Political News

ప్రత్యేక హోదా వస్తుంది – జగన్

ఏపీలో గత ఎన్నికలకు జగన్ తీసుకున్న అతి ముఖ్యమైన నినాదాల్లో ఒకటి ప్రత్యేక హోదా. ఈ విషయం గురించి తొలి రెండు నెలలు మాత్రమే కొంత చర్చ జరిగింది. మోడీని కలిసినపుడు ఆయనకు ఎక్కువ సీట్లు ఉన్నాయి. మనం డిమాండ్ చేసే పరిస్థితుల్లో లేము, రిక్వెస్ట్ చేసుకోవాలి అని జగన్ అప్పట్లో వ్యాఖ్యానించిన సంగతి తెలిసింది. ఆ తర్వాత పార్టీ ఆ విషయం గురించి పెద్దగా ప్రస్తావించలేదు. దీంతో స్పెషల్ …

Read More »

జగన్ పాలనపై బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు జరిగి ఏడాది గడిచినా జగన్ పాలన గురించి ఇంతవరకు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పెద్దగా ఎక్కడా కామెంట్లు చేయలేదు. చేసినా అవి మామూలు స్పందనలే. అయితే మొదటి సారి బాలకృష్ణ జగన్ పాలనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో అరాచక పాలన ఐదేళ్లుండదన్నారు. త్వరలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్నారు. ఒక్క ఛాన్స్ అంటూ అడిగిన పార్టీ రాష్ట్రంలో ఏం చేస్తుందో అందరూ చూస్తున్నారని బాలయ్య అన్నారు. బాలృష్ణ …

Read More »

హైకోర్టు జడ్జిలపై ఆ వ్యాఖ్యలకు ఎలాంటి శిక్షలంటే?

నిర్లక్ష్యం.. అంతకు మించిన తెంపరితనం వెరసి ఏపీ హైకోర్టు న్యాయమూర్తులపై సోషల్ మీడియాలోనూ.. వీడియో క్లిప్పులతో విరుచుకుపడిన వైనం సంచలనంగా మారింది. ఇంత తీవ్రస్థాయిలో హైకోర్టు జడ్జిల మీద ఘాటు వ్యాఖ్యలతో పాటు.. అభ్యంతరక.. అసభ్యపదజాలంతో చేసిన వ్యాఖ్యల నేరం రుజువైతే ఎలాంటి శిక్షలు ఉంటాయన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఏపీ హైకోర్టు ఫుల్ బెంచ్ కొలువుతీరి.. తమపై సోషల్ మీడియాలో చేస్తున్న విపరీత ప్రచారంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం …

Read More »

బోరు బావిలో విషాదం.. ఇది మరీ దారుణం

బోరు బావిలో మూడేళ్ల బాలుడు.. బోరు బావిలో రెండేళ్ల పాప.. ఇలాంటి వార్తలు వింటూనే ఉంటాం. ప్రతిసారీ ఆ మాత్రం జాగ్రత్త ఉండదా.. బోరు బావులు పూడ్చాలి లేదా వాటి మీద ఏమైనా అడ్డం పెట్టాలి అన్న జ్ఞానం ఉండదా.. అనుకుంటాం. కానీ మళ్లీ ఇలాంటి వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. వందల కేసుల్లో ఒకటీ అరా మినహాయిస్తే ఇలాంటి సందర్భాల్లో పిల్లల ప్రాణాలు నిలవడం కష్టమే. తాజాగా మెదక్ జిల్లా …

Read More »

ఏపీ ప్రాజెక్టులతో తెలంగాణకు అంత నష్టమా?

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య తాజాగా నడుస్తున్న నీటి లొల్లి తెలిసిందే. తమకు హక్కుగా వచ్చే వాటిని తప్పించి.. తమకు సంబంధం లేని వాటాను వినియోగించుకోవాలన్న ఆలోచన లేదని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. అదే సమయంలో తెలంగాణ విపక్షాలు తీవ్రంగా అభ్యంతరం చెబుతున్న సీమఎత్తిపోతలకు సంబంధించి సీఎం కేసీఆర్ ధీమా మరోలా ఉంది. తెలంగాణ ప్రయోజనాల్ని కాపాడతామని.. ఏపీ సర్కారు ఏం చేస్తుందో తాము నిశితంగా …

Read More »

ఇండియాలో కరోనా.. ఇంకో 20 రోజులకు ఏం జరగబోతోంది?

ఇండియాలో తొలి కరోనా కేసు నమోదయ్యాక.. లక్ష కేసుల మార్కును అందుకోవడానికి రెండు నెలలకు పైగా సమయం పట్టింది. కానీ గత పది రోజుల వ్యవధిలో కేసులు 60 వేల దాకా ఉండటం గమనార్హం. దీన్ని బట్టి కరోనా వ్యాప్తి మే నెలలో ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఐతే దేశంలో కరోనా వ్యాప్తి విషయంలో ఇది పతాక స్థాయి కాదని అంటున్నారు నిపుణులు. ముందుంది ముసళ్ల పండగ …

Read More »

కరోనా టెస్టులపై సుప్రీం కీలక ఆదేశాలు

దేశంలో నానాటికీ కరోనా కేసులు పెరిగిపోతోన్నాయి. కరోనాను కట్టడి చేయడానికి ఓ వైపు లాక్ డౌన్ విధించడంతో పాటు మరోవైపు అధిక సంఖ్యలో టెస్టులు చేయడమే ఏకైక మార్గమని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ఈ నేపథ్యంలోనే భారత్ లోని చాలా రాష్ట్రాలు రోజుకు 5 నుంచి 10 వేల టెస్టులు చేస్తున్నాయి. కరోనా రోగులకు చికిత్సను కేవలం ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రమే చేస్తున్నారు. లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో …

Read More »

వైసీపీ నేత‌పై వైసీపీ ఫ్యాన్స్ బూతులు

అద్దేప‌ల్లి శ్రీధ‌ర్‌.. ఒక‌ప్పుడు జ‌న‌సేన పార్టీ అధికార ప్ర‌తినిధిగా బాగానే పాపులారిటీ సంపాదించిన నేత‌. టీవీ చ‌ర్చ‌ల్లో జ‌న‌సేన గ‌ళం బాగానే వినిపించాడాయ‌న‌. ఐతే గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో జ‌న‌సేన ఘోర ప‌రాభ‌వం చ‌విచూడ‌టంతో ఆయ‌న రూటు మారింది. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. అప్ప‌ట్నుంచి ఆయ‌న వైసీపీ త‌ర‌ఫున గ‌ళం వినిపిస్తున్నారు. జ‌న‌సేన‌, టీడీపీల‌పై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఐతే వైసీపీలో ఆయ‌న‌కు త‌గినంత ప్రాధాన్యం అయితే క‌నిపించ‌ట్లేదు. …

Read More »

వర్చువల్ మహానాడు….నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్

కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో లాక్ డౌన్ విధించడంతో సమావేశాలు, సభలకు అనుమతి లభించడం లేదు. స్కూళ్లు…ఆన్ లైన్లో క్లాసులు నిర్వహిస్తున్నాయి. అదే తరహాలో ఇపుడు రాజకీయ సమావేశాలను నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా టీడీపీ అట్టహాసంగా నిర్వహించే మహానాడు కార్యక్రమం తొలిసారిగా ఆన్ లైన్లో నిర్వహిస్తున్నారు. నేటి నుంచి 2 రోజుల పాటు జరగనున్న మహానాడులో దాదాపు 14 వేల మంది కార్యకర్తలు జూమ్ యాప్ ద్వారా భాగస్వాములు కానున్నారు. …

Read More »

లాక్‌డౌన్‌ పొడిగిస్తారట.. ఐతే ఏంటట?

లాక్ డౌన్ అంటే వామ్మో అన్న వాళ్లంతా ఇప్పుడు ఆ మాటను లైట్ తీసుకుంటున్నారు. రెండో దశ లాక్ డౌన్ వరకు చాలా కఠినంగా ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. మూడో దశ నుంచి మినహాయింపులు మొదలుపెట్టాయి. నాలుగో దశలో చాలా వరకు షరతులన్నీ ఎత్తేశారు. బస్సులు, రైళ్లు, విమానాలు నడుస్తున్నాయి. దుకాణాలన్నీ తెరుచుకున్నాయి. థియేటర్లు, పెద్ద షాపింగ్ మాల్స్‌పై మాత్రమే ఆంక్షలున్నాయి. రాజకీయ, మతపరమైన సభలు, సమావేశాలపైనా నిషేధం …

Read More »

హైకోర్టు ప్రశ్నలకు కేసీఆర్ ఏం సమాధానం ఇస్తారు?

మాయదారి మహమ్మారి చేస్తున్న ఆరాచకం అంతా ఇంతా కాదు. కంటికి కనిపించని ఈ అతి సూక్ష్మ శత్రువును ఎదుర్కోవటం మనిషికి సాధ్యం కావట్లేదు. ప్రత్యర్థి బలహీనుడే అయినప్పటికీ.. మనిషి చేసే తప్పులతో చెలరేగిపోతున్న పరిస్థితి. దీంతో.. ప్రపంచ వ్యాప్తంగా బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ముప్పు హెచ్చరిస్తున్నప్పుడు ప్రభుత్వాలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇందుకు భిన్నంగా తెలంగాణ సర్కారు తీరు ఉందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. మాయదారి …

Read More »

ఏపీ హైకోర్టుకు ఎందుకంత కోపం వచ్చింది?

రాజ్యాంగం భావస్వేచ్ఛ ఇచ్చింది. కానీ.. ఎవరి మీద పడితే వారి మీద మనసుకు తోచింది అనేందుకు కాదు. వ్యవస్థల మీద సహజసిద్ధంగా ఉండాల్సిన గౌరవ మర్యాదలు మిస్ కావటం ఆందోళన కలిగించే అంశం. సగటు రాజకీయ పార్టీల మీద ఏ రీతిలో అయితే రాజకీయ ఎదురుదాడులు ఉంటాయో.. అదే తీరులో న్యాయవ్యవస్థ మీద మండిపడటం.. అనుచిత వ్యాఖ్యలు చేయటం ఏ మాత్రం మంచిది కాదు. ఈ విషయాన్ని మర్చిపోతున్నప్పుడు.. పెద్ద …

Read More »