ఆయనకు రాజకీయంగా దూకుడు ఎక్కువ. సూపర్ సీనియర్‌గా గుర్తింపు పొందారు. నియోజకవర్గంలో అటు క్లాస్.. ఇటు మాస్‌లోనూ ఆయన ప్రత్యేకంగా నిలిచారు. మరీ ముఖ్యంగా టీడీపీలో మంచి గుర్తింపు సాధించారు. ఫైర్ బ్రాండ్ రాజకీయాలకు తనదైన ముద్ర వేసుకున్నారు. వరుస విజయాలతో తనకు తిరుగులేదనే పేరు తెచ్చుకున్నారు. పార్టీని ముందుండి నడిపించారు. ఆయన ఏమన్నా.. వార్తగా నిలిచిన స్థాయి నుంచి ఆయన ఏం చేసినా.. సంచలనంగా మారే పరిస్థితి వరకు …
Read More »జగన్ సర్కారుకు కేంద్రం వార్నింగ్!
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ తీరు మరోసారి జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అవుతోంది. జగన్ సర్కారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇటీవలే ‘జగనన్న తోడు’ పేరుతో ఓ పథకాన్ని ప్రవేశ పెట్టగా.. ఆ పథకం కింద ఏ ష్యూరిటీ లేకుండా లోన్లు ఇవ్వడానికి నిరాకరించాయన్న కారణంతో కృష్ణా జిల్లాలోని ఉయ్యూరులో యూనియన్ బ్యాంకు, ఎస్బీఐ శాఖల ఎదుట చెత్త తీసుకొచ్చి పోయడం సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ పని మున్సిపల్ …
Read More »అదే.. బాబుకు జగన్‌కు తేడా.. ఎంత సెంటిమెంటో!!
ఔను! తాజాగా వైసీపీ అధినేత, సీఎం జగన్ తన సొంత జిల్లా కడపలో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పాటు ఆయన ఇక్కడ పర్యటించనున్నారు. ఈ క్రమంలోనే తన నియోజకవర్గం పులివెందులలో భారీ ఎత్తున వేల కొద్దీ కోట్లతో చేయనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. సాధారణంగా ఏ ముఖ్య మంత్రికైనా.. తన సంత నియోజకవర్గంలో అభివృద్ధి అంటే.. ప్రాణం పెడతారు. తాను పుట్టి పెరిగిన.. రాజకీయంగా తనకు మంచి అవకాశం …
Read More »ఇళ్ళపట్టాల అవినీతిలో 40 మంది ఎంఎల్ఏలా ?
తెలుగుదేశంపార్టీ నేతల ఆరోపణల ప్రకారం ఇళ్ళపట్టాల పంపిణీ అవినీతిలో 40 మంది ఎంఎల్ఏలున్నారట. ఇళ్ళపట్టాల కోసం సేకరించిన భూమిలో రూ. 6500 కోట్ల అవినీతి జరిగిందని కూడా టీడీపీ ఆరోపిస్తోంది. డిసెంబర్ 25వ తేదీన ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 30 లక్షల ఇళ్ళపట్టాల పంపిణీ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. సరిగ్గా ఒక్కరోజు ముందు ఇదే విషయంపై టీడీపీ ఆరోపణలతో విరుచుకుపడింది. తాము అధికారంలోకి వస్తే ఆ మొత్తాన్ని 40 మంది ఎంఎల్ఏల …
Read More »జనసేనకు కమలం చెక్.. తిరుపతి ఉప ఎన్నికకు బీజేపీ సిద్ధం!!
తిరుపతి పార్లమెంటు స్థానానికి త్వరలో జరగనున్న ఉప ఎన్నికకు షెడ్యూల్ కానీ, ప్రకటన కానీ.. ఇంకా ప్రకటించకపోయినా.. బీజేపీ మాత్రం దూకుడుగా ముందుకు సాగుతోంది. వాస్తవానికి ఈ టికెట్‌ను బీజేపీ పొత్తు పార్టీ జనసేన భారీ ఎత్తున డిమాండ్ చేస్తోంది. తెలంగాణలోని గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తాము పోటీకి దూరంగా ఉండి.. బీజేపీకి సహకరించాం కనుక ఈ టికెట్‌ను తమకు ఇవ్వాలని జనసేన అధినేత పవన్ పట్టుబడుతున్నారు. దీనికి సంబంధించి …
Read More »అప్పుడు నారా దేవాన్ష్ కాలనీ.. ఇప్పుడు వైఎస్ జగన్మోహనపురం
ప్రజలు కట్టే పన్నులతో ప్రభుత్వాన్ని నడిపే నేతలు జేబుల్లోంచి డబ్బులు తీసి ఖర్చు పెడుతున్నట్లుగా ప్రతి పథకానికీ తమతో తమ కుటుంబీకులు, తమ పార్టీ నేతల పేర్లు పెట్టేయడం పట్ల ఎప్పట్నుంచో అభ్యంతరాలున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ ఒరవడికి ప్రధానంగా తెరతీసింది కాంగ్రెస్ పార్టీ. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉండగా పథకాలతో పాటు అన్నింటికీ రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీల పేర్లు పెట్టుకుంటూ వెళ్లిపోయారు. ఆ ఒరవడిని తర్వాత …
Read More »తాడిపత్రిలో నిప్పు రాజుకుందా ?
అనంతపురం జిల్లా తాడిపత్రిలో రెండుపార్టీల మధ్య నిప్పు రాజుకున్నట్లే ఉంది. ఇంతకాలం నివురుగప్పిన నిప్పులాగున్న వ్యవహారం ఒక్కసారిగా ఎంఎల్ఏ కేతిరెడ్డి పెద్దారెడ్డి చర్య వల్ల ఒక్కసారిగా ఓపెన్ అయిపోయింది. ఇంతకీ విషయం ఏమిటంటే మొన్నటి ఎన్నికల్లో తాడిపత్రిలో వైసీపీ తరపున పోటీ చేసిన కేతిరెడ్డి పెద్దారెడ్డి గెలిచారు. దాంతో జేసీ బ్రదర్స్ దశాబ్దాల ఆధిపత్యానికి ఒక్కసారిగా బ్రేకులు పడినట్లయ్యింది. దానికితోడు టీడీపీ కూడా ఘోరంగా ఓడిపోవటంతో బ్రదర్స్ కు ఇబ్బందులు …
Read More »క్షమాపణలు కోరిన జగన్
సొంతజిల్లా కడపలో మూడు రోజుల పర్యటనలో ఉన్న జగన్ ఓ విషయంలో ప్రజలను క్షమాపణలు కోరారు. గండికోట రిజర్వాయర్ విషయమై మాట్లాడుతూ ప్రజల త్యాగాల వల్లే గండికోట రిజర్వాయర్ నిర్మాణం పూర్తి చేసుకున్నట్లు చెప్పారు. ‘పునరావాసం విషయంలో ఎవరికైనా ఇబ్బందులు కలిగి ఉంటే మీ బిడ్డగా నన్ను క్షమించండి’ అని వేదిక మీదనుండి చేతులు జోడించి వేడుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో మొదలైన గండికోట రిజర్వాయర్ పనులు మొదలయ్యాయి. …
Read More »బీజేపీ వర్సెస్ జనసేన.. మనసులు కలవని మిత్రత్వం
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని అంటారు. ఇది ఎలా ఉన్నా.. రాను రాను.. రాజకీయాల్లో మిత్రుల మధ్య మరో కోణం కూడా కనిపిస్తోంది. కలిసే ఉన్నా.. ఎవరి ప్రయోజనం వారిది.. ఎవరి వ్యూహాలు వారివి.. ఎవరికి రేంజ్ పెరిగితే.. వారు సైడ్ అయిపోవడం.. అనేవి కామన్ అయిపోయాయి. ఇదే పరిస్థితి కాదుకానీ.. ఇలాంటి వాతావరణమే ఏపీ రాజకీయాల్లో కీలకంగా ఉన్న బీజేపీ-జనసేన కూటమిలోనూ కనిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలను …
Read More »విలేజి క్లినిక్కులపై జగన్ దృష్టి
రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో అందరికీ ఆరోగ్యం అందించేందుకు విలేజ్ క్లినిక్కుల ఏర్పాటు ఒక్కటే మార్గమని జగన్మోహన్ రెడ్డి భావించారు. ప్రతి మండలంలోను రెండు ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ) ఏర్పాటు చేయాలని జగన్ ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రతీ పీహెచ్సీలోను ఇద్దరు డాక్టర్లుండాలని వైద్య, ఆరోగ్య ముఖ్య కార్యదర్శి, కమీషనర్ కు స్పష్టంగా చెప్పారు. వంతుల వారీగా పీహెచ్‌సీలోని డాక్టర్లు రెగ్యులర్ గా గ్రామాలకు వెళ్ళి ప్రజారోగ్యంపై వాకాబు చేయాలన్నారు. అవసరమైన …
Read More »చిత్తూరు నేతలను మెప్పించలేక పోయిన.. చంద్రబాబు!
టీడీపీలో తిరుపతి ఎఫెక్ట్ బాగా కనిపిస్తోంది. త్వరలో తిరుపతి పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. దీనికి సంబంధిం చి అందరికన్నా ముందుగానే టీడీపీ అధినేత అభ్యర్థిని ప్రకటించేశారు. వాస్తవానికి ఇది పార్టీలో ఎవరూ ఊహించని విషయం. ఒక వేళ చంద్రబాబు ఏమైనా సొంతంగా నిర్ణయం తీసుకున్నారా? అంటే.. అలా జరిగే అవకాశం కూడా కనిపించడం లేదు. సీనియర్లను ఒకరో ఇద్దరినో సంప్రదించకుండా ఈ నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. …
Read More »ఇండియాలో కూడా స్ట్రెయిన్ కలకలం
బ్రిటన్ను కుదిపేస్తున్న స్ట్రెయిన్ కరోనా వైరస్ తాజాగా మనదేశంలో కూడా టెన్షన్ పెంచేస్తోంది. బ్రిటన్ నుండి ఇండియాకు వచ్చిన విమానంలో 25 మందికి కరోనా వైరస్ ఉండటమే ఇందుకు ప్రధానకారణం. కరోనా వైరస్సే రూపాంతరం చెంది స్ట్రెయిన్ కరోనాగా మారిందన్న విషయం అందరికీ తెలిసిందే. కొత్తగా రూపం మార్చుకున్న కరోనా వైరస్ దెబ్బకు బ్రిటన్ తల్లకిందులైపోతోంది. కరోనా వైరస్ కన్నా స్ట్రెయిన వైరస్ చాలా వేగంగా వ్యాపిస్తోంది బ్రిటన్‌లో. దాంతో …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates