Political News

డేంజర్ జోన్లోకి కొడాలి నాని

మంత్రి కొడాలి నాని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయారు. వివాదాస్పద వ్యాఖ్యలకు పెట్టింది పేరైన నాని.. హిందూ దేవాలయాలకు సంబంధించి ఏపీలో వరుసగా చోటు చేసుకుంటున్న అనుమానాస్పద ఘటనల విషయంలో చాలా తేలిగ్గా మాట్లాడేశారు. అంతర్వేది రథం కాలిపోతే ఏముంది.. కోటి రూపాయలు పెట్టి ప్రభుత్వమే కొత్తది తయారు చేయిస్తుంది.. దేవుడికొచ్చిన నష్టమేంటి అని ఆయన ప్రశ్నించారు. అలాగే ఆంజనేయుడి విగ్రహానికి చెయ్యి విరిగిపోతే దేవుడికి …

Read More »

టీడీపీ నుంచి మ‌రొక‌రు ఔట్‌.. జ‌గ‌నే ఆపుతున్నారా?

రాష్ట్రంలో జంపింగుల ప‌ర్వం కొన‌సాగుతూనే ఉంది. ప్ర‌తిప‌క్షం టీడీపీ నుంచి గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన ఎమ్మెల్యేలు ఇప్ప‌టికే ముగ్గురు అధికార వైసీపీకి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. మాజీలు, ఇత‌ర నాయ‌కులు ఇప్ప‌టికే కండువాలు మార్చేసుకున్నారు. ఈ ప‌రంప‌ర ఇప్ప‌టితో అయిపోయిందా? అంటే.. తాజాగా వ‌స్తున్న వార్త‌ల‌ను బ‌ట్టి.. మ‌రింత మంది టీడీపీ నాయ‌కులు, ఓ న‌లుగురు వ‌ర‌కు చంద్ర‌బాబుకు హ్యాండిచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే, వీరిలో కొంద‌రు నిర్ణ‌యించుకున్నా.. …

Read More »

ఉత్తరాది ఆధిపత్య ధోరణిపై కుమార స్వామి సంచలన వ్యాఖ్యలు

దక్షిణాదివారంటే ఉత్తరాది వారికి చులకన భావమన్న వాదన దక్షిణాది ప్రజలతోపాటు రాజకీయ నేతల్లోనూ చాలాకాలంగా ఉంది. హిందీ భాష విషయంలో ఉత్తరాది వారి డామినేషన్ ను తమిళ తంబీలు గట్టిగా ప్రశ్నించిన సందర్భాలు అనేకం. ఇటీవలి కాలంలో మాకు హిందీ తెలియదంటూ తమిళులు పెడుతున్న పోస్ట్ లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా పొరుగు రాష్ట్రం కర్ణాటకలోనూ ఉత్తరాది డామినేషన్ పై చలనం వచ్చింది. ఉత్తరాది …

Read More »

దొందూ దొందే.. అప్పుడు యూపీఏ.. ఇప్పుడు ఎన్డీయే

విషయం ఏదైనా వాదనలోకి వచ్చినంతనే ఎవరు ఏ పార్టీకి అనుకూలమన్న భూతద్దాలు వేసుకొని చూడటం కామన్. అయితే.. పార్టీలతో సంబంధం లేకుండా.. మంచిని మంచిగా.. చెడును చెడుగా చూసే వారు కొందరు ఉంటారు. ఇలాంటి వారికి ఏ ఇజాలు ఉండవు. సంప్రదాయాల్ని పాటిస్తూ.. నిబంధనల్నిపక్కాగా అనుసరిస్తూ ఉంటే చాలని భావిస్తారు. అలాంటి వారికి దేశంలోని అధికారపక్షాలు వ్యవహరించే ధోరణి ఎప్పుడూ తప్పుగానే కనిపిస్తూ ఉంటుంది. తాజాగా రాజ్యసభలో వ్యవసాయానికి సంబంధించిన …

Read More »

నాడు క‌న్నామాటే విన‌నివారు ఇప్పుడు సోము పిలిస్తే వ‌స్తారా?

ఏపీ బీజేపీలో హాట్ టాపిక్ ఒక‌టి హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఏపీ బీజేపీ ప‌గ్గాలు చేప‌ట్టిన కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన సోము వీర్రాజు.. పార్టీని బ‌లోపేతం చేసుకునేందుకు ఉన్న అన్ని మార్గాల‌ను అన్వేషిస్తున్నారు. ఎక్క‌డ అవ‌కాశం ఉంటే.. అక్క‌డ పార్టీని బ‌లోపేతం చేయాల‌ని చూస్తున్నారు. ఈ క్ర‌మంలో నియోజ‌క‌వ‌ర్గాల‌పై దృష్టి పెడుతున్న‌ట్టు తెలిసింది. ఇక‌, రాష్ట్రంలో హిందూ ఓటు బ్యాంకును త‌న పార్టీవైపు మ‌లుచుకునేందుకు ఇటీవ‌ల జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను బీజేపీకి …

Read More »

బిజెపి వైపు వంగవీటి చూపు.. ఎన్ని పార్టీలు మారుతాడో !

కృష్ణాజిల్లాలో నిలకడలేని నేతల పేర్లు చెప్పమంటే ఎవరికైనా ముందుగా గుర్తుకొచ్చేది వంగవీటి రాధాకృష్ణ పేరునే చెప్పుకోవాలి. వంగవీటి పేరే ఎందుకింతగా జనాలకు గుర్తుంటుందంటే ఆయన అన్ని పార్టీలు మారారు కాబట్టి. కాంగ్రెస్ పార్టీతో రాజకీయ ప్రస్ధానం మొదలుపెట్టిన రాధా తర్వాత అంటే 2009లో ప్రజారాజ్యంలో చేరారు. తర్వాత ప్రజారాజ్యం కాంగ్రెస్ లో కలిసిపోయింది. అదే సమయంలో కాంగ్రెస్ నుండి బయటకు వచ్చేసిన జగన్మోహన్ రెడ్డి వైసిపిని ఏర్పాటు చేశారు. పిఆర్పీతో …

Read More »

రాయుడుంటే ప్రపంచకప్ వచ్చేదా..

భారత క్రికెట్ జట్టులో తెలుగు క్రికెటర్లకు దక్కిన ప్రాతినిధ్యం, ప్రాధాన్యం చాలా తక్కువ. మ్యాచ్ ఫిక్సింగ్ మరకలంటించుకున్న అజహరుద్దీన్ సంగతి పక్కన పెట్టేస్తే.. భారత జట్టుకు ఎన్నో గొప్ప విజయాలందించిన వీవీఎస్ లక్ష్మణ్‌కు అప్పట్లో సరైన వీడ్కోలు కూడా లభించలేదు. అతను మంచి ఫాంలో ఉండగా 2003 ప్రపంచకప్‌కు ఎంపిక చేయకుండా దినేశ్ మోంగియా అనే స్థాయి లేని ఆటగాడికి అవకాశం కల్పించి అన్యాయం చేశారు సెలక్టర్లు. గత ఏడాది …

Read More »

అమరావతిపై జగన్‌కు పవన్ సూటి ప్రశ్న

అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కొనసాగించాలన్నది తమ పార్టీ వైఖరి అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముందు నుంచి చెబుతూ వస్తున్నారు. ఈ విషయంలో అమరావతి రైతులకు అండగా ఉంటామని, పోరాడతామని పవన్ గతంలోనే ప్రకటించారు. అమరావతికి వెళ్లి ఆందోళనలు చేస్తున్న రైతులకు సంఘీభావం కూడా ప్రకటించారు. కానీ ఈ మధ్య ఈ విషయంలో పవన్ వైఖరి మారిందనే ప్రచారం జరుగుతోంది. అమరావతి రైతులను ఆయన పట్టించుకోవడం లేదని, మూడు …

Read More »

అమరావతిపై పవన్ లో ఇంత గందరగోళమా ?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ లో సేమ్ కన్ఫ్యూజన్ కంటిన్యు అవుతోంది. ఏ విషయంలో అయినా స్ధిరమైన అభిప్రాయాలు లేకపోవటమే మొదటినుండి పవన్ లో ఉన్న అతిపెద్ద లోపం. తాజాగా ’మూడు రాజధానులు నమ్మకద్రోహమే’ అనే హెడ్డింగ్ తో ప్రముఖ దినపత్రిక ఈనాడు పవన్ తో ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో తన అభిప్రాయాలు చెప్పిన పవన్ తనలోని అయోమయాన్ని మరోసారి బయటపెట్టారు. నిజానికి పవన్ ఇంటర్వ్యూని బ్యానర్ హెడ్డింగ్ …

Read More »

వైసిపి ఓటింగ్ 16 శాతం పడిపోయిందా ?

పార్టీ నేతలతో జరిగిన జూమ్ కాన్ఫరెన్సులో ప్రభుత్వానికి సంబంధించి చంద్రబాబునాయుడు ఓ ఆసక్తికరమైన విషయం బయటపెట్టారు. అదేమిటంటే అధికార వైసిపికి 16 శాతం మంది జనాలు దూరమైనట్లు చెప్పారు. ప్రజల మద్దతును ప్రభుత్వంలో ఉన్న వైసిపి 16 శాతం కోల్పోయినట్లు చంద్రబాబు చెప్పగానే నేతలంతా ఆశ్చర్యపోయారు. సర్కారుపై విశ్వాసం కోల్పోయిన వారిలో అధికులు ఎస్సీ, ఎస్టీ, బిసిలే అని చెప్పారు. జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోతోందని చెప్పటమే చంద్రబాబు …

Read More »

త‌మిళ ఎంపీల‌తో మ‌నోళ్ల‌కు క్లాసిప్పించాల్సిందే!!

మ‌న‌లో మ‌నం ఎన్ని అనుకున్నా.. పొరుగువారి ముందు మాత్రం మ‌న ఐక్య‌త చాటాల‌నే సూత్రం ఇటీవ‌ల కాలంలో రాజ‌కీయాల్లో క‌నుమ‌రుగ‌వుతోంది. ఎక్క‌డ వేదిక దొరికినా.. అది ఏపీనా.. ఢిల్లీనా.. అనే తేడా లేకుండా వైసీపీ-టీడీపీ నేత‌లు జుట్టూ జుట్టూ ప‌ట్టుకుంటున్నారు. వ్య‌క్తిగ‌త దూష‌ణ‌ల‌కు దిగుతున్నారు. ఒక‌రిపై ఒక‌రు పైచేయిసాధించుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఫ‌లితంగా రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌కు తీవ్ర విఘాతం ఏర్ప‌డుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. సాధార‌ణంగా .. రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం.. అధికార ప‌క్షం …

Read More »

నాన్చుడు ధోర‌ణి.. టీడీపీని ముంచేస్తోందా?

ఆలోచ‌న మంచిదే. ఒక‌టికి రెండు సార్లు ఆలోచించుకున్నాకే ఏదైనా నిర్ణ‌యం తీసుకోవాల‌నే ధోర‌ణి కూడా మంచిదే. అయితే, ఈ ఆలోచ‌న‌ల‌కు ఎంత స‌మ‌యం కావాలి? ఎన్నాళ్లు ప‌ట్టాలి? అనేదే కీల‌కం. ఇంకా ఆలోచిస్తూనే ఉన్నాను.. అనే ధోర‌ణిని నేటి రాజ‌కీయ నేత‌లు జీర్ణించుకోలేరు. ఫ‌టా ఫ‌ట్‌-ధ‌నా ధ‌న్ అనుకున్న‌ది అయిపోవాలి. మంచో చెడో నిర్ణ‌యం తీసేసుకోవాలి. ఇదే ప్ర‌స్తుత నేత‌లు ఆశిస్తోంది. అయితే, టీడీపీ అధినేత చంద్ర‌బాబు మాత్రం ఈ …

Read More »