త్వరలోనే పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో దక్షిణాదిలోని కీలక రాష్ట్రం తమిళనాడు కూడా ఉంది. తమిళనాడు ఇప్పటిదాకా అడుగు కూడా పెట్టలేకపోతున్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ..ఈ దఫా ఓ అదిరేటి వ్యూహంతో ముందుకు సాగుతోంది. అందులో భాగంగా ఇటీవలే ఖాళీ అయిన భారత ఉపరాష్ట్రపతి ఎన్నికలో తమ అభ్యర్తిగా తమిళనాడుకు చెందిన సీపీ రాధాకృష్ణన్ ను ఎంపిక చేసింది. ఈ మేరకు ఆదివారం రాత్రి జరిగిన ఎన్డీఏ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. …
Read More »మరో వివాదంలో ‘అనంత’ ఎమ్మెల్యే… రచ్చరచ్చ
అనంతపురం అర్బన్ అసెంబ్లీ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన టీడీపీ నేత దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ నిత్యం వివాదాల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై పెను వివాదమే రేగింది. తారక్ తాజా సినిమా వార్ 2 సినిమా రిలీజ్ సందర్భంగా అనంతపురంలో తారక్ అభిమానులు సమావేశం ఏర్పాటు చేసుకోగా… సినిమాను అనంతలో ఆడనివ్వనంటూ దగ్గుపాటి వారికి ఫోన్ చేశారు. …
Read More »అసలు.. వైసీపీ బాధేంటి?
ఊరందరిదీ ఒకదారైతే.. వైసీపీది మరో దారి అన్నట్టుగా ఉంది రాజకీయం. మరి ఆ పార్టీ నాయకులు ఆలోచించి మాట్లాడుతు న్నారో.. ఆలోచన లేకుండానే విమర్శలు చేస్తున్నారో తెలియదు కానీ.. ప్రజల ముందు మాత్రం చులకన అవుతున్నారు. నెటిజ న్ల నుంచి ట్రోల్స్‌కు గురవుతున్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో కీలకమైన ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని మహిళలకు అందుబాటులోకి తీసుకువచ్చింది. స్త్రీ శక్తి పేరుతో …
Read More »వైసీపీ గొంతెమ్మ కోరికలు!
కోరికలు తప్పుకాదు.. కానీ, అలివికాని కోరికలే విమర్శలు వచ్చేలా చేస్తాయి. రాజకీయాల్లో అయినా అంతే!. ఏపీ విపక్ష పార్టీ వైసీపీ విషయంలోనూ ఇలానే విమర్శలు వచ్చేలా వ్యవహరిస్తోంది. అలివికాని కోరికలతో రాజకీయాలు చేస్తోంది. ఈ నెల 12న జరిగిన పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. రెండు చోట్లా కనీసం డిపా జిట్లు కూడా దక్కించుకోలేక పోయింది. నిజానికి వైసీపీ అధినేత జగన్ …
Read More »“నా శత్రువు అంటే ఒక స్థాయి, అర్హత ఉండాలి” : సీఎం రేవంత్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో తాను గెలవడాన్నికొందరు ఇష్టపడలేదన్నారు. ఇప్పటికీవారి మనస్థత్వం అలానే ఉందన్నారు. పరోక్షంగా ఆయన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ కవి అందెశ్రీ ప్రచురించిన ‘హసిత భాష్పాలు’ పుస్తకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని శ్రీరామ్ రచించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తన …
Read More »అభినందించాల్సిన ఎమ్మెల్యే: బాబు కామెంట్
టీడీపీ నుంచి 134 మంది ఎమ్మెల్యేలు గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్నారు. వీరిలో సీఎం చంద్ర బాబు, మంత్రి నారా లోకేష్‌లను పక్కన పెడితే.. 132 మంది ఒక్క టీడీపీకే ఉన్నారు. అయితే.. వీరిలో ఎంత మంది సీఎం చంద్రబాబు వద్ద మార్కులు వేయించుకుంటున్నారన్నది ఇప్పటికీ ప్రశ్నార్థకమే. తాజాగా గుంటూరు జిల్లాలో పర్యటించిన చంద్రబాబు స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా.. గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గళ్లా మాధవిని …
Read More »షరతుల్లేవ్.. తీసేయండి: చంద్రబాబు సంచలన నిర్ణయం
గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన ఉచితబస్సు హామీ మేరకు.. `స్త్రీ శక్తి` పేరుతో రాష్ట్రంలో ఉచిత బస్సును ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. శుక్రవారం సాయంత్రం సీఎం చంద్రబాబు స్వయంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే.. ఈ పథకానికి సంబంధించి కొన్ని షరతులు విధించారు. వీటి ప్రకారం.. ఘాట్ రోడ్లలో ప్రయాణించే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత సర్వీసులు ఉండబోవని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని …
Read More »అమరావతి మరింత దూకుడు.. ప్రతి పనికీ పక్కా లెక్క..!
ఏపీ రాజధాని అమరావతి పనులు మరింత దూకుడుగా ముందుకు సాగనున్నాయా? వర్షాలు, వరదలను సైతం తట్టుకునే టెక్నాలజీతో పనులు చేయాలని భావిస్తున్నారా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. నిజానికి చిన్నపాటి వర్షానికే పనులు ఆగిపోయే పరిస్థితి ఉంది. ఇది ఎక్కడైనా సహజమే. పైగా.. అమరావతి విషయంల అయితే మరింత ఎక్కువగా ఇబ్బందులు వస్తున్నాయి. పక్కనే కృష్ణానది ప్రవహిస్తుండడంతో నీటి ఊటలు పెరిగి.. పది అడుగులకే నీరు చిమ్ముతోంది. దీంతో గతంలో …
Read More »ఓట్ చోరీపై రాహుల్ ప్రభంజనం.. మరింత దూకుడు!
‘ఓట్ చోరీ’ అంశంపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ.. మరింత దూకుడుగా ముందుకు సాగనున్నారు. ఒకరకంగా ఆయన ప్రభంజనం సృష్టించేందుకు సిద్ధమయ్యారు. ‘ఓట్ అధికార్ యాత్ర’ పేరుతో రాహుల్‌గాంధీ ఆదివారం నుంచి 16 రోజుల పాటు యాత్ర చేయనున్నారు. త్వరలో ఎన్నికలు జరగనున్న బీహార్‌లో దాదాపు 65లక్షల మంది ఓటర్లను తొలగించారని.. పేర్కొంటున్న రాహుల్ గాంధీ ఇప్పటికే జాతీయ స్థాయిలో దీనిపై పెద్ద చర్చే పెట్టారు. ఓ వారం …
Read More »కాళేశ్వరం వర్సెస్ పోలవరం: కేటీఆర్ కొత్త రగడ
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ జల ప్రాజెక్టులకు సంబంధించి మరో కొత్త వివాదాన్ని తెరమీదికి తెచ్చారు. ఏపీ అంటే ఒకలాగా, తెలంగాణ అంటే మరోలా వ్యవహరిస్తున్నారు.. అంటూ కేంద్రంలోని బీజేపీపై విమర్శలు గుప్పించారు. తమ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో యాగీ చేస్తున్న వారు.. పొరుగున ఉన్న పోలవరం విషయంలో కళ్లు మూసుకున్నారని అన్నారు. పోలవరం ప్రాజెక్టు కాఫర్ డ్యామ్ ఇప్పటికి రెండు సార్లు డ్యామేజీ …
Read More »ధర్మవరం అబ్బాయి పాకిస్తాన్ కు ఎందుకు ఫోన్ చేశాడు
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం.. ఫ్యాక్షన్ జోన్ లోనే ఉన్నప్పటికీ కొన్నాళ్లుగా ఇక్కడ పరిస్థితులు సజావుగానే ఉన్నాయి. రాజకీయ వివాదాలు తప్ప వ్యక్తిగత కక్షలు హత్యలు లేవు. ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు, ప్రజల్లో వచ్చిన మార్పుల కారణంగా ధర్మవరంలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. అయితే అనూహ్యంగా శనివారం ధర్మవరం ఒక్కసారిగా దడ దడలాడింది. ప్రజలు ఉలిక్కిపడ్డారు. దీనికి కారణం ధర్మవరం యువకుడు ఒకరు పాకిస్థాన్ లోని ఉగ్రవాదులతో నేరుగా ఫోన్లో …
Read More »బాబు, జగన్ పార్టీలు పరస్పరం భుజం భుజం రాసుకుంటూన్నాయి
కాంగ్రెస్ పార్టీ ఏపీ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాకూర్ ఏపీ రాజకీయాలపై సునిశిత విమర్శలు గుప్పించారు. అధికారంలో ఉన్న సీఎం చంద్రబాబుకు, ప్రతిపక్షంలో ఉన్న జగన్‌కు కూడా ప్రజల కంటే ప్రధాని మోడీనే ఎక్కువనని విమర్శించారు. దీంతో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు. ఓట్ చోరీ అంశంపై దేశవ్యాప్తంగా చర్చకు వస్తే ఏపీలో మాత్రం ఈ విషయంపై మౌనంగా ఉన్నారని, కేంద్రం కనుసన్నల్లో బాబు, జగన్ పార్టీలు నడుస్తున్నాయన్నారు. బాబు పార్టీ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates