ఔను! ఎంత బిజీగా ఉన్నా.. తనకు ఇబ్బందిలేదు.. అనుకున్నా.. తన సొంత జిల్లా చిత్తూరుపై టీడీపీ అధినే త చంద్రబాబు దృష్టి పెట్టాలని అంటున్నారు పరిశీలకులు. నానాటికీ తీసికట్టుగా మారుతున్న చిత్తూరు టీడీపీ వ్యవహారం.. తాజాగా గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మరింత పలచనైంది! టీడీపీ అధినేత గా కంటే.. తన సొంత జిల్లాలో పార్టీ పరిస్థితి ఇలా ఉందనేది బాబుకు మింగుడుపడని విషయమే!! ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల తొలి …
Read More »వైసీపీలో మొదలైన పంచాయితీలు
క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పంచాయితి ఎన్నికల మాటేమో కానీ అధికార వైసీపీలో కూడా పంచాయితీలు మొదలయ్యాయి. కొన్ని నియోజకవర్గాల్లో నేతల మధ్య ఆధిపత్య గొడవల కారణంగా కార్యకర్తలు వర్గాలుగా విడిపోయారు. దాంతో ఇపుడు పంచాయితి ఎన్నికలకు నామినేషన్లు వేసే విషయంలో పెద్ద నేతల మధ్య విభేదాలు మొదలవ్వటంతోనే కార్యకర్తల మధ్య కూడా గొడవలు జరుగుతున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే గన్నవరం, చీరాల, గుంటూరు వెస్ట్, రాజోలు, వైజాగ్ లాంటి నియోజకవర్గాల్లో టీడీపీ, …
Read More »అల్లర్ల తర్వాత వందమంది రైతుల అదృశ్యం ?
మొన్నటి 26వ తేదీన ఢిల్లీలో రైతుసంఘాల ర్యాలీ తర్వాత సుమారు 100 మంది రైతుల ఆచూకీ తెలీటం లేదా ? ఎంతవెతికినా వాళ్ళ జాడ కనబడలేదా ? అంటే అవుననే అంటున్నారు రైతులు, మానవహక్కుల సంఘాలు. ఢిల్లీలో ర్యాలీ సందర్భంగా వీధుల్లోను, ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో కొన్ని గంటల పాటు బీభత్సం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అల్లర్లకు కారకులంటూ పోలీసులు ఇఫ్పటికే కొన్ని వందల మందిపై రకరకాల కేసులు …
Read More »‘షర్మిలకు బహిరంగ క్షమాపణలు చెబుతా’.. ఎప్పుడో చెప్పిన ఆంధ్రజ్యోతి ఆర్కే
వారం క్రితం.. తన పత్రికలో తాను స్వయంగా రాసిన రాజకీయ వార్తతో సంచలనంగా మారారు ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరీమణి షర్మిల తెలంగాణలో వైఎస్ తెలంగాణ పార్టీ పెట్టబోతుందని.. కుమార్తెకు అండగా తల్లి విజయమ్మ నిలవనుందన్న రాజకీయ విశ్లేషణ హాట్ టాపిక్ గా మారింది. ప్రతి వీకెండ్ లో తాను రాసే వీకెండ్ కామెంట్ ను పత్రిక నాలుగో పేజీలో రాసుకుంటారు. ఏదైనా …
Read More »పవన్ కాపు భజన.. వెనుక ఏం జరిగిందంటే!
పవన్ నోట సరికొత్తగా కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యాఖ్యలు అనూహ్యంగా దొర్లాయి. కాపులకు అండగా ఉంటానని.. వారి సమస్యలను పరిష్కరించే బాధ్యతను తీసుకుంటానని పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. కాపుల విషయంలో కన్నీరు పెట్టుకున్నంత పనిచేశారు. వారు అనేక రంగాల్లో వెనుకబడి ఉన్నారని.. ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్ట అయినా.. కాపులను ఓటు బ్యాంకు కోణంలోనే చూసిందని.. వారికి అండగా నిలిచిన వారు ఏ ఒక్కరూ …
Read More »నా ఉన్నతికి వైఎస్సే కారణం.. నిమ్మగడ్డ సంచలన కామెంట్స్!!
ఇప్పటి వరకు జగన్ ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అంటున్న ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నోటి నుంచి అనూహ్యమైన కామెంట్లు వచ్చాయి. సీఎం జగన్ తండ్రి.. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డిని కొనియాడారు నిమ్మగడ్డ. వైఎస్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. నేనీ స్థితిలో ఉండేందుకు వైఎస్సే కారణం. ఆయన.. నిజాలను నిర్భయంగా చెప్పే స్వేచ్ఛ ఇచ్చారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి దగ్గర పనిచేయడం వల్లే నా జీవితంలో ఒక …
Read More »హద్దులు దాటేసిన సాయిరెడ్డి… నిమ్మగడ్డకు మెంటలా?
ప్రభుత్వానికి-రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉన్నా యి. సుప్రీం కోర్టు తీర్పు మేరకు ప్రభుత్వం సహకరిస్తున్నా.. నాయకుల దూకుడు మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికీ.. నిమ్మగడ్డపై కులం, వర్గం.. పేరిట.. తీవ్రస్థాయిలో వైసీపీ నాయకులు దూషణలకు దిగుతున్నారు. ఇప్పటికే ఇలాంటి వాటిపై తాను మరోసారి కోర్టు కు వెళ్తానని నిమ్మగడ్డ స్పష్టంచేసినప్పటికీ.. వైసీపీ నాయకులు మాత్రం ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. …
Read More »మదనపల్లె జంట హత్యల కేసులో ఒళ్లు గగుర్పొడిచే నిజాలు
చిత్తూరు జిల్లా మదనపల్లె జంట హత్యల కేసులో రోజుకో సంచలన విషయం.. ఒళ్లు గగుర్పొడిచే నిజాలు వెలుగు చూస్తున్నాయి. మూఢ భక్తి.. మితిమీరిన విశ్వాసంతో.. ట్రాన్స్‌లోకి వెళ్లిపోయిన ఓ ఉన్నత విద్యా కుటుంబం.. దారుణమైన పరిస్థితికి చేరుకుంది. పునర్జన్మ-భగవంతుడు బతికిస్తాడు.. అనే అంధ విశ్వాసం తో.. యుక్తవయసుకు వచ్చిన కన్న బిడ్డల ప్రాణాలను తీసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిం ది. పురుషోత్తమనాయుడు, పద్మజ దంపతులు.. తమ ఇద్దరు ఆడ …
Read More »శాసించేస్ధాయికి కాపులు ఎదగాలట
కాపులు యాచించే స్ధాయి నుండి శాసించే స్ధాయికి ఎదగాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపినిచ్చారు. కాపు సంక్షేమ సంఘం ప్రతినిధులతో జరిగిన సమావేశంలో పవన్ ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పారు. రాష్ట్ర జనాభాలో 27 శాతం కలిగుండి కూడా ఇంకా రాజకీయ నేతలను పదవుల కోసం బతిమలాడుకోవటం ఏమిటి నాన్ సెన్స్ అంటూ ఊగిపోయారు. పవన్ చెప్పింది ఒక విధంగా నిజమే అయితే ఈ పరిస్ధితి ఎందుకొచ్చింది ? …
Read More »స్పీకర్ కు పెటర్నిటీ లీవ్ పెట్టుకున్న టీడీపీ ఎంపీ ఎవరంటే?
రాజకీయాల్లో ఎప్పుడూ కనిపించని సీన్ ఒకటి కనిపించింది. అందుకు టీడీపీకి చెందిన యువ ఎంపీ కారణంగా కావటం విశేషం. సాధారణంగా విదేశాల్లో పెటర్నిటీ లీవ్ మాట చాలా ఎక్కువగా వినిపిస్తుంటుంది. దేశీయంగా కొన్ని రంగాలకు చెందిన కార్పొరేట్ ప్రపంచంలో ఈ మాట వినిపిస్తుంది. రాజకీయాల్లో ఇలాంటి మాటలకు చోటు ఉండదు. అందుకు భిన్నంగా ఏపీ టీడీపీకి చెందిన ఎంపీ ఒకరు లోక్ సభ స్పీకర్ కు లేఖ రాశారు. అందులో …
Read More »‘జనసేనలోకి చిరు.. పవన్ ఏమన్నాడంటే?
ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ఆసక్తికర చర్చ మొదలైంది. జనసేన పార్టీకి చిరంజీవి నైతిక మద్దతు ఉందని, తమ్ముడి వెంట అన్న నడవబోతున్నారని, తమ్ముడికి అండగా ఉంటానని చిరు స్పష్టమైన హామీ ఇచ్చారని ఆ పార్టీ ముఖ్య నేతల్లో ఒకరైన నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. దీంతో చిరు జనసేనలో చేరబోతున్నారనే ప్రచారం మొదలైంది. ఈ విషయంపై మీడియా వివిధ కోణాల్లో కథనాలు వెలువరిస్తున్న నేపథ్యంలో పవన్ సైతం …
Read More »ఢిల్లీలో భారీ పేలుడు.. ఉగ్ర మూకల పనేనా?!
ఢిల్లీలో భారీ పేలుడు సంభవించింది. ఇటీవల గణతంత్ర వేడుకలు(బీటింగ్ రిట్రీట్) నిర్వహించిన రాజ్‌పథ్‌కు 1.4 కిలో మీటర్ల దూరంలో ఈ పేలుడు సంభవించడం తీవ్ర సంచలనం సృష్టించింది. పైగా ఇజ్రాయెల్ రాయబార కార్యాలయంవద్ద ఈ పేలుడు సంభవించింది. ఓ పూల కుండీలో ఏర్పాటు చేసిన ఐఈడీ పేలుడు సంభవించడంతో భారీ శబ్దాలు వచ్చాయి. దీంతో ఢిల్లీ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఈ పేలుడు ధాటికి కార్లు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. సాయంత్రం …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates