ఏపీ సీఎం జగన్ కేబినెట్‌లో ఎవరు బెస్ట్ ? ఈ ప్రశ్నకు నీళ్లు నమలాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే.. ముఖ్యమంత్రి జగన్‌కి ధీటైన, తగిన మంత్రి ఎవరు అంటే మాత్రం తడుముకోకుండా సమాధానం లభిస్తోంది. ప్రతిపక్షాలు కానీ, ఇతర నేతలు కానీ.. ప్రత్యర్థులుకానీ.. ఎలాంటి విమర్శలు చేసినా.. కోర్టులు హెచ్చరికలు జారీ చేసినా.. ఎలాంటి బాధ, భయం లేకుండా ముందుకు సాగుతున్న మంత్రుల్లో ఒకే ఒక్కరు ఇటీవల కాలంలో కనిపిస్తున్నారని …
Read More »ఈటలకు అంత సీనుందా ?
‘తన బర్తరఫ్ తెలంగాణా రాష్ట్రానికి అరిష్టం’ ..ఇది తాజాగా బహిష్కృత మంత్రి, మాజీ ఎంఎల్ఏ ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు. కేసీయార్ ను ఉద్దేశించి ఈటల రాజేందర్ ఘాటు వ్యాఖ్యలు చాలానే చేశారు. మంత్రివర్గం నుండి అవమానకరంగా బయటకు గెంటేసింది నిజం. పార్టీలో నుండి బయటకు పొమ్మని పొగబెట్టిందీ నిజమే. కాబట్టి ఈటలకు సహజంగానే కేసీయార్ అంటే కసి పెరిగిపోతోంది. కేసీయార్ మీద ఎంత మంటున్నా ఈటెల తాజాగా చేసిన …
Read More »జాబు రెడ్డి.. డాబు మాటలు..: లోకేష్ సెటైర్లు
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి.. నారా లోకేష్.. ఏపీ సీఎం జగన్‌పై మళ్లీ నిప్పులు చెరిగారు. తనదైన సటైర్లతో ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మరీ ముఖ్యంగా సీఎం జగన్ టార్గెట్‌గా వ్యాఖ్యలు సంధించారు. యువతకు ఉద్యోగాలు కల్పించడంలో పూర్తిగా విఫలమైన సీఎం.. డాబు మాటలు చెబుతున్నారంటూ.. నిప్పులు చెరిగారు. “జాబు రెడ్డి.. డాబు మాటలు చెబుతున్నాడు” అంటూ.. ముఖ్యమంత్రిపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ఏపీపీఎస్సీ గ్రూప్ -1 అభ్యర్థులు సీఎం జగన్ వైఖరిపై …
Read More »బీజేపీతో బంధానికి బీటలు పడుతున్నాయా..?
ఏపీలో గత 2019 ఎన్నికల్లో ఒంటరి గా పోటీ చేసిన(అంటే.. బీఎస్పీ.. కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్నప్పటికీ) జనసేన పార్టీ.. అనూహ్యంగా ఆరు మాసాలు తిరగకముందే.. కేంద్రంలోని బీజేపీ పెద్దలను కలిసి.. ఆపార్టీతో పొత్తు పెట్టుకుంది. కలిసి పనిచేస్తామని.. వచ్చే ఎన్నికల్లో జగన్‌ను మట్టికరిపించడమే ధ్యేయంగా పనిచేస్తామని.. ప్రతిజ్ఞలు కూడా చేసింది. ఈ క్రమంలోనే రాజధాని ఉద్యమం సమయంలో అప్పటి బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణతో కలిసి జనసేనాని పవన్ కూడా …
Read More »సీఎం జగన్‌కు ఊహించని ట్విస్టిచ్చిన నిరుద్యోగి..
ఏపీ సీఎం జగన్‌కు ఊహించని షాక్ తగిలింది. ఓ నిరుద్యోగి ఏపీ సీఎంకు పెద్ద ట్విస్టే ఇచ్చాడు. దీంతో ఇప్పుడు సీఎం జగన్ ఏం చేస్తారు? ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? అనే చర్చ సాగుతోంది. ఒకవేళ ఈ విషయంలో సీఎం జగన్ మౌనంగా ఉంటే.. అది తన మెడకే చుట్టుకుని..తన విశ్వసనీయతకే పెద్ద గొడ్డలిపెట్టుగా మారుతుందని అంటున్నారు పరిశీలకులు. మరి ఇంతకీ ఆ నిరుద్యోగి ఇచ్చిన ట్విస్ట్ ఏంటో చూద్దామా..? …
Read More »కేసీఆర్ కాళ్లు మొక్కిన కలెక్టర్లు.. రీజనేంటి?
పెద్దల పాదాలకు నమస్కారం చేయడం అనేది మన సంస్కృతి. ఇక ఇది రాజకీయాలు, సినీ రంగం.. వంటి పలు రంగాలకు ఎగబాకింది. కానీ, జిల్లాలకు అధికారులు అయిన కలెక్టర్లు సీఎంల కాళ్లకు నమస్కారం చేయడం అనేది ఉండదు. కానీ, తెలంగాణలో మాత్రం తాజాగా ఈ ఘటన చోటుచేసుకుంది. సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల కలెక్టరేట్ భవనాల ప్రారంభం సందర్భంగా ఆ జిల్లాల కలెక్టర్లు వెంకట్రామారెడ్డి, శరత్.. సీఎం కేసీఆర్‌కు పాదాభివందనం చేశారు. …
Read More »సౌత్ రూట్లో చిరాగ్ – సంచలన నిర్ణయం
బీహార్ ప్రజల మద్దతు కోరుతూ ఎల్జేపీ కీలక నేత చిరాగా పాశ్వాన్ ‘ఆశీర్వాద్ యాత్ర’ పేరుతో పాదయాత్ర చేయాలని డిసైడ్ అయ్యారు. కేంద్ర మాజీమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ చనిపోయిన తర్వాత పార్టీ నిలువుగా చీలిపోయిన విషయం తెలిసిందే. జాతీయ అధ్యక్షడు, ఎంపి అయిన చిరాగ్ ను స్వయంగా బాబాయ్ పశుపతి కుమార్ పారస్ పదవిలో నుండి దింపేసిన విషయం తెలిసిందే. పదవిలో నుండి దింపటంతో సరిపెట్టుకోకుండా ఏకంగా పార్టీని …
Read More »టంగ్ స్లిప్.. ‘యాంకర్’పై అమరావతి జేఏసీ ఫైర్
టీవీ షోల్లో యాంకర్‌గా వ్యవహరిస్తున్న ప్రదీప్.. మరోసారి అడ్డంగా బుక్కయ్యాడు. గతంలోనూ పలుమార్లు.. ఆయన నోరు జారడంతో పాటు మద్యం తాగి కారు నడిపిన ఘటనలో ఏడాది పాటు లైసెన్స్ సస్పెండ్ అయిన విషయాలు తెలిసిందే. మరి రేటింగ్ కోసం నోరు జారాడో.. లేక ఏపీ ముఖ్యమంత్రి జగన్‌పై తనకు ఉన్న అభిమానం కొద్దీ అలా అన్నాడో.. ఇవన్నీ కాకుండా.. తన మనసులో ఉన్న కోరికను బయటకు పెట్టాడో తెలియదు …
Read More »టీడీపీలో ఆయన ఉన్నట్టా… లేనట్టా!
ఏపీలో అధికారం కోల్పోయాక విలవిల్లాడుతోన్న తెలుగుదేశం పార్టీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఈ క్రమంలోనే ఆ పార్టీలో మైనార్టీ నేతలు ఎవ్వరూ ఉండడం లేదు. విచిత్రం ఏంటంటే అసలు మైనార్టీలు ఎవ్వరూ టీడీపీ వెనక ఉండడం లేదన్న చర్చలు కూడా వినిపిస్తున్నాయి. ఇక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏదో బలవంతంగా పార్టీలో కొనసాగిన కొందరు నేతలు ఇప్పుడు పార్టీ నుంచి ఎప్పుడు బయటకు వద్దామా ? అన్న ఆలోచనలో …
Read More »ఏపీ వ్యాక్సినేషన్ రికార్డు… అసలు కథ ఇదా?
ఆంధ్రప్రదేశ్‌లో ఒకే రోజు పది లక్షలకు పైగా వ్యాక్సిన్లు.. ఆదివారం కొన్ని టీవీ ఛానెళ్లు, వెబ్ సైట్లు.. అలాగే సోషల్ మీడియాలో హోరెత్తిన వార్త ఇది. సరిగ్గా చెప్పాలంటే ఆదివారం ఏపీలో వేసిన వ్యాక్సిన్ల సంఖ్య 13,26,271. ఒక్క రోజులో ఒక రాష్ట్రం ఇన్ని వ్యాక్సిన్లు వేయడం రికార్డట. దీని గురించి జగన్ సర్కారు మద్దతుదారులు గొప్పగా చెప్పుకుంటున్నారు. సోషల్ మీడియాలో దీనిపై హోరెత్తించేస్తున్నారు. కానీ ఇలా రికార్డ్ నెలకొల్పడం …
Read More »మోడీని నిలదీస్తున్న ప్రపంచం.. సమాధానం చెప్పక తప్పలేదు..
దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రపంచ దేశాల ముందు చేతులు కట్టుకున్నారా? కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయంపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేశారా? ఈ క్రమంలోనే ఏకంగా ఐక్యరాజ్యసమితి సైతం మోడీ నిర్ణయాన్ని ప్రశ్నించిందా? దీంతో ఆయన సమాధానం చెప్పక తప్పలేదా? అంటే.. తాజాగా జరిగిన పరిణామాలు ఔననే సమాధానమే ఇస్తున్నాయి. విషయంలోకి వెళ్తే.. దేశంలో సోషల్ మీడియా వేదికలుగా ఉన్న ట్విట్టర్, ఫేస్ బుక్.. సహా …
Read More »జమ్మూ-కాశ్మీర్ తో ఆడుకుంటున్న కేంద్రం
దేశంలోనే అత్యంత సున్నితమైన ఓ భూభాగం జమ్మూ-కాశ్మీర్ విషయంలో నరేంద్రమోడి సర్కార్ ఆటలాడుకుంటున్నట్లుంది. తనిష్టప్రకారం ఒకసారి రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా విభజించటం లేదా రాష్ట్ర హోదా ఇవ్వటం చేస్తోంది. దశాబ్దాల ప్రకారం కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న జమ్మూకాశ్మీర్ కు యూపీఏ ప్రభుత్వం అప్పుడెప్పుడో సంపూర్ణ రాష్ట్రహోదా ఇచ్చింది. తర్వాత ఎన్డీయే అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేసిన విషయం తెలిసిందే. దేశానికి జమ్మూకాశ్మీర్ చాలా ముఖ్యమన్న విషయం అందరికీ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates