేరకు సీఎంఆర్ఎఫ్ నుండి ఆసుపత్రి యాజమాన్యంకు సీఎంఆర్ఎఫ్ నుండి ఎల్ఓసీ జారీ చేసింది.
ఆరు రోజుల క్రితం కత్తి మహేష్ చిత్తూరు జిల్లా నుండి హైదరాబాద్ కు కారులో వెళుతుండగా నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదానికి గురైయ్యారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కత్తి మహేష్ ను తొలుత నెల్లూరులోని ఆసుపత్రికి తరలించారు. తీవ్రమైన గాయాలు కావడం, పరిస్థితి ఆందోళన కరంగా ఉండటంతో ఆయనను చెన్నైకి తరలించారు.
చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో ప్రస్తుతం కత్తి మహేష్ చికిత్స పొందుతున్నారు. అక్కడ పలు శస్త్ర చికిత్సలు జరగడంతో ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో జగన్మోహనరెడ్డి సర్కార్ సీఎం సహాయ నిధి నుండి వైద్య ఖర్చులకు నిధులు మంజూరు చేయడం పట్ల ఆయన కుటుంబ సభ్యులు, మహేష్ స్నేహితులు సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.