Political News

పొలిటికల్ మైలేజ్ కోసమేనా ?

జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేత పట్టాభి చేసిన అనుచిత వ్యాఖ్యలు కేవలం రాజకీయంగా మైలేజీ కోసమే అని పోలీసులు తేల్చేశారు. పట్టాభి అరెస్టు సందర్భంగా పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో ఈ విషయాన్ని స్పష్టంగా వివరించారు. సీఎంను టార్గెట్ చేసుకునే ఉద్దేశ్యపూరితంగా, సమాజంలో అశాంతిని రేకెత్తించే ఉద్దేశ్యంతోనే పట్టాభి అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు రిమాండ్ రిపోర్టు ద్వారా కోర్టుకు తెలిపారు. పట్టాభి వ్యాఖ్యల వల్ల ప్రజల్లో ఎలాంటి అంశాంతి …

Read More »

ఎంపీని నిలదీసిన కోర్టు

ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను కోర్టుల్లో సవాలు చేయడం, న్యాయస్థానాల ద్వారా అడ్డుకోవటమే ఏకైక లక్ష్యంగా కొందరు వ్యక్తులు ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి వ్యక్తులు, పార్టీల సంగతి ఎలాగున్నా అధికార వైసీపీలో తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణంరాజు కూడా ప్రభుత్వాన్ని అడ్డుకోవటమే పనిగా పెట్టుకున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఆయన వేసిన ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో కోర్టు దుమ్ముదులిపేసింది. కేసు విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి సంధించిన ప్రశ్నలకు …

Read More »

తమ్ముళ్ళకే శీల పరీక్ష పెట్టారా ?

చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీలో నేతలకే శీలపరీక్ష పెట్టినట్లు పార్టీలో చెప్పుకుంటున్నారు. చాలా కాలంగా పార్టీలోని చాలామంది సీనియర్ నేతలు పెద్దగా క్రియాశీలకంగా లేరు. సీనియర్లంటే మాజీ మంత్రులు, మాజీ ప్రజాప్రతినిధులు ఇలా చాలామంది ఉన్నారు. టీడీపీ అధికారంలో ఉండగా బాగా పెత్తనం చేసిన వారిలో చాలామంది ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత పెద్దగా కనబడటం లేదన్నది వాస్తవం. ఎంతసేపు చంద్రబాబు లేకపోతే లోకేష్ కాకపోతే అచ్చెన్న, బుచ్చయ్య చింతకాయల లాంటి …

Read More »

పట్టాభిరామ్ నేపథ్యం తెలుసా?

పట్టాభిరామ్.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన పేరు. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధుల్లో ఒకరిగా కొన్నేళ్లుగా చాలా బలంగా వాయిస్ వినిపిస్తున్న వ్యక్తి ఇతను. వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చాక టీడీపీ నుంచి పట్టాభిరామ్ స్థాయిలో ఇంత బలంగా పార్టీ గళాన్ని వినిపించిన నాయకుడు మరొకరు లేరు అంటే అతిశయోక్తి కాదు. ఏ అంశం మీద అయినా.. బాగా స్టడీ చేసి, ఆధారాలు పక్కన పెట్టుకుని మాట్లాడాడని, ఆరోపణలు …

Read More »

బాబు అంచ‌నాల‌ను మించిపోయిందిగా!

ఎటు చూసినా.. ప‌చ్చ‌జెండాలు. కాలు క‌దిపేందుకు వీలు లేనంత‌గా త‌మ్ముళ్లు.. పార్టీ అభిమానులు.. మ‌హి ళా నాయ‌కులు.. ఎటు చూసినా.. బారులు తీరిన జ‌నం.. ఇదీ.. మంగ‌ళగిరిలోని టీడీపీ కార్యాల‌యం వ‌ద్ద .. తాజా ప‌రిస్థితి. చంద్ర‌బాబు చేప‌ట్టిన 36 గంట‌ల దీక్ష‌కు క‌నీ వినీ ఎరుగ‌ని స్పంద‌న ల‌భించింది. నిజానికి చంద్ర‌బాబు కూడా ఇంత రేంజ్‌లో స్పంద‌న వ‌స్తుంద‌ని ఊహించి ఉండ‌ర‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. టీడీపీ కార్యాల‌యంపై జ‌రిగిన …

Read More »

ముంద‌స్తు లేన‌ట్టే.. వైసీపీలో ఎందుకీ మార్పు..!

ఏపీలో ముంద‌స్తు ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌ని.. దీనికి సంబంధించి ముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత జ‌గ‌న్ ప్లాన్ చేసుకుంటున్నార‌ని.. ఈ క్ర‌మంలో రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌.. ప్ర‌శాంత్ కిషోర్‌ను రంగంలోకి దింపార‌నే ఇటీవ‌ల కాలంలో వార్త‌లు హ‌ల్చ‌ల్ చేశాయి. దీంతో వైసీపీ వ్యూహాత్మ‌కంగా ముంద‌స్తుకు ప్లాన్ చేసుకుంద‌ని చ‌ర్చ‌కూడా న‌డిచింది. అయితే దీనిలో పీకే టీం.. స‌ర్వే చేస్తున్న మాట వాస్త‌వ‌మే. అదే స‌మ‌యంలో ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని జగ‌న్ కూడా భావించిన మాటా …

Read More »

స‌జ్జ‌ల‌ను సైలెంట్ చేస్తారా?

స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి.. పేరుకే అధికార వైసీపీ ప్ర‌భుత్వ స‌ల‌హాదారు కానీ సీఎం జ‌గ‌న్ త‌ర్వాత అటు ప్ర‌భుత్వంలో.. ఇటు పార్టీలో తానే నంబ‌ర్ టూ అనేలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే అభిప్రాయాలున్నాయి. ఎందుకంటే ప్ర‌తిప‌క్షాల కౌంట‌ర్‌కు ఆయ‌నే స‌మాధానం ఇస్తారు. ప్ర‌భుత్వంలో ఏ శాఖ గురించి అయినా ఆయ‌నే మాట్లాడ‌తారు. ఆరోగ్యశాఖ విద్యాశాఖ‌.. ఇలా ఆ శాఖ ఈ శాఖ అని కాకుండా అన్ని శాఖ‌ల గురించి ఆయ‌నే మాట్లాడ‌తార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. …

Read More »

బద్వేలు : కాంగ్రెస్ మైండ్ గేమ్ ఇదేనా

ట్విస్టుల‌తో సాగుతూ మ‌లుపులు తిరుగుతున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ క‌డ‌ప జిల్లాలోని బ‌ద్వేలు ఉప ఎన్నిక ఆస‌క్తిక‌రంగా మారింది. ఏక‌గ్రీవం అవుతుంద‌నుకున్న ఈ ఎన్నిక‌లో ఇప్పుడు ప్ర‌ధానంగా అధికార వైసీపీతో పాటు బీజేపీ, కాంగ్రెస్ పోటీలో నిలిచాయి. వైసీపీ నుంచి దివంగ‌త ఎమ్మెల్యే వెంక‌ట‌సుబ్బ‌య్య భార్య సుధ బీజేపీ నుంచి విద్యార్థి నాయ‌కుడు సురేశ్ కాంగ్రెస్ నుంచి పీఎం క‌మ‌ల‌మ్మ బ‌రిలో దిగారు. అక్టోబ‌ర్ 30నే పోలింగ్ ఉండ‌డంతో ఇప్ప‌టికే ప్ర‌చారాన్ని అన్ని …

Read More »

తండ్రితో త‌న‌యుడికి చెక్ పెట్టేలా రేవంత్ వ్యూహం!

సీనియ‌ర్ల మ‌ధ్య విభేధాలు.. ప‌ద‌వుల కోస‌మే కానీ పార్టీ కోసం ప‌ని చేయ‌ని నాయ‌కులు.. అధికార పార్టీకి స‌వాలు విసిరే ధైర్యం లేక‌పోవ‌డం.. ఇలాంటి కార‌ణాల వ‌ల్ల గ‌త కొన్నేళ్లుగా తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ ఢీలా ప‌డింది. కానీ తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడిగా రేవంత్ రెడ్డి ఎంపికైన‌ప్ప‌టి నుంచి రాష్ట్రంలో పార్టీ జెట్ స్పీడుతో దూసుకెళ్తోంది. అధికార పార్టీపై విరుచుకుపడుతున్న రేవంత్‌.. స‌భ‌లు ర్యాలీలు స‌మావేశాలంటూ కాంగ్రెస్ …

Read More »

అద్వానీకి బీజేపీ అంద‌లం.. రీజ‌నేంటంటే!

లాల్ కృష్ణ అద్వానీ.. దాదాపు అంద‌రూ మ‌రిచిపోయిన పేరు. కాదుకాదు.. బీజేపీ నాయ‌కులే అలా మ‌రిచి పోయేలా చేసిన పేరు.. ఇప్పుడు మ‌ళ్లీ తెర‌మీదికి వ‌చ్చింది. వాస్త‌వానికి ఇప్పుడు ఏ రామ‌జ‌న్మ భూమి.. రామ‌మందిరం.. అని బీజేపీ అడుగులు వేస్తోందో.. దానికి పునాదులు వేసింది.. అద్వానీనే! కానీ.. మోడీ హ‌యాంలో 2014 నుంచి నానాటికీ తీసిక‌ట్టుగా మారిన అద్వానీ ప‌రిస్థితి.. ఇప్పుడు క‌నుచూపు మేర‌లో కూడా క‌నిపించ డం లేదు. …

Read More »

ఏపీలో రాష్ట్ర‌ప‌తి పాల‌న‌.. సాధ్య‌మేనా?

టీడీపీ అధినేత చంద్ర‌బాబు కోరిక నెర‌వేరుతుందా? ఏపీలో రాష్ట్ర‌ప‌తి పాల‌న పెడ‌తారా? కేంద్రం దీనికి స‌మ్మ‌తిస్తుందా? ఇదీ.. ఇప్పుడు ఆస‌క్తిగా మారిన చ‌ర్చ‌. రాష్ట్రంలో ఏ ఇద్ద‌రు క‌లిసినా.. దీనిపైనే చ‌ర్చ చేసు కుంటున్నారు. టీడీపీ ఆఫీస్‌పై జ‌రిగిన దాడి నేప‌థ్యంలో రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లు అదుపు త‌ప్పాయ‌ని.. గంజాయి కేంద్రంగా ఏపీ మారిపోయింద‌ని.. మాద‌క ద‌వ్యాల ర‌వాణాకు అడ్డాగా మారింద‌ని.. ఇది రాష్ట్రాన్ని, దేశాన్ని కూడా నాశ‌నం చేస్తోంద‌ని.. …

Read More »

ఇంతకీ షర్మిల ప్రత్యర్ధి ఎవరు ?

చేవెళ్ల నుంచి పాదయాత్ర ప్రారంభించిన వైఎస్ షర్మిల కేసీఆర్ తో పాటు కాంగ్రెస్, బీజేపీలను కూడా టార్గెట్ చేయటమే విచిత్రంగా ఉంది. మామూలుగా అయితే ఏ ప్రతిపక్షమైనా అధికారంలో ఉన్న పార్టీనే టార్గెట్ చేస్తుంది. ఎందుకంటే సహచర ప్రతిపక్షాలను ఎంత టార్గెట్ చేసినా ఉపయోగం ఉండదు కాబట్టి. ఏవైనా ఆరోపణలు చేయాలన్నా, విమర్శలు చేయాలన్నా అధికార పార్టీ పైన చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అవినీతి అయినా, అధికార దుర్వినియోగ …

Read More »