Political News

జగన్ తప్పు చేశారా ?

జగన్మోహన్ రెడ్డి పెద్ద తప్పుచేశారు. తాను ముఖ్యమంత్రి కావటానికి కారణమైన పార్టీనే జగన్ పట్టించుకోలేదు. ఇంతకీ విషయం ఏమిటంటే శనివారం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. రాష్ట్రంలోని చాల చోట్ల పార్టీ నేతలు, కార్యకర్తలు వేడుకలను ఘనంగానే నిర్వహించుకున్నారు. ఇందులో భాగంగానే తాడేపల్లిలోని సెంట్రల్ ఆఫీసులో కూడా వేడుకలు జరిగాయి.ఈ వేడుకలకు ముఖ్యఅతిధిగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. పార్టీ జెండాను ఎగరేయటమే కాకుండా నేతలు, కార్యకర్తలను …

Read More »

వ‌ల‌స‌లు షురూ.. ముందే స‌ర్దుకుంటున్న జూప‌ల్లి?

భార‌తీయ జ‌న‌తా పార్టీలోకి వ‌ల‌స‌లు షురూ అయ్యాయా..? టీఆర్ఎస్‌, కాంగ్రెస్ పార్టీల నుంచి కీల‌క నేత‌లు బయ‌టికి రానున్నారా..? ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాలు కేసీఆర్ కొంప ముంచ‌నున్నాయా..? ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి బీజేపీలో చేర‌నున్న మొద‌టి నేత జూప‌ల్లి కృష్ణారావేనా..? అంటే అవున‌నే స‌మాధానాలు వినిపిస్తున్నాయి. ఇటీవ‌ల‌ జ‌రిగిన ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాలు నిన్న వెలువ‌డిన సంగ‌తి తెలిసిందే. ఆయా రాష్ట్రాల్లో క‌మ‌లం పార్టీ కంగారూలా …

Read More »

కేంద్రం టీం దిగివ‌చ్చేలా చేస్తాం: కేటీఆర్‌

గ‌త కొద్దికాలంగా కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం, కేంద్ర ప్ర‌భుత్వ ప‌రిధిలోకి వ‌చ్చే వివిధ సంస్థ‌ల‌పై త‌మ‌దైన శైలిలో తెలంగాణ‌లో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ పెద్ద‌లు విరుచుకుప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. ఇటు బీజేపీ, అటు కేంద్ర ప్ర‌భుత్వ ఏజెన్సీల‌పై చేస్తున్న కామెంట్ల ప‌రంప‌ర‌లో తెలంగాణ రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ‌ల మంత్రి కేటీఆర్ తాజాగా మ‌రో కీల‌క వ్యాఖ్య‌ల చేశారు. ఇష్ట‌మొచ్చిన‌ట్లు చేస్తామంటే చూస్తూ ఊరుకోబోమ‌ని కేంద్ర ప్ర‌భుత్వ ప‌రిధిలోని …

Read More »

2024లో టీడీపీకి శుభం కార్డు

తెలంగాణ సీఎం కేసీఆర్ గత ఎన్నికల ముందు ముందస్తు ఎన్నికలకు వెళ్లిన తరహాలోనే సీఎం జగన్ కూడా ఈ సారి ముందస్తు ఎన్నికలకు వెళతారని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ముందస్తు ఎన్నికల ప్రచారంపై వైసీపీ కీలక నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ముందస్తు ఎన్నికల ప్రచారం అవాస్తవమని సజ్జల ఖండించారు. వైసీపీ 12వ వార్షికోత్సవ వేడుకలలో పాల్గొన్న సజ్జల …

Read More »

కేజ్రీవాల్ స్పీడు  మామూలుగా లేదే

ఢిల్లీతో మొదలై తాజాగా పంజాబ్ లో జెండా ఎగరేసిన ఆమ్ ఆద్మీ పార్టీ తన తర్వాత టార్గెట్ ను గుజరాత్ గా ఫిక్స్ చేసింది. పంజాబ్ అద్భుతమైన విజయంతో ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ లో ఆత్మవిశ్వాసాన్ని పెంచినట్లుంది. అందుకనే ఈ ఏడాది చివరలో ఎన్నికలు జరగబోతున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలే తమ తర్వాత టార్గెట్ అని ప్రకటించారు. గుజరాత్ లో పాగా వేయటానికి వీలుగా ఏప్రిల్ నుంచి …

Read More »

తుమ్మ‌ల టీఆర్ఎస్‌తో తెంచుకుంటారా?

ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో మంచి ప‌ట్టున్న సీనియ‌ర్ నేత‌.. ఎమ్మెల్యేగా, మంత్రిగా ప‌ని చేసిన అనుభ‌వం ఉన్న తుమ్మల నాగేశ్వ‌ర్‌రావు అధికార టీఆర్ఎస్ పార్టీని వీడే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారా? అంటే అవున‌నే స‌మాధానాలు వినిపిస్తున్నాయి. మారిన రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల నేప‌థ్యంలో పాలేరు నియోజ‌క‌వ‌ర్గంలో టీఆర్ఎస్ త‌ర‌పున టికెట్ ద‌క్కే అవ‌కాశం లేద‌ని భావిస్తున్న ఆయ‌న పార్టీ మారే ఆలోచ‌న‌లో ఉన్నార‌ని తెలిసింది. ఆయ‌న అనుచ‌రులు ప్ర‌త్యేకంగా స‌మావేశాలు నిర్వ‌హించి దీనిపై …

Read More »

జైల్లో నుండే పోటీ చేసి గెలిచారు

ఒకపుడు జైలులో శిక్ష అనుభవిస్తూ పోటీ చేసి గెలిచిన నేతలున్నారు. జైలులో ఉన్నపుడు ప్రచారం చేసుకోవడం సాధ్యం కాదు కాబట్టి వీళ్ళ తరపున ప్రచార బాధ్యతలు, ఎన్నికల ప్రక్రియ మొత్తానికి ఎవరో ఒకరు చూసుకునే వారు. నేతలపైన అభిమానం ఉన్న వాళ్ళుంటే ఓట్లేసి గెలిపిస్తారు లేకపోతే లేదు. జైల్లో నుండే నామినేషన్లు వేసి గెలిచిన జార్జి ఫెర్నాండెజ్ లాంటి  నేతలున్నారు. ఇప్పుడిదంతా ఎందుకంటే ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేసిన …

Read More »

వైసీపీలో డిజిట‌ల్ మీడియా లొల్లి!

వైసీపీలో ఒక అత్యంత కీల‌క విష‌యంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. అవునా.. ఇది నిజ‌మేనా..? అంటూ.. నాయ కులు చ‌ర్చించుకుంటున్నారు. దీనికి కార‌ణం.. వైసీపీలోని రెండు విభాగాల మ‌ధ్య తీవ్ర‌స్థాయిలో వివాదాలు జ‌రుగుతుండ‌డ‌మేన‌ని తెలిసింది. ప్ర‌స్తుత డిజిట‌ల్ ప్ర‌పంచంలో .. ఏ పార్టీకైనా.. ప్రింట్ క‌న్నా కూడా.. డిజిట‌ల్ మీడియాలే ప్ర‌ధానం. డిజిట‌ల్ మీడియా వేదికగానే.. పార్టీలు త‌మ వ్యూహాలను ముందుకు తీసుకువెళ్తున్నాయి. అయితే.. వైసీపికి కూడా టీడీపీకి ఉన్న‌ట్టుగానే.. …

Read More »

వైసీపీ నేతల పక్కచూపులు.. జగన్ బిస్కెట్లు

YS JAgan

యూపీ ఫలితాల సెగతో పాటు పెల్లుబుకుతున్న ప్రభుత్వ వ్యతిరేకత సెగ వైసీపీని తాకుతోంది. ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు టీడీపీ, బీజేపీ వైపు చూస్తున్నారన్న నిఘా వర్గాల సమాచారంతో దిద్దుబాటు చర్చలు ప్రారంభించిన జగన్ సీనియర్ లీడర్లను కాపాడుకోవడానికి తాజాగా మరో ఎత్తుగడ వేశారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు ఉంటాయని సూచించారు. ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ లో నిబంధనల ప్రకారం ముఖ్యమంత్రితో కలిపి …

Read More »

5 రాష్ట్రాల ఫలితాలు.. 2024 ఆశలు

అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు దేశ భవిష్యత్ రాజకీయాలను ప్రతిబింబిస్తున్నాయి. వెంటిలేటర్‌పై ఉన్న కాంగ్రెస్ ఏదైనా అద్భుతం జరిగితే తప్ప కోలుకునే పరిస్థితి లేదని ఈ ఎన్నికలతో తేలిపోయింది. పొలిటికల్ గేట్ వే టు ది పీఎం చైర్ ఆఫ్ ఇండియా అని చెప్పుకొనే ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో పాలక బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకున్నా పదుల సంఖ్యలో స్థానాలను కోల్పోయింది. అయితే, గత ఎన్నికల కంటే సీట్లు తగ్గినా ఓట్ల …

Read More »

రాష్ట్రపతి రేసులో తెలుగోడు !!

మరో నాలుగు నెలల్లో ఖాళీ కానున్న రాష్ట్రపతి పదవిపై దేశంలోని అనేక మంది సీనియర్ నేతలు, రాజనీతిజ్ఞులు ఆశపడుతున్నారు. ప్రస్తుత రాష్ట్రపతి పదవీ కాలం 2022 జులైతో పూర్తి కానుంది. రెండోసారి ఆయనకు రాష్ట్రపతి పదవి వరించ అవకాశం ఉండకపోవచ్చు. బాబూ రాజేంద్ర ప్రసాద్ మినహా ఇప్పటి వరకు ఎవరూ రెండు సార్లు రాష్ట్రపతి పదవి చేపట్టలేదు. ప్రస్తుత రాష్ట్రపతికీ అలాంటి అవకాశం లేకపోవచ్చన్నదే అంతటా వినిపిస్తున్న మాట. అలాంటప్పుడు …

Read More »

ఈ కాంగ్రెస్ అభ్యర్ధి నిజంగా గ్రేట్

తాజాగా ఉత్తరప్రదేశ్ లో వెల్లడైన ఫలితాలు చూసిన తర్వాత తప్పటంలేదు. రాష్ట్రంలో మంచి సానుకూలతతో రెండోసారి బీజేపీ అధికారంలో కంటిన్యు అవుతున్న విషయం అందరు చూస్తున్నదే. ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని తేడాలేకుండా రాష్ట్రం మొత్తం యోగి ఆదిత్యనాద్ పాలనపై జనాలు సానుకూలత చూపించారు. ఈ ఎన్నికల్లో చాలా పార్టీలు పోటీచేసినా బీజేపీ, ఎస్పీ తప్ప మరే పార్టీయేదీ మంచి ఫలితాలను రాబట్టలేకపోయింది. నాలుగుసార్లు సీఎంగా పనిచేసిన మాయావతి …

Read More »