2025లో బిజీబిజీగా టీమిండియా.. కంప్లీట్ షెడ్యూల్

2024 ముగిసిపోతోంది. ఈ ఏడాది భారత క్రికెట్ జట్టుకు గొప్ప విజయాలతో పాటు కొన్ని నిరాశలకూ నిలిచింది. టీ20 వరల్డ్ కప్ గెలిచిన టీమిండియా, మెల్‌బోర్న్ టెస్ట్‌లో ఆస్ట్రేలియాకు ఓటమిపాలైంది. ఐసీసీ ట్రోఫీ గెలిచిన ఆనందం, ఆఖరి మ్యాచ్‌లో చేజారిన విజయాన్ని మరచిపోలేని జ్ఞాపకాలు అయ్యాయి. ఇక 2025లో మరింత ఉత్సాహంగా కొత్త విజయాలను అందుకోవడమే టీమిండియాకు లక్ష్యంగా ఉంది.

2025లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, టెస్ట్ ఛాంపియన్‌షిప్, ఆసియా కప్ లాంటి ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్‌లలో టీమిండియా రాణించగలిగితే అభిమానులకు మరింత సంతోషాన్ని అందించగలదు. జనవరి 3న సిడ్నీలో ఆస్ట్రేలియాతో టెస్ట్ మ్యాచ్‌తో టీమిండియా తన ప్రయాణాన్ని మొదలుపెట్టనుంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ముగిసిన తర్వాత టెస్ట్ స్పెషలిస్ట్‌లు విశ్రాంతి తీసుకుంటారు. ఇంగ్లాండ్‌తో స్వదేశంలో జరిగే ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌కు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా ఉంటాడు.

ఫిబ్రవరిలో ఛాంపియన్స్ ట్రోఫీ కోసం యూఏఈలో టీమిండియా హైబ్రీడ్ మోడల్‌లో ఆడనుంది. ఇండియా మ్యాచ్‌లు దుబాయ్ వేదికగా జరుగుతాయి.

ఇదే ఏడాది ఐపీఎల్ మార్చి నుంచి మే వరకు జరుగనుంది. ఆ తర్వాత జూన్ 11 నుంచి లార్డ్స్ వేదికగా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. టీమిండియా అర్హత సాధిస్తే, ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో పాల్గొంటుంది. జూన్-ఆగస్టు మధ్యలో భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో ఐదు టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది. ఆగస్టులో బంగ్లాదేశ్‌లో మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లతో జట్టు బిజీ కానుంది.

అక్టోబరులో ఆసియా కప్ టీ20 ఫార్మాట్‌లో భారత్ ఆతిథ్యమిస్తోంది. అదే సమయంలో వెస్టిండీస్‌తో రెండు టెస్ట్ మ్యాచ్‌లు స్వదేశంలో జరగనున్నాయి. అక్టోబరు-నవంబరులో ఆస్ట్రేలియా పర్యటనకు భారత జట్టు సిద్ధమవుతోంది. ఈ పర్యటనలో మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఉంటాయి. ఈ షెడ్యూల్ మొత్తం చూస్తే 2025 టీమిండియాకు బిజీగా గడిచే ఏడాదిగా ఉండనుంది.

2025లో టీమిండియా షెడ్యూల్

జనవరి – ఫిబ్రవరి ఇంగ్లాండ్‌తో 3 వన్డేలు, 5 టీ20లు (స్వదేశంలో)మొదటి టీ20- జనవరి 22 రెండవ టీ20- జనవరి 25 మూడవ టీ20- జనవరి 28 నాలుగవ టీ20 – జనవరి 31న ఐదవ టీ20- ఫిబ్రవరి 2

మొదటి వన్డే – ఫిబ్రవరి 6 రెండవ వన్డే – ఫిబ్రవరి 9 మూడవ వన్డే – ఫిబ్రవరి 12

ఛాంపియన్స్ ట్రోఫీ (దుబాయ్) – ఫిబ్రవరి-మార్చి1. ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్- ఫిబ్రవరి 202. భారత్ వర్సెస్ పాకిస్థాన్ – జనవరి 23 3. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ -మార్చి 1

జూన్ – ఆగస్టులో ఇంగ్లండ్‌ టూర్ లో 5 టెస్టులు1వ టెస్ట్ జూన్ 20 -24 2వ టెస్ట్ జూలై 2 -6 3వ టెస్ట్ జూలై 10 – 14 4వ టెస్ట్ జూలై 23 -27 5వ టెస్టు జూలై 31 – ఆగస్టు 4

ఆగస్టులో బంగ్లాదేశ్‌తో – 3 వన్డేలు, 3 టీ20 మ్యాచ్‌లుఅక్టోబర్ – వెస్టిండీస్‌తో 2 టెస్టులుఅక్టోబర్ – టీ20 ఫార్మాట్‌లో ఆసియా కప్అక్టోబరు-నవంబర్ – ఆస్ట్రేలియా టూర్. 3 వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌లు.