మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రులు… ఈ పదవులు అనగానే.. ఒకప్పుడు తలపండిన రాజకీయ నాయకులే కనిపించేవారు. కేంద్ర మంత్రి పదవి దక్కించుకునేవారు కూడా.. దాదాపు పెద్ద వయస్కులే ఉండేవారు. కానీ.. ఇప్పుడు కాలం మారింది. అందుకే.. యువ నాయకులు ఢిల్లీ వైపు అడుగులు వేస్తున్నారు. ప్రజలకు సేవ చేయాలనే కాంక్ష, టాలెంట్ ఉంటే చాలు అని ఈతరం నాయకులు నిరూపిస్తున్నారు.
తాజాగా… కేంద్ర మంత్రి వర్గ విస్తరణలోనూ యువ నాయకులు స్థానం సంపాదించుకున్నారు. వారిలో.. ఓ 35ఏళ్ల కేంద్ర మంత్రి.. అందరి దృష్టి ఆకర్షించాడు. ఆయనే బెంగాల్ కి చెందిన 35ఏళ్ల నిషిత్ ప్రామాణిక్.
చిన్న వయస్సులోనే కేంద్రమంత్రి వర్గంలో చోటు సంపాదించి అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నారు నిషిత్ ప్రామాణిక్. ఆయనకు హోం, యువజన, క్రీడాశాఖ సహాయ మంత్రిగా అవకాశం కల్పించారు.
బంగాల్లోని దిన్‌హతాలో జనవరి 17, 1986లో జన్మించారు నిషిత్. బాలకూర జూనియర్ బేసిక్ స్కూల్ నుంచి కంప్యూటర్ అప్లికేషన్స్‌లో బ్యాచ్‌లర్స్ పట్టా పొందారాయన. ప్రారంభంలో ఓ ప్రాథమిక పాఠశాలలో అసిస్టెంట్ టీచర్‌గా పనిచేసి.. ఆపై తృణమూల్ కాంగ్రెస్‌లో యూత్ లీడర్‌గా సేవలందించారు.
అనంతరం 2019లో బీజేపీలో జాయిన్ అయి.. కూచ్ బిహార్ నియోజకవర్గం నుంచి లోక్ సభకు పోటీ చేసి గెలుపొందారు.
కూచ్ బిహార్ నియోజకవర్గంలో టీఎంసీకి పట్టు ఉన్నప్పటికీ.. గట్టి పోటీ ఇచ్చి విజయం సాధించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దిన్హతా నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. అయితే పార్టీ పెద్దల ఆదేశాలతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు నిషిత్ ప్రామాణిక్. ఇప్పుడు కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణం చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates