తెలంగాణలో టీడీపీకి కొత్త బాస్ ని ఎంపిక చేశారు. ఎన్నో సంవత్సరాలుగా టీడీపీకి నమ్మకంగా పనిచేస్తున్న బక్కని నర్సింహులును టీటీడీపీ అధ్యక్షుడిగా ఎంపిక చేశారు. టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న ఎల్. రమణ టీడీపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరటంతో ఆ అవకాశం బక్కని నరసింహులుకు దక్కింది.
మాదిగ సామాజికవర్గానికి చెందిన బక్కనికి 1994-99లో షాద్నగర్ ఎమ్మెల్యేగా పనిచేశారు. మొదట్లో రావుల చంద్రశేఖర్ రెడ్డి, అరవింద్ గౌడ్ పేర్లు తెరపైకి వచ్చినా చివరకు నర్సింహులు వైపే చంద్రబాబు మొగ్గుచూపారు. తెలంగాణలో బడుగు బలహీన వర్గాల కోసం టీడీపీ ప్రజల్లోకి వెళ్లాలని చంద్రబాబు సూచించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates