విశాఖ జిల్లా మొత్తానికి ఆయనే ఏకైక మంత్రి. గతంలో టీడీపీ టైమ్ లో అయితే అవంతి గురువు గంటా శ్రీనివాసరావుకు రూరల్ జిల్లాలో అయ్యన్నపాత్రుడుతో పోటీ ఉండేది. దాంతో ఆయన సగం మంత్రిగానే ఉండిపోయారు. అయితే గంటా రాజకీయ చాతుర్యంతో, తనదైన వ్యూహాలతో రాష్ట్ర స్థాయిలోనే ఒక దశలో చక్రం తిప్పారు. చంద్రబాబు వద్ద తన ప్రయారిటీ ఏ మాత్రం దెబ్బ తినకుండా చూసుకున్నారు. కానీ ఇపుడు అవంతికి మాత్రం …
Read More »బీజేపీనే అసలైన ప్రతిపక్షమా ?
ప్రకటనలు చేయటంలో కమలనాదులకు మించిన వారు లేరన్నట్లుగా తయారైంది. రాష్ట్రంలో వైసీపీని ఎదుర్కోవటానికి బీజేపీనే అసలైన ప్రతిపక్షంగా తయారైందని ఆపార్టీ రాజ్యసభ ఎంపి జీవిఎల్ నరసింహారావు ప్రకటించటమే ఆశ్చర్యంగా ఉంది. అసలు ఆ పార్టీకి రాష్ట్రంలో ఉన్న బలమెంత ? ప్రజా ప్రతినిధులెంతమంది ? అన్న విషయాలు పరిశీలిస్తే చాలు జీవీఎల్ ప్రకటనలోని డొల్లతనం బయటపడుతుంది. ప్రస్తుతం బీజేపీ తరపున ఏకైక ఎంఎల్సీగా మాధవ్ ఉన్నారంతే. ఏరోజు కూడా ప్రభుత్వ …
Read More »పార్టీలన్నీ ఆ సామాజివకర్గం చుట్టునే తిరుగుతున్నాయా ?
మరో ఏడు నెలల్లో జరగబోయే ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీకి షాక్ తప్పేట్లు లేదు. ఇందుకు ప్రధాన కారణం ఏమిటయ్యా అంటే బలమైన బ్రాహ్మణ సామాజికవర్గం బీజేపీ మీద బాగా గుర్రుగా ఉండటమే. యూపీ జనాభాలో బ్రాహ్మణులు 12 శాతం ఉన్నారు. అదే ఓటర్లపరంగా చూస్తే బ్రాహ్మణుల శాతం 20. 20 శాతం ఓట్లంటే మామూలు విషయంకాదు. ఓ పార్టీని గద్దెమీద కూర్చోబెట్టాలన్నా, దింపేయాలన్నా 20 శాతం ఓట్లు సరిపోతాయి. …
Read More »అప్పుడే అసమ్మతి సెగ
కర్నాటకలో మంత్రివర్గం ఏర్పడి ఇంకా పదిరోజులు కూడా కాలేదు అప్పుడే ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మైకి అసమ్మతి సెగ మొదలైంది. తమకు కేటాయించిన శాఖలపై ముగ్గురు మంత్రులు బహిరంగంగానే తమ అసంతృప్తిని వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటివరకు నాలుగు గోడలమధ్య మాత్రమే తమ అసంతృప్తిని వ్యక్తంచేసేవారు. కానీ ఇపుడు మాత్రం తమకు కేటాయించిన శాఖలపైన, బొమ్మై పైన నేరుగా మీడియాతోనే తమ అసంతృప్తిని పంచుకోవటమే ఆశ్చర్యంగా ఉంది. ఎంటీబీ నాగరాజు, శ్రీరాములు, ఆనంద్ సింగ్ …
Read More »నల్గొండ సభలో అల్లు.. నాగార్జున.. మహేశ్ ప్రస్తావన ఎందుకొచ్చింది?
మాజీ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి.. బీఎస్పీ (బహుజన్ సమాజ్ వాదీ పార్టీ)లో చేరటం తెలిసిందే. నల్గొండలో ‘రాజ్యాధికార సంకల్ప సభ’ను నిర్వహించారు. ఈ భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రజానీకం హాజరైంది. ఈ సభకు వేలాది మంది పోటెత్తారు. అంచనాలకు మించిన ఉత్సాహంగా వచ్చిన కార్యకర్తలతో బహిరంగ సభ ప్రాంగణం పులకించింది. నల్గొండ పట్టణం నీలి మేఘం కమ్ముకన్నటైంది. ఈ భారీ …
Read More »సోము ఇంటికేనటగా… ?
ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు మీద బీజేపీ హై కమాండ్ గుర్రుగా ఉందా. ఆయన ఢిల్లీకి ఎన్నిసార్లు తిరిగినా కూడా జాతీయ ప్రెసిడెంట్ జేపీ నడ్డా దర్శనం లభించడంలేదా. సోము ప్రెసిడెంట్ అయ్యాక ఏపీలో బీజేపీ ఇమేజ్ పాతాళానికి పడిపోయిందా ఇలాంటి ప్రశ్నలకు సమాధానం అవును అనే వస్తోంది. సోముని తప్పించాలనే హై కమాండ్ నిర్ణయం తీసుకుంది అంటున్నారు. అర్జంటుగా అయన ప్లేస్ లో కొత్త వారిని తీసుకోవడానికి …
Read More »కాపు కోటలో ‘తోట’ బలాన్నే నమ్ముకున్న జగన్ ?
తూర్పు గోదావరి జిల్లా రాజకీయం ఎవరికీ ఒక పట్టాన అంతు పట్టదు. ఇక్కడ ఉన్న వారి మనసులు వెన్న. వారికి సమాదరించే గుణం ఉంది. తమ ఇంటికి వచ్చిన వారికి కడుపు నిండా భోజనం పెట్టకుండా పంపరు. గోదారమ్మలా చల్లగా ఉంటారు. కోపం వస్తే అదే గోదారి తల్లిగా ఉగ్రరూపం దాలుస్తారు. వారు అందరినీ నమ్ముతారు. ఎన్ని ఎన్నికలు వచ్చినా నమ్మడం వారి నైజం. ఒకసారి మోసపోతే మాత్రం ఆ …
Read More »మారుతోన్న రాజకీయం.. పవన్‌కు మరింత డ్యామేజ్ ?
జనసేనాని పవన్ కళ్యాణ్‌కు, ఆయన పార్టీకి మరింత డ్యామేజీ తప్పదా? మారుతున్న రాజకీయాలు.. పర్యవసానాలను అందిపు చ్చుకోవడం.. దానికి తగిన విధంగా వ్యవహరించే విషయంలో పవన్ అనుసరిస్తున్న వైఖరికి మొదటికే మోసం తెస్తుందా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. రాష్ట్రంలో పవన్ ఎక్కువగా ఆశలు పెట్టుకున్న ప్రాంతాలు.. రాయల సీమ, ఉత్తరాంధ్రలు. ఈ రెండు ప్రాంతాల్లోనూ ఆయన అనేక మార్లు పర్యటించారు. ఇక, ఉత్తరాంధ్రలో అయితే.. వెనుక బడిన జిల్లాలంటూ.. …
Read More »ఈటల దెబ్బకు దళిత బంధువైపోయారా ?
ఈటల దెబ్బకే కేసీయార్ అర్జంటుగా దళిత బంధువైపోయినట్లున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా జనాలందరికీ లేకపోతే ఏదో ఓ సెక్షన్ కు అర్జెంటుగా బంధువైపోతుంటారు. లేదా వరాల జల్లు కురపించేస్తుంటారు. సరే ఒక్కోసారి వర్కవుటవుతుంది ఒక్కోసారి బూమరాంగ్ అవుతుంటుంది. ఇపుడు టాపిక్ అంతా తొందరలో జరగబోయే హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నిక గురించే. ఈ నియోజకవర్గంలో సుమారు 45 వేల దళితుల ఓట్లున్నాయి. ఉపఎన్నికలో గెలవడం కేసీయార్ కు చాలా ప్రెస్టీజియస్ ఇష్యు …
Read More »బ్రాహ్మణులను దువ్వుతున్న మోడీ-షా.. రీజనేంటి?
ప్రధాన మంత్రి నరేంద్రమోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలు.. ఇప్పుడు బ్రాహ్మణ సామాజికవర్గం వైపు మొగ్గు చూపుతున్నారు. వారిని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. బ్రాహ్మణులకు ప్రాధాన్యం పెంచుతామని.. వారికి ఇప్పటికే అగ్రవర్ణ పేదల రిజర్వేషన్ కోటాలో మేళ్లు జరిగేలా చేస్తున్నామని.. ఇరువురు అగ్ర నేతలు చెబుతున్నారు. అంతేకాదు.. ఇకపై కూడా బ్రాహ్మణ సామాజిక వర్గానికి తాము ప్రాధాన్యం ఇస్తామని వాగ్దానాలు సైతం చేస్తున్నారు. మరి.. దీనికి …
Read More »జగన్ నువ్వు వేసింది కరెక్ట్ స్టెప్పేనా ?
ఏపీ సీఎం జగన్ తాజాగా తీసుకున్న నిర్ణయంపై విమర్శలు, ప్రతివిమర్శలు వస్తున్నాయి. జగన్ ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందనే విషయంపై ఆసక్తికర చర్చకు దారితీసింది. విషయం ఏంటంటే.. తాజాగా రెండు తెలుగు రాష్ట్రాలకు మధ్య.. జల వివాదాలు నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం.. కృష్ణానది యాజమాన్య బోర్డును, గోదావరి నది యాజమాన్య బోర్డును ఏర్పాటు చేసింది. ఇదిలావుంటే, కృష్ణా నది జలాల వివాదం ప్రస్తుతం సుప్రీం …
Read More »మోడీకి ప్రత్యామ్నాయం ఎవరు? జాతీయ స్థాయిలో ఆసక్తికర చర్చ
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ప్రత్యామ్నాయం ఎవరు? ఎవరు ఆయనకు దీటైన పోటీ ఇవ్వగలరు? కేంద్రంపై ఎవరు తమదైన ముద్రను వేయగలరు? ఇవీ.. ఇప్పుడు జాతీయ స్థాయిలో ఆసక్తి రేపుతున్న అంశాలు. సంప్రదాయ కాంగ్రెస్ నేతలకు భిన్నంగా.. వ్యవహరించగలిగే నాయకుడు/నాయకురాలు అయితేనే.. కేంద్రంలో మోడీకి ప్రత్యామ్నాయం కాగలరనే వాదన కొన్నేళ్లుగా వినిపిస్తున్నా.. అంతులేని అధికార పిపాసతో రగిలిన నేతలు.. ఏర్పరుచుకున్న కూటములు.. కొద్దిరోజుల్లోనే కుప్పకూలిన పరిస్థితి అందరికీ తెలిసిందే. ఈ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates