మరో ఇరవై రోజుల్లో వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్కే రోజా జైలుకు వెళ్లడం ఖాయమని టీడీపీ నాయకుడు, ఏపీ క్రీడా ప్రాధికార సంస్థ(శాప్) చైర్మన్ రవి నాయుడు షాకింగ్ కామెంట్స్ చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు.. అడ్డంగా ఆమె దోచుకున్నారని చెప్పారు. ముఖ్యంగా ఆడుదాం ఆంధ్ర పేరుతో కోట్ల రూపాయలను వెనుకేసుకున్నారని ఆరోపించారు. నాటి శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్‌తో కలిసి రోజా కుట్రలు పన్నారని చెప్పారు. ఆడుదాం …
Read More »ఉప రాష్ట్రపతి రాజీనామా.. రీజనేంటి?
భారత ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రతిష్టాత్మకమైన తన పదవికి ఆయన రాజీనామా చేశారు. 74 ఏళ్ల జగదీప్ ధన్‌ఖడ్ సోమవారం.. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన సంద ర్భంగా రాజ్యసభకు కూడా వచ్చారు. సభలో చలోక్తులు కూడా విసిరారు. అదేసమయంలో ప్రతిపక్ష సభ్యులకు చురకలు కూడా అంటించారు. సభను సజావుగా నడిపించేలా సహకరించాలని కూడా పదే పదే ఆయన కోరారు. అయితే.. …
Read More »నియోజకవర్గం టాక్: మంగళగిరి మారిపోయింది.. !
రాష్ట్రంలో ఒక్కొక్క నియోజక వర్గానికి ఒక్కొక్క చరిత్ర ఉంది. రాజకీయంగా.. జనాభా పరంగా.. మౌలిక సదుపాయాల పరంగా కూడా.. ఒక్కొక్క నియోజకవర్గం విశిష్టత ఒక్కొక్కరకం. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. మార్పులు, చేర్పులు అంటూ నాయకులు హామీ ఇస్తుంటారు. వెనుక బడిన ప్రాంతాలుగా ఉన్నవాటిని అభివృద్ధి చేస్తామని.. ప్రజల జీవన ప్రమాణాలను మారుస్తామని కూడా చెబుతారు. అదేవిధంగా రాజకీయాలు కూడా మారుతాయని హామీలు గుప్పిస్తారు. అయితే.. అవి ఏమేరకు సాకారం అవుతాయన్నది …
Read More »గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజకీయమా… మజాకానా ..!
‘మా మంచి నేత.’ అని ప్రజలతో అనిపించుకునేందుకు చాలానే కృషి చేయాలి. ఇలాంటి నాయకులు చాలా తక్కువ మందే ఉన్నారు. అయితే.. వయసు మీదపడ్డా.. నిఖార్సయిన నాయకుడిగా రాజకీయాలు చేస్తున్నారు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ప్రస్తుతం ఆయన 80+లో ఉన్నారు. అయితేనేం.. ఎలాంటి ఆధారం లేకుండా.. వడివడిగా నడవడంతోపాటు.. పొలం గట్లపైనా దూకుడగా ముందుకు సాగుతున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పిలుపునిచ్చిన.. …
Read More »తన కామెంట్లలో తప్పే లేదన్న రోజా
వైసీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా మీద నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారమే రేపాయి. తనను ఎవరు విమర్శించినా దీటుగా బదులిచ్చే రోజా.. ఈ కామెంట్లకు బాగా హర్టయినట్లు కనిపించారు. సాక్షి టీవీలో డిబేట్లో దీని గురించి మాట్లాడుతూ ఆమె బోరున ఏడ్చేశారు. వైసీపీ నేతలు, కార్యకర్తలు భాను ప్రకాష్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈ అంశం మీద సోషల్ …
Read More »మిథున్ అరెస్టుతో వైసీపీకి నష్టమెంత.. !
వైసీపీ కీలక నాయకుడు, రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డిని అరెస్టు చేయడం.. రాజమండ్రి జైలుకు పంపిం చడం కేవలం 36 గంటల్లోనే జరిగిపోయాయి. ఇది అనూహ్యమనే చెప్పాలి. మద్యం కుంభకోణాన్ని విచారి స్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు.. ఇప్పటి వరకు 11 మందినిఅరెస్టు చేసినా.. ఇలా 36 గంటల్లోనే నిర్ణయం తీసుకున్న పరిస్థితి లేదు. కానీ.. మిథున్‌రెడ్డి విషయంలో మాత్రం అధికారులు పక్కా ఆధారాలు ఉండబట్టే ఇలా అరెస్టు చేశారని …
Read More »నిజమే.. వారిలో ఒక్కరూ పాసవలేదు ..!
ఏపీ సీఎం చంద్రబాబు చేపట్టిన ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమాన్ని ఎంతమంది విజయవంతం చేశారు? ఎంత మంది ఇంటికే పరిమితమయ్యారు? అంటే.. చాలా మంది ఫెయిలయ్యారన్నది చంద్ర బాబుకే అందిన నివేదిక తేల్చి చెబుతోంది. తాజాగా ఐవీఆర్ఎస్ సర్వే సహా.. ఇతర మాధ్యమాల్లో ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమాన్ని ఏవిధంగా విజయవంతం చేశారన్న విషయాన్ని సీఎం చంద్రబాబు తెలుసుకున్నా రు. దీని పై ఒకటి రెండు నివేదికలు కూడా తెప్పించుకున్నారు. ముఖ్యంగా …
Read More »జగన్ ఆశించేది ఒకటి.. జరుగుతోంది మరొకటి.. !
వైసీపీ అధినేత జగన్ ఏం ఆశిస్తున్నారు? ఏం చేయాలని భావిస్తున్నారు? అంటే.. ఖచ్చితంగా కూటమి సర్కారు పై వ్యతిరేకత పెరుగుతోందని.. అది తమకు మేలు చేస్తుందని.. కాబట్టి.. నాలుగేళ్ల తర్వాత జరిగే ఎన్నికల్లో విజయం దక్కించుకోవడం ఖాయమని పార్టీ నాయకులకు జగన్ తేల్చి చెబుతున్నారు. ఓకే.. ప్రతిపక్ష నాయకుడిగా జగన్‌కు ఆమేరకు ఆశలు ఉండడం తప్పుకాదు. అయితే.. మారుతున్న పరిణామాలు.. పెరుగుతున్న కూటమి దూకుడుతో ఈ ఆశలు నెరవేరడం కష్టమని …
Read More »విపక్షల డిమాండ్‌కు కేంద్రం ఓకే.. వ్యూహమేంటి?
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం తొలిసారి విపక్షాలు పెట్టిన డిమాండ్‌కు ఓకే చెప్పింది. 11 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. ఇప్పటి వరకు ప్రతిపక్షాలు పెట్టిన ఏడిమాండ్‌ను ఓకే చేయకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో తొలిసారి ప్రతిపక్షాలు లేవనెత్తిన డిమాండ్‌పై ఓకే చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరి దీని వెనుక వ్యూహం ఏంటి? కేంద్రం ఎందుకు దిగి వచ్చింది? అనే విషయాలు ఆసక్తిగా మారాయి. అసలు విషయం ఏంటి? …
Read More »మిథున్ రెడ్డికి రిమాండ్.. జగన్ ‘పిట్ట’ పలుకులు!
వైసీపీ నాయకుడు, ఎంపీ మిథున్ రెడ్డిని మద్యం కుంభకోణం కేసులో సిట్ అధికారులు అరెస్టు చేయడం.. ఆ వెంటనే ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించడం జరిగిపోయాయి. అయితే.. ఈ ఘటనలపై వైసీపీ అధినేత జగన్ ట్విట్టర్(ఎక్స్) వేదికగా సుదీర్ఘ స్పందన వెలిబుచ్చారు. మిధున్ రెడ్డి అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. ఇది ప్రజలతో నిలబడే వారి నోరు మూయించడానికి రూపొందించిన రాజకీయ కుట్ర తప్ప మరొకటి కాదని …
Read More »‘జగన్‌ను విచారిస్తే.. అన్నీ బయటకు వస్తాయి’
జ్యోతుల నెహ్రూ. ఒకప్పుడు వైసీపీ అధినేత జగన్‌కు అత్యంత సన్నిహితుడు. ఆ పార్టీలో గత ఐదేళ్లు కూడా ఉన్నారు. అయితే, 2024 ఎన్నికలకు ముందు పార్టీ మారి టీడీపీ గూటికి చేరుకున్నారు. ఈక్రమంలోనే జగ్గంపేట నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్నారు. అయితే.. కొన్నాళ్లుగా మౌనంగా ఉన్న జ్యోతుల.. తాజాగా మిథున్ రెడ్డి అరెస్టు, జైలు నేపథ్యంలో స్పందించారు. జగన్ కూడా జైలుకు వెళ్లక తప్పదన్నారు. అసలు ఈ కేసులో జగనే …
Read More »అసెంబ్లీలో మంత్రి రమ్మీ గేమ్
మహారాష్ట్రలో వ్యవసాయ మంత్రి మాణిక్‌రావ్ కోకాటే అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా రమ్మీ గేమ్ ఆడుతున్నట్లు వీడియో వైరల్ కావడం ఇప్పుడు తీవ్ర దుమారం రేపింది. అధికారంలో ఉన్న బీజేపీ కూటమిపై విపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టాయి. రైతులు పలు సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే, వ్యవసాయ శాఖ మంత్రి మాత్రం అసెంబ్లీలో గేమ్స్ ఆడుతున్నారని విపక్ష నేతలు మండిపడ్డారు. వైరల్ అయిన ఈ వీడియోను ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates