Political News

జేసీ కుటుంబం దూకుడు: ప‌గ్గాలు వేయ‌లేక బాబు తంటాలు

అనంత‌పురం జిల్లాలో కీల‌క రాజ‌కీయ కుటుంబంగా ఉన్న జేసీ దివాక‌ర్‌, ప్ర‌భాక‌ర్‌రెడ్డి రాజ‌కీయాల‌కు చంద్ర‌బాబు ప‌గ్గాలు వేయ‌లేక పోతున్నారా? చంద్ర‌బాబు వారికి అప్ప‌గించిన బాధ్య‌త‌ల‌ను ప‌క్క‌న పెట్టి.. త‌మ‌కు సంబంధం లేని నియోజ‌క‌వ‌ర్గంలోనూ వారు చ‌క్రం తిప్పుతుండడంతో పార్టీకి త‌ల‌నొప్పిగా మారింద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. విష‌యంలోకి వెళ్తే.. సుదీర్ఘ రాజ‌కీయ ప్ర‌స్థానం ఉన్న జేసీ కుటుంబం నుంచి గ‌త ఏడాది ఇద్ద‌రు వార‌సులు రంగంలోకి వ‌చ్చారు. జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి త‌న‌యుడు …

Read More »

మోడితో జగన్ భేటి ఫిక్సయ్యిందా ?

ఢిల్లీలో ఏదో జరుగుతోంది. అదేమిటో స్పష్టంగా తెలియకపోయినా ఏదో జరుగుతోందనే అనుమానం మాత్రం అందరిలో పెరిగిపోతోంది. ఎందుకంటే వచ్చే వారంలో జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి నరేంద్రమోడితో భేటి అవబోతున్నారంటూ పార్టిలో ప్రచారం మొదలైంది. వారం రోజుల క్రితమే కేంద్రం హోంశాఖ మంత్రి అమిత్ షాతో జగన్ రెండు సార్లు సమావేశమైన విషయం అందరికీ తెలిసిందే. ఒకసారి అమిత్ షా భేటి అవ్వటమే చాలా ఎక్కువ. అలాంటిది వరుసగా …

Read More »

జ‌లీల్‌ఖాన్ ఎంత పని చేసావయ్యా..

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో చెప్ప‌డం క‌ష్టం. ఏదో ఉద్ధ‌రించేస్తారు. అని భావించిన నాయ‌కులు కూడా త‌ర్వాత కాలంలో చ‌తికిల‌ప‌డిన ప‌రిస్థితి స్ప‌ష్టంగా క‌నిపిస్తూనే ఉంటుంది. ఇలాంటి ప‌రిస్థితే.. విజ‌య‌వాడలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం ప‌శ్చిమ‌లో టీడీపీ ఎదుర్కొంటోంది. విజ‌య‌వాడ‌లో మూడు నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. పశ్చిమ‌, తూర్పు, సెంట్ర‌ల్‌. అయితే, ఒక్క ప‌శ్చిమ‌లో త‌ప్ప‌.. మిగిలిన రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ టీడీపీకి ప‌ట్టుంది. ఇక్క‌డ‌చిత్రం ఏంటంటే.. రాష్ట్రంలో టీడీపీ పుట్టిన …

Read More »

బాబాయ్ పై అమ్మాయి ఫుల్ ఫైర్

బాబాయ్ అశోక్ గజపతిరాజుపై ట్విట్టర్ వేదికగా సంచైతా గజపతిరాజు ఫుల్లుగా ఫైర్ అయ్యారు. మాన్సాస్ ట్రస్టు ఆధ్వర్యంలోని ఎంఆర్ కాలేజి వివాదంలోకి ట్రస్టును అనవసరంగా లాగుతున్నారంటూ ట్రస్టు ఛైర్ పర్సన్ మండిపోయారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే ట్రస్టు ఆధ్వర్యంలో ఎయిడెడ్ హోదాలో ఎంఆర్ కాలేజి నడుస్తోంది. ఈ కాలేజికి సుమారు 150 సంవత్సరాల చరిత్రుంది. విద్యార్ధుల అడ్మిషన్లు, రిజల్ట్స్ విషయంలో కూడా మంచి ట్రాక్ రికార్డు కూడా ఉందని …

Read More »

రోజాకు పోటిగా మరో పవర్ సెంటర్ ?

ఫైర్ బ్రాండు నగిరి ఎంఎల్ఏకు పోటిగా నియోజకవర్గంలో మరో పవర్ సెంటర్ మొదలవుతోందా ? క్షేత్రస్ధయిలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే పార్టీలో ఇదే అనుమానాలు పెరుగుతున్నాయి. నగిరి మున్సిపల్ మాజీ ఛైర్ పర్సన్ గా పనిచేసిన కేజే శాంతికి తొందరలో కీలక పదవి దక్కనున్నట్లు సమాచారం. శాంతి భర్త కేజే కుమార్ కూడా మున్సిపల్ ఛైర్మన్ గా పనిచేసిన నేతే. వీళ్ళకు నియోజకవర్గంలో మంచి పట్టుంది. ఒకపుడు ఎంఎల్ఏ రోజాతో …

Read More »

రాహూల్ ను లోకేష్ ఆదర్శంగా తీసుకుంటాడా ?

ఉత్తరప్రదేశ్ లో గురువారం జరిగిన ఓ సంఘటనతో దేశం మొత్తం కాంగ్రెస్ నేత రాహూల్ గాంధి గురించే మాట్లాడుకుంటోంది. ఉత్తరప్రదేశ్ లోని హథ్రస్ లో ఓ అమ్మాయిపై హత్యాచారం జరిగిందనే ఆరోపణలతో రాష్ట్రం అట్టుడుకిపోతోంది. ఈ ఘటన నేపధ్యంలోనే రాహూల్ గాంధీ, ప్రియాంక గాంధీలు హథ్రస్ లో పర్యటించారు. వీళ్ళని నిలుపుదల చేసే ఉద్దేశ్యంతో పోలీసులు అక్కా, తమ్ముళ్ళ విషయంలో ఓవర్ యాక్షన్ చేశారు. హథ్రస్ లో ఘటన జరిగిన …

Read More »

జగన్ రూపంలో గాంధీ మళ్లీ పుట్టాడా?

మహాత్మా గాంధీజీతో ఆయన కాలంలోని మహా నాయకుల్ని పోల్చినా కూడా అభిమానులకు రుచించదు. అంత గొప్ప నాయకుడాయన. ఇక రాజకీయాలు పూర్తిగా భ్రష్టుపట్టిపోయిన తర్వాతి కాలంలో గాంధీతో ఎవరినైనా పోల్చడం అంటే సాహసమే. ముందు తరంలో అయినా వాజ్‌పేయి లాంటి గొప్ప నేతలున్నారు కానీ.. ఇప్పటి నేతల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ప్రస్తుత నాయకుల్లో ఒక మంచి లక్షణాన్ని అభిమానులు చూపిస్తే.. పది ప్రతికూల లక్షణాలను …

Read More »

ఆ 12వేల కోట్ల కోసమే సింఘాల్ బదిలీ?

తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆకస్మిక బదిలీపై ఇరు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. రాత్రికి రాత్రే అనిల్ సింఘాల్ ను ఆరోగ్య శాఖ కార్యదర్శిగా బదిలీ చేయడం….వెంటనే సింఘాల్ స్థానంలోకి ఆరోగ్యశాఖ కార్యదర్శి జవహర్ రెడ్డిని నియమించడం…ఇవన్నీ చకచకా జరిగిపోవడంపై చర్చ నడుస్తోంది. ఓ పక్క తిరుమల డిక్లరేషన్ వ్యవహారంపై చెలరేగిన వివాదంపై జాతీయ స్థాయిలో చర్చ నడుస్తోంది…మరోవైపు బ్రహ్మాత్సవాలలో పాల్గొన్న మంత్రుల …

Read More »

కొత్త ట్రెండ్ .. కొడుక్కి జండా… తండ్రికి ఎంట్రీ

వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త ట్రెండ్ అమల్లోకి తీసుకొచ్చింది. చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్నంత కాలం జరిగిన పార్టీ ఫిరాయింపులు అందరికీ తెలిసిందే. అప్పట్లో వైసిపి తరపున గెలిచిన 23 మంది ఎంఎల్ఏలు, ముగ్గురు ఎంపిలను నేరుగా తెలుగుదేశంపార్టీలోకి లాగేసుకున్నారు. ఈ విషయంలో అప్పట్లో వైసిపి ఎంత గగ్గోలు పెట్టిందో అందరు చూసిందే. కాలం ఐదేళ్ళు గడిచేసరికి సీన్ రివర్సయిపోయింది. జగన్మోహన్ రెడ్డి కూడా అదే పని చేస్తున్నారు. అయితే, …

Read More »

ఏపీ సర్కారుకు హైకోర్టు సివియర్ వార్నింగ్

రాష్ట్రంలో రోజురోజుకు ప్రభుత్వానికి, న్యాయవ్యవస్ధకు మధ్య అగాధం పెరిగిపోతున్నట్లే ఉంది. జడ్జీలు, న్యాయమూర్తుల పనితీరుపై అధికార పార్టీలోని కొందరు మంత్రులు, నేతలు చాలా ఘాటుగా కామెంట్లు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల్లో హైకోర్టు జోక్యం చేసుకోవటం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా కేసులు వేస్తే వెంటనే అడ్మిట్ చేసుకుంటోంది హైకోర్టు. పరిపాలనా సంబంధిత విషయాల్లోనే కాకుండా వివిధ అవినీతి ఆరోపణలపై విచారణలు ముందుకు సాగకుండా హైకోర్టు కొన్ని …

Read More »

ఏకమైన పాత మిత్రులు..నాయకత్వం చొరవే కారణమా ?

విజయనగరం జిల్లా అధికారపార్టీలో ఇపుడిదే అంశంపై జోరుగా చర్చలు జరుగుతోంది. జిల్లాలో మంత్రి బొత్స సత్యనారాయణ, ఎంఎల్ఏ కోలగట్ల వీరభద్రస్వామి మధ్య సంబంధాలు ఉప్పు-నిప్పుగా ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. చాలా కాలంగా వీళ్ళద్దరి మధ్య మాటలు కూడా పెద్దగా ఉండటం లేదు. అలాంటి ఈ ఇద్దరు కొద్ది రోజులుగా జిల్లాలో చట్టాపట్టాలేసుకుని తిరిగేస్తుండటమే అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నిజానికి వీళ్ళద్దరు ఒకపుడు ఆప్తమిత్రులే. కానీ మద్యలో ఏమైందో ఏమో …

Read More »

రైతులకు వంశీ ఓ ఉచిత సలహా.. ఓ బంపర్ ఆఫర్

రాజధాని అమరావతి కోసం దాదాపు 270 రోజులుగా పోరాటాలు చేస్తున్న రైతులకు గన్నవరం ఎంఎల్ఏ వల్లభనేని వంశీ ఉచిత సలహా ఇచ్చారు. రాజధాని విషయంలో రైతులు కోర్టులకు వెళ్ళేబదులు ప్రభుత్వంతో చర్చలు జరిపితే ఉపయోగం ఉంటుందని ఓ సలహా ఇచ్చారు. రాజధాని నిర్మాణం అన్నది అమరావతిలో జరిగే పనికాదని కూడా ఎంఎల్ఏ తేల్చేశారు. లక్ష కోట్లతో రాజధాని నిర్మించటానికి ప్రభుత్వం దగ్గర నిధులు లేవు కాబట్టి రైతులు ఇక ఆ …

Read More »