Political News

కరోనా ఎఫెక్ట్.. ప్రపంచం ఎక్కడుంది?

కరోనా వైరస్ విషయంలో ఇంతకుముందు ప్రపంచ వార్తల మీదే అమితమైన ఆసక్తి ఉండేది. మన దగ్గర ఈ మహమ్మారి ప్రభావం పెద్దగా లేని సమయంలో ఎక్కడ ఏ దేశంలో ఎన్ని కేసులు నమోదయ్యాయి.. ఎక్కడ మరణాలు ఎక్కువన్నాయంటూ ఆసక్తిగా చూసేవాళ్లు. అమెరికా, ఇటలీ దేశాల్లో కరోనా ఉద్ధృతి గురించి తెగ చర్చించుకునేవాళ్లం. కానీ గత నెల రోజుల్లో కథ మారిపోయింది. మన దగ్గర వైరస్ విజృంభణ మొదలయ్యాక మన బాధలతోనే …

Read More »

నాగబాబుపై పోలీస్ కంప్లైంట్

మెగా బ్రదర్ నాగబాబు ఓ అనవసర వివాదంలో వేలు పెట్టారు రెండు రోజుల కిందట. గాంధీని చంపిన నాథూరాం గాడ్సే గురించి ఆయన వేసిన పాజిటివ్ ట్వీట్లు కలకలం రేపాయి. గాంధీని చంపడం తప్పే అయినా.. గాడ్సే దేశభక్తిని మాత్రం శంకించలేమంటూ అతడి గురించి చాలా సానుకూలంగా మాట్లాడాడు నాగబాబు. దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. పెద్ద దుమారం రేగింది. ఈ ట్వీట్లు జనసేన మెడకు చుట్టుకున్నాయి. అసలే …

Read More »

ఇప్పుడు కూడా గొప్పలు చెప్పుకోవటమేనా బాబు?

ఎప్పుడు ఏం మాట్లాడితే బాగుంటుందన్న విషయానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అతికినట్లుగా సరిపోతే.. అందుకు భిన్నంగా ఒకప్పుడు ఆయనకు గురువుగా వ్యవహరించిన ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కనిపిస్తారు. ఎప్పుడేం మాట్లాడాలన్న దానికి సంబంధించి టైమింగ్ ను చంద్రబాబు బాగా మిస్ అవుతున్నారన్న విమర్శలకు తగ్గట్లే ఆయన తాజా మాటలు ఉండటం గమనార్హం. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పోతిరెడ్డిపాడు అంశం హాట్ టాపిక్ గా మారింది. ఈ …

Read More »

ఫుట్ బాల్ క్రీడాకారుడు.. రోజుకూలీగా ఎందుకు మారాడు?

ప్రపంచాన్ని కరోనా కు ముందు.. తర్వాత అన్న విభజన రేఖ తప్పనిసరి. రానున్న రోజుల్లో ఇదే తరహా పోలిక.. ప్రస్తావన తరచూ చేయటం ఖాయం. ఎందుకంటే.. గడిచిన వందేళ్లలో ఎప్పుడూ లేనంత మహా సంక్షోభాన్ని ప్రపంచ ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఎంత చెట్టుకు అంతగాలి అన్న చందంగా.. అందరూ ప్రభావితమయ్యారు. వలస కార్మికుల కష్టాలు కళ్లకు కట్టినట్లుగా ప్రసార మాధ్యమాల్లో కనిపిస్తే.. చాలామంది దిగువ.. మధ్యతరగతి జీవుల కష్టాలు నాలుగు గోడల్లోనే …

Read More »

పవన్ కళ్యాణ్‌పై పడ్డ నార్త్ ఇండియన్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు ఉన్నట్లుండి జాతీయ స్థాయిలో ట్రెండ్ అవుతోంది. ఆయన మీద నిన్న ఉదయం నుంచి హిందీలో పెద్ద ఎత్తున ట్వీట్లు పడుతుండటం విశేషం. రాజకీయాల్లో పవన్ నిస్వార్థ పోరాటం గురించి నార్త్ ఇండియన్స్ పొగడ్తలు గుప్పిస్తూ ట్వీట్లు వేస్తుండటం విశేషం. పవన్ కళ్యాణ్ పేరు హిందీలో నిన్న ఇండియా లెవెల్లో టాప్‌లో ట్రెండ్ అయింది. ఈ రోజు కూడా ఈ ఒరవడి కొనసాగుతోంది. తిరుమల …

Read More »

ప్యాసింజర్ రైళ్లు రెడీ.. ఎప్పట్నుంచి అంటే?

కరోనా కారణంగా దేశవ్యాప్తంగా ఆగిపోయిన ప్రజా రవాణాను పునరుద్ధరించే దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో బస్సులు పున:ప్రారంభం కాగా.. వలస కార్మికుల కోసం కొన్ని వారాల కిందటే రైళ్లను నడుపుతున్న సంగతి తెలిసిందే. వీటితో పాటు రెగ్యులర్ ప్యాసింజర్ రైళ్లనూ నడపడానికి రైల్వే శాఖ సన్నాహాలు చేస్తోంది. జూన్ 1 నుంచి ప్యాసింజర్ రైళ్లు పున:ప్రారంభం అవుతాయని కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ …

Read More »

ఎవరీ రంగనాయకమ్మ.. ఏపీలో ఎందుకింత లొల్లి?

ఊరంతా ఒకదారైతే ఉలిపికట్టెదొక దారన్న సామెత ఏపీ రాజకీయాలకు అచ్చుగుద్దినట్లుగా సరిపోతుంది. రాష్ట్రం కాదు.. దేశం కాదు.. యావత్ ప్రపంచమంతా ఇప్పుడు మాయదారి రోగం గురించి ఆలోచిస్తూ.. దాని దెబ్బకు ఆగమాగమైపోతున్న వేళ.. ఏపీలో మాత్రం అందుకు సిత్రమైన పరిస్థితి నెలకొంది. అధికార.. విపక్ష నేతల మధ్య ఆరోపణలు.. ప్రత్యారోపణలు.. విమర్శలు.. ప్రతివిమర్శలు ఇలా చెప్పుకుంటూ పోతే.. ప్రత్యేక పరిస్థితుల్లో కూడా ప్రజల గురించి పట్టకుండా తమ రాజకీయమే ముఖ్యమన్నట్లుగా …

Read More »

లాట‌రీ త‌గిలితేనే స్వ‌స్థ‌లాల‌కు..

ఉన్న చోట పూట గ‌డ‌వ‌క.. స్వ‌స్థ‌లాల‌కు వెళ్లేందుకు వ‌ల‌స కార్మికులు ప‌డుతున్న క‌ష్టాలేంటో గ‌త కొన్ని రోజులుగా చూస్తూనే ఉన్నాం. వాళ్ల క‌ష్టాలు చూసి క‌న్నీళ్లు వ‌చ్చేస్తున్నాయి జ‌నాల‌కు. ఐతే వీరి కోసం ప్ర‌త్యేక రైళ్లు, బ‌స్సులు ఏర్పాటు చేశాక కూడా కార్మికులు కాలిన‌డ‌క ఆప‌ట్లేదు. ఎండ‌ల్లో త‌ట్టాబుట్టా నెత్తిన పెట్టి.. పిల్ల‌ల్ని వెంట పెట్టుకుని న‌డ‌క సాగిస్తున్నారు. మ‌రి ప్ర‌భుత్వం ప్ర‌యాణ ఏర్పాట్లు చేసినా వీళ్లెందుకు ఇంత క‌ష్ట‌ప‌డుతున్నార‌న్న …

Read More »

సుధాకర్ కేసు- జగన్ కు ఐఎంఏ లేఖ

సస్పెండైన అనస్తీషియా డాక్టరు సుధాక్ అరెస్టు వివాదం ఏపీ ప్రభుత్వాన్ని కాస్త ఇరుకున పడేసినట్లే కనిపిస్తోంది. దీనిపై ఈరోజు రెండు కీలక పరిణామాలు జరిగాయి. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి సుధాకర్ వ్యవహారంపై లేఖ రావడం ఒక సంఘటన కాగా, హైకోర్టు సుధాకర్ విషయంలో తనదైన శైలిలో స్పందించడం రెండో ఘటన. డాక్టర్ సుధాకర్ వ్యవహారంపై ప్రాథమిక దర్యాప్తు జరిపిన ఇండియన్ మెడికల్ అసోషియేషన్ ఆ నివేదికను ముఖ్యమంత్రి జగన్ …

Read More »

జగన్ ది రహదారి కాదు, రాజారెడ్డి దారి – చంద్రబాబు

ఎల్జీ పాలిమర్స్ కు 1996లో చంద్రబాబే అనుమతులు ఇచ్చారంటూ ఈరోజు మధ్యాహ్నం జగన్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో చంద్రబాబు స్పందించారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యేవరకు తండ్రి దారిలో, ముఖ్యమంత్రి అయ్యాక తాత దారిలో నడుస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. అడ్డొచ్చిన వారిపై అక్రమకేసులు బనాయించి తప్పించుకోవాలని చూస్తున్నారని.. చంద్రబాబు ఆరోపించారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి టీడీపీపై ఎదురుదాడికి దిగుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సోమవారం పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్సులో చంద్రబాబు …

Read More »

కేసీఆర్ సెల్ఫ్ గోల్ చేసుకున్నారంటున్న బీజేపీ

ఆత్మ నిర్భ‌ర్ భార‌త్ పేరుతో కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన ప్యాకేజీ విష‌యంలో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ ప్యాకేజీ రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను అవ‌మానించే విధంగా ఉంద‌ని మండిప‌డ్డారు. తెలంగాణ సీఎం చేసిన ఈ వ్యాఖ్య‌ల‌పై బీజేపీ సీనియ‌ర్ నేత‌, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఘాటుగా స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీని అంకెల గారడీగా పేర్కొంటున్న తెలంగాణ సీఎం …

Read More »

161 మంది భారతీయుల్ని తిరిగి పంపుతున్న అమెరికా

మనోళ్లలో పలువురిని అగ్రరాజ్యం అమెరికా తిప్పి పంపేలా నిర్ణయం తీసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా అమెరికాలోకి ప్రవేశించిన భారతీయుల్ని అక్కడి అధికారులు గుర్తించారు. అమెరికాలోని మెక్సికన్ సరిహద్దు ద్వారా దేశంలోకి అక్రమంగా చొరబడిన 161 మంది భారతీయుల్ని గుర్తించారు. అలాంటి వారిని అమెరికాలో ఉంచేందుకు వీలున్న న్యాయపరమైన అవకాశాలు తాజాగా ముగిశాయి. దీంతో.. వారిని భారత్ కు తిప్పి పంపనున్నారు. ప్రత్యేక విమానంలో ఈ 161 మందిని భారత్ కు పంపనున్నారు. …

Read More »