ఏపీ సీఎం జగన్ సొంత జిల్లా కడపలోని ఎస్సీ నియోజకవర్గం బద్వేల్ కు సంబంధించిన ఉప ఎన్నిక షె డ్యూల్ వచ్చేసింది. అక్టోబరు 1 నుంచి(శుక్రవారం) నామినేషన్ల పర్వం ప్రారంభం కానుంది. అదేనెల 30న ఎన్నిక జరగనుంది. దీనికి సంబంధించి అధికార, ప్రధాన ప్రతిపక్షాలు.. వైసీపీ, టీడీపీలు అభ్యర్థులను ఖరారు చేశాయి. ఇక, ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్.. వ్యూహం కూడా రెడీ చేసుకున్నారు. తాజాగా ఆయన …
Read More »అన్నదమ్ముల మధ్య మంట పెడుతున్నారే!
ఆన్‌లైన్ పోర్టల్ ప్రారంభించి సినిమా టికెట్లను ప్రభుత్వమే విక్రయిస్తుందంటూ జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అన్నదమ్ములు.. చిరంజీవి, పవన్ కల్యాణ్ మధ్య మంటకు కారణమవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ మంత్రులు ఆ దిశగా ఈ అవకాశాన్ని వాడుకుంటున్నరని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. జగన్ ప్రభుత్వంపై పవన్ చేసిన తీవ్రమైన వ్యాఖ్యలతో మొదలైన ఈ వివాదం రోజురోజుకు చిలికి చిలికి గాలివానలా మారుతోంది. సినీ పరిశ్రమలో మెగాస్టార్‌కు శిఖరాగ్రానికి చేరిన …
Read More »పవన్ శ్రమ దానానికి ‘నో’ పర్మిషన్
జనసేన, ఏపీ ప్రభుత్వం మధ్య పచ్ఛన్నయుద్ధం నడుస్తోంది. ఇటీవల ‘రిపబ్లిక్’ సినిమా ఈవెంట్‌లో జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ప్రభుత్వం, వైసీపీ నేతలపై చేసిన వ్యాఖ్యలపై మంటలు చల్లారలేదు. ఒకరిపై మరొకరు తీవ్రమైన వ్యాఖ్యలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వ విధానాలను తప్పుబడుతూ జనసేన వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టింది. అక్టోబరు 2న గాంధీ జయంతిని పురస్కరించుకుని ఏపీలోని రెండు ప్రాంతాల్లో శ్రమదానం చేయాలని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ …
Read More »అధికారుల అత్యుత్సాహం.. ఇరకాటంలో ఏపీ సర్కార్
అధికారుల అత్యుత్సాహం.. కొన్ని సందర్భాల్లో.. నిర్లక్ష్యం మరికొన్ని సందర్భాల్లో… ఏపీలోని వైసీపీ ప్రభుత్వానికి ప్రాణసంకటంగా పరిణమించింది. ముఖ్యమంత్రి జగన్ దగ్గర మార్కులు కొట్టేసే పనిలో తీరిక లేకుండా ఉన్న అధికారులు ‘కొందరు’ చేస్తున్న పనులు.. ప్రభుత్వానికి తీవ్ర ఇబ్బందిగా మారాయి. తాజాగా ఒకే రోజు గురువారం జరిగిన రెండు ఘటనలను పరిశీలిస్తే.. అధికారుల నిర్లక్ష్యం, అత్యుత్సాహం రెండూ స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో రిజర్వ్‌డ్ కేటగిరీలోని వారికి ఇచ్చే క్యాస్ట్ సర్టిఫికెట్ల …
Read More »టీడీపీ ఎంపి గల్లా కుటుంబంపై కేసు
తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ పై పోలీసులు కేసు నమోదుచేశారు. భూ ఆక్రమణ వివాదంలో రైతు ఫిర్యాదును పరిశీలించిన కోర్టు ఎంపితో పాటు ఆయన తల్లి, మాజీ మంత్రి గల్లా అరుణకుమారి, తండ్రి గల్లా రామచంద్రనాయుడుపైన కేసులు నమోదు చేయాలని ఆదేశించటంతో పోలీసులు వెంటనే పై ముగ్గురితో పాటు మరో 10 మందిపైన కేసులు నమోదుచేశారు. ఇంతకీ విషయం ఏమిటంటే గల్లా అరుణకుమారి తండ్రి, మాజీ ఎంపి రాజగాలనాయుడు …
Read More »అందుకే పొత్తులన్న పవన్
రాజకీయాల్లో పవన్ అనుసస్తున్న వైఖరి ఏమిటో అర్థం కావడం లేదు? ఒకసారి పొత్తులు అంటారు? మరోసారి ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్తారు? ఇలా ప్రజల్లో ఎన్నో అనుమానాలున్న సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటివరకూ జనసేన అధినేత పవన్ కూడా ఓ స్పష్టత ఇవ్వకపోవడం అందుకు కారణం. అయితే తాజాగా అందంతా తన వ్యూహమని.. అవసరాలకు అనుగుణంగా తన వ్యూహాన్ని మారుస్తుంటానని ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్న అది ఆంధ్రప్రదేశ్ …
Read More »వైసీపీకి సెగ.. ఆనం మళ్లీ నిరసన స్వరం
ఏపీ ప్రభుత్వంపై సొంత పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మళ్లీ పైరయ్యారు. తాజాగా ఆయన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సమక్షంలోనే తీవ్ర అసంతృప్తి, అసహనం వ్యక్తం చేశారు. దీంతో మరోసారి.. వైసీపీలో ఆనం వ్యవహారం చర్చకు వచ్చింది. వాస్తవానికి .. జగన్ కేబినెట్‌లో చోటు దక్కుతుందని.. భావించిన ఆనం రామనారాయణరెడ్డికి ఇప్పటి వరకు కనీసం నామినేటెడ్ పదవి కూడా దక్కలేదు. గత ఎన్నికల్లో నెల్లూరు జిల్లా వెంకటగిరి …
Read More »బద్వేల్ : పోటీలో ఎవరుంటారు ?
ఇపుడీ విషయం రెండు పార్టీల్లో ఆసక్తిగా తయారైంది. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలో ఇటు బీజేపీ అటు జనసేన రెండు పోటీకి సై అంటే సై అన్నాయి. అసలు బలమే లేని నియోజకవకర్గంలో తామే పోటీచేయాలంటే కాదు తామే పోటీలో ఉంటామంటూ కొద్దిరోజులు రెండు పార్టీల నేతల మధ్య పెద్ద వివాదమే నడిచింది. సరే మొత్తానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఎలాగోలా ఒప్పించి కమలం పార్టీయే పోటీ …
Read More »ఏపీలో రోడ్లకు మరమ్మతులు: పవన్ ఎఫెక్టేనా?
ఏపీలో హఠాత్పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటి వరకు పట్టించుకోని రహదారులకు ఈ రోజు ఉదయం నుంచి మరమ్మతులు ప్రారంభించారు. ఇది ఏ ఒక్కచోటో కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా.. దెబ్బతిన్న ప్రధాన రోడ్లకు.. మరమ్మతులు చేయిస్తున్నారు. హుటాహుటిన తీసుకున్న ఈ నిర్ణయంతో రహదారుల మరమ్మతుల ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. ఎక్కడికక్కడ అధికారులు.. దగ్గరుండి మరీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక, అధికార పార్టీ ఎమ్మెల్యేలు.. ఇళ్లకే పరిమితమైనా.. ఈ కార్యక్రమాలను పర్యవేక్షిస్తుండడం గమనార్హం. …
Read More »సంస్కారం గురించి పవన్ మాట్లాడడమా?:కన్నబాబు
వైసీపీ నేతలు వర్సెస్ పవన్ కల్యాణ్ మాటల యుద్ధం తార స్థాయికి చేరిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ విధానాలపై, సీఎం జగన్ పాలనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏపీలో రాజకీయ దుమారానికి తెరలేపాయి. వైసీపీ మంత్రులు సన్నాసులంటూ పవన్ చేసిన కామెంట్లపై వైసీపీ మంత్రులు మండిపడుతున్నారు. ఇప్పటికే పవన్ సన్నాసిన్నర సన్నాసి అంటూ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇవ్వగా…తాజాగా పవన్ కామెంట్లపై మంత్రి కురసాల …
Read More »షర్మిలతో పీకే టీం భేటీ
రాజకీయ పార్టీలకు రాజగురువులు, గాద్ ఫాదర్‌లు ఉన్నప్పటికీ రాజకీయ వ్యూహకర్తలను ఆశ్రయిస్తున్నారు. తమకు ఉన్న బ్యాక్ గ్రౌండ్ పాటు వ్యూహకర్తల విధానాలతో సునాయాసంగా విజయం సాధిస్తున్నారని భావిస్తున్నారు. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న వాళ్లు సైతం ప్రశాంత్ కిషోర్ లాంటి వారి కోసం పోటీపడుతున్నారు. రాజకీయ నాయకులు కూడా సిద్ధాంతాలను మరచిపోయారు. ప్రజా సమస్యలను ప్రస్తావించి, పోరాటాలు చేయడం మరచిపోయారు. వ్యూహకర్తలో కోట్లలో ఖర్చు చేస్తున్నారు. సీఎం పీఠం దక్కాలి …
Read More »ఆ ఇద్దరి గేమ్‌లో పెయిడ్ ఆర్టిస్ట్‌గా పోసాని.. అచ్చెన్న బిగ్ బాంబ్
కొద్ది రోజులుగా ఏపీ రాజకీయాలు అధికార, ప్రతిపక్ష నేతల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలతో హీటెక్కుతున్నాయి. ఈ క్రమంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వాన్ని, సీఎం జగన్‌ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడం ఆ వెంటనే వైసీపీకి చెందిన మంత్రులు, నేతలతో పాటు సినీ ఇండస్ట్రీకి చెందిన పోసాని కృష్ణ మురళీ లాంటి వాళ్లు పవన్‌పై తీవ్ర విమర్శలు చేయడం జరిగింది. ఇక ఈ వివాదంలో వైసీపీ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates