Political News

మేల్కొన్న జ‌గ‌న్‌… వ్యాక్సినేష‌న్ కోసం ఏపీ ప్లాన్

క‌రోనా సెకండ్ వేవ్ విల‌య తాండవం చేస్తున్న ప్ర‌స్తుత త‌రుణంలో దుందుగుకుగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఏపీ సీఎం వైఎస్‌ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి… కాస్తంత ఆల‌స్యంగా అయినా మేల్కొన్నార‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. క‌రోనా బాధితులు ఆక్సిజ‌న్ దొర‌క్క ఎక్క‌డిక‌క్క‌డ ప్రాణాలు విడుస్తుంటే… ప‌రిస్థితి తీవ్రత‌ను గుర్తించిన జ‌గ‌న్ స‌ర్కారు ఆక్సిజ‌న్ ఉత్ప‌త్తి, స‌ర‌ఫ‌రా, ఇత‌ర‌త్రా ప‌ర్య‌వేక్ష‌ణ కోసం ఏకంగా రూ.310 కోట్ల‌ను కేటాయించింది. కేవ‌లం ఆక్సిజ‌న్ అందిస్తే స‌రిపోదు …

Read More »

బాబుకు నోటీసులు ఇవ్వ‌లేదు… రీజ‌నేంటంటే?

ఏపీ విప‌క్ష నేత‌గా కొన‌సాగుతున్న‌ టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుకు పోలీసులు నోటీసులు జారీ చేయ‌నున్నార‌ని, క‌ర్నూలు వ‌న్ టౌన్ సీఐ వెంక‌ట‌ర‌మ‌ణ నోటీసులు తీసుకుని మ‌రీ హైద‌రాబాద్ చేరుకున్నార‌ని, ఏ క్ష‌ణ‌మైనా చంద్ర‌బాబుకు నోటీసులు జారీ చేయ‌నున్నార‌ని ఆదివారం ఉద‌యం నుంచి రాత్రి దాకా ఒక‌టే హంగామా న‌డిచింది. చంద్ర‌బాబుకు పోలీసులు నోటీసులు జారీ చేసిన త‌ర్వాత జ‌రిగే ప‌రిణామాలు ఏమిట‌న్న కోణంలో పెద్ద ఎత్తున విశ్లేష‌ణ‌లు సాగాయి. …

Read More »

మొత్తానికి రజనీ తెలివైన వాడే

చివరి నిముషంలో వయసు పైబడిందని, అనారోగ్యమని రజనీకాంత్ తప్పుకున్నాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే తలైవా సత్తా ఏమిటో తేలోయేదే మొన్నటి ఎన్నికల్లో. షెడ్యూల్ ఎన్నికలకు మరో నాలుగు మాసాలుందనగా హఠాత్తుగా రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు, కొత్తగా పార్టీ పెడుతున్నట్లు మొన్నటి డిసెంబర్లో ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. వయసైపోయి, అనారోగ్యంతో ఉన్న రజనీ ఈ సమయంలో రాజకీయాల్లోకి ఎందుకు వస్తున్నాడని చాలామంది అనుకున్నారు. అయినా సరే వెనక్కు తగ్గేది లేదంటు …

Read More »

ఏపీకి వెళ్లాలా.. మళ్లీ అది ఉండాల్సిందే

పోయినేడాది ఇదే సమయానికి తెలుగు రాష్ట్రాల సరిహద్దులు మూసేయడంతో ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్లు అటు వెళ్లలేక.. ఆ రాష్ట్రంలో ఉన్న వాళ్లు ఇటు రాలేక నానా అవస్థలు పడ్డారు. కొన్ని రోజులే ఉంటుందనుకున్న లాక్ డౌన్ నెలల తరబడి కొనసాగడంతో ఎక్కడి వాళ్లు అక్కడ ఇరుక్కుపోయి స్వస్థలాలకు వెళ్లలేక తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఆ సమయంలో ప్రభుత్వ, ప్రైవేటు రవాణా సౌకర్యాలు పూర్తిగా ఆగిపోగా.. ప్రజలు వ్యక్తిగత వాహనాల్లో …

Read More »

తెలంగాణలో కొత్త పార్టీ పక్కా

తెలంగాణలో ఈ మధ్య కరోనా కాకుండా చర్చనీయాంశంగా మారిన అంశం అంటే.. ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను ఉన్నట్లుండి ముఖ్యమంత్రి కేసీఆర్ టార్గెట్ చేయడమే. ఆయన మీద భూ కబ్జా ఆరోపణలు రావడం, ఈ వ్యవహారంపై ఐఏఎస్‌లతో కమిటీ ఏర్పాటు చేసి అత్యవసరంగా భూముల సర్వే చేపట్టడం, ఆయన్ని మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయడం హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ఈ కరోనా కల్లోల సమయంలో …

Read More »

ఏపీకి జ‌గ‌న్ ఊపిరి పోసిన‌ట్టే!… ఎలాగో తెలుసా?

క‌రోనా మ‌హ‌మ్మారి విల‌య‌తాండ‌వం చేస్తున్న ప్ర‌స్తుత త‌రుణంలో ప్రాణ‌వాయువు అంద‌క జ‌నం ఊపిరి ఆగిపోతోంది. ఎక్క‌డ క‌రోనా సోకుతుందో? ఎక్క‌డ త‌మ‌కు ప్రాణ‌వాయువు అంద‌క ఇబ్బంది ప‌డాల్సి వ‌స్తుందోన‌న్న భ‌యం ప్ర‌తి ఒక్క‌రినీ వెంటాడుతోంది. ఇలాంటి త‌రుణంలో అవ‌స‌ర‌మైన ఏ ఒక్క‌రికి కూడా ఆక్సిజ‌న్ అంద‌లేద‌న్న మాటే విన‌రాద‌న్న దిశ‌గా ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. మొత్తం ఏపీకే ఊపిరి పోసేలా ఉన్న …

Read More »

‘గోమూత్రం తాగండి.. కరోనాను పారదోలండి’

గోమూత్రం గొప్ప ఔషధం అంటూ బీజేపీ నేతలు తరచుగా ప్రకటనలు చేయడం మామూలే. ఐతే ఇప్పుడు లక్షల మంది ప్రాణాలను కబళిస్తూ ప్రపంచానికి సవాలు విసురుతున్న కరోనా మహమ్మారికి కూడా గోమూత్రాన్ని మందుగా అభివర్ణిస్తూ ఓ బీజేపీ ఎమ్మెల్యే ప్రచారం సాగిస్తుండటం.. స్వయంగా ఒక వీడియో ద్వారా గోమూత్రాన్ని ఎలా సేవించాలో.. కరోనా నుంచి ఎలా కాపాడుకోవాలో వివరించడం అంరదినీ విస్మయానికి గురి చేస్తోంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆ ఎమ్మెల్యే …

Read More »

వామన్ రావు హత్య కేసులో ఈటల బుక్కైనట్టేనా?

Eetela Rajendra

ఈట‌ల రాజేంద‌ర్.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ హాట్ గా వినిపిస్తున్న పేరు. టీఆర్ఎస్ నేత‌గా, తెలంగాణ సీఎం కేసీఆర్ కేబినెట్లో కీల‌క శాఖ‌ల మంత్రిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన ఈట‌ల‌… ఒక్క‌సారిగా కేసీఆర్ ఆగ్ర‌హానికి గురైపోయారు. దేవ‌ర‌యాంజ‌ల్ భూముల కేసులో ఇప్ప‌టికే బుక్కైపోయిన ఈట‌ల‌పై మ‌రో కీల‌క కేసు న‌మోదు కానుంద‌న్న వార్త‌లు వినిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం రేకెత్తించిన న్యాయ‌వాది వామ‌న్ రావు దంప‌తుల హ‌త్య కేసులో …

Read More »

జగన్ మీద ఆశలు వదిలేసుకోవాల్సిందేనా ?

అవును తాజాగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తుంటే ఇదే అర్ధమవుతోంది. కరోనా వైరస్ సెకెండ్ వేవ్ నియంత్రణ నేపధ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోడి కొందరు ముఖ్యమంత్రులతో ఫోన్లో మాట్లాడారు. ఒడిస్సా, ఏపి, తెలంగాణా, జార్ఖండ్, పాండిచ్చేరి ముఖ్యమంత్రులతో మాట్లాడిన ప్రధాని తన మనసులోని మాటను చెప్పి సమావేశాన్ని ముగించారు. దీనిపై జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ కు ఒళ్ళు మండిపోయినట్లుంది. అందుకనే సమావేశం అయిపోగానే మోడిని ఉద్దేశించి ఘాటుగా ట్వీట్ చేశారు. …

Read More »

ఏపీ బీజేపీకి బాబే సీఎం.. టీడీపీనే అధికార పార్టీ..!

రాష్ట్ర బీజేపీలో ఒక విధానం అంటూ లేద‌నే కామెంట్లు త‌ర‌చుగా వినిపిస్తుంటాయి. ముఖ్యంగా సోము వీర్రాజు పార్టీ ప‌గ్గాలు చేప‌ట్టిన త‌ర్వాత‌.. పార్టీ ప‌రిస్థితి మ‌రింత అధ్వానంగా మారిపోయింది. ఆయ‌న ఎవ‌రిని టార్గెట్ చేస్తారో.. ఎలాంటి రాజ‌కీయాలు చేస్తారో.. ఎవ‌రిని తొక్కేస్తారో.. ఎవ‌రికి అవ‌కాశం ఇస్తారో కూడా తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. దీంతో ఏపీలో బీజేపీ తీవ్రంగా న‌ష్ట‌పోతోంద‌ని ఆ పార్టీ నేత‌లే వ్యాఖ్యానిస్తున్నారు. నిజానికి ప్ర‌తిప‌క్షంలో ఉన్న పార్టీ.. …

Read More »

కమల్‌కు మరో మార్గం లేదా?

జయలలిత బతికి ఉండగా కమల్ హాసన్‌ను రాజకీయ రంగప్రవేశం గురించి అడిగితే తనకు ఆసక్తి లేదన్నట్లు మాట్లాడాడు. తన లాంటి వాడికి రాజకీయాలు పడవని తేల్చేశాడు. కానీ జయ మరణానంతరం ఆయన ఆలోచనలు మారిపోయాయి. కరుణానిధి కూడా మంచం పట్టడం, ఎన్నో రోజులు బతికే అవకాశం లేదని తేలిపోవడంతో తమిళనాట నెలకొనబోయే రాజకీయ శూన్యతను భర్తీ చేయడానికి మంచి అవకాశం దొరికిందనుకున్నాడు. వెంటనే రాజకీయ పార్టీ పెట్టడానికి రంగం సిద్ధం …

Read More »

మోడీ చెప్పలేదు కానీ.. పది రాష్ట్రాలు మినహా

భారత్‌లో కరోనా తీవ్రత దృష్ట్యా మళ్లీ లాక్ డౌన్ విధించాల్సిందే అని నిపుణులు కుండబద్దలు కొడుతున్నారు. అన్ని వైపుల నుంచి కేంద్ర ప్రభుత్వానికి ఈ దిశగా సూచనలు అందుతున్నాయి. ఐతే గత ఏడాది లాక్ డౌన్ దెబ్బకు దేశ ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బ తినడం.. ప్రజలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడటంతో మళ్లీ ఇప్పుడు మరోసారి దేశవ్యాప్త లాక్ డౌన్ విధించే పరిస్థితుల్లో కేంద్రం లేదు. కరోనా విలయం …

Read More »