వారానికి 70 గంటల పనిపై గౌతమ్ అదానీ అదిరే మాటతరచూ వార్తల్లో నిలుస్తూ.. ఏదో ఒక సంచలనానికి కేరాఫ్ అడ్రస్ గా ఉంటూ.. దేశీయ కార్పొరేట్ లో వివాదాల చుట్టూ వినిపించే పేరు ఏదైనా ఉందంటే.. అది గౌతమ్ అదానీనే. ప్రపంచం సంగతి పక్కన పెడితే.. మన దేశంలో అత్యంత వేగంగా దూసుకెళ్లిన పారిశ్రామకవేత్త ఎవరైనా ఉన్నారంటే.. గౌతమ్ అదానీ పేరే వినిపిస్తుంటుంది.
ఇప్పటివరకు ఆయన నోటి నుంచి వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన మాటలే విని ఉంటాం. తాజాగా ఆయన వర్కు – లైఫ్ బ్యాలెన్స్ కు సంబంధించి ఆయన నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలు వింటే ఫిదా కాకుండా ఉండలేం. దేశ ఉత్పాదకతను పెంచేందుకు మరింతగా పని చేయాలని.. వారానికి 70 గంటలు పని చేయాలంటూ ఇన్ఫోసిస్ నారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలకు తనదైన శైలిలో అదానీ బదులిచ్చారు.
అలా చేస్తే.. పెళ్లాం పారిపోతుందన్న ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయిఒక మీడియా సంస్థతో మాట్లాడిన సందర్భంగా గౌతమ్ అదానీ మాట్లాడుతూ.. ‘‘వర్క్ – లైఫ్ బ్యాలెన్స్ విసయంలో మీరు అనుసరిస్తోన్న విధానాలను ఇతరులపై రుద్దొద్దు. కొందరు నాలుగు గంటలు కుటుంబానికి వెచ్చించి ఆనందాన్ని పొందుతారు. మరొకరి ఆలోచన వేరేలా ఉంటుంది. అది వారి బ్యాలెన్స్. చేస్తున్న పనిలోనే నిమగ్నమైతే భార్య పారిపోతుంది.
మీకు నచ్చిన పనులు చేస్తే.. మీ జీవితంలో సమతుల్యత ఉంటుంది’’ అని పేర్కొన్నారు. అదే సమయంలో మరిన్ని వ్యాఖ్యలు చేశారు కుటుంబం.. ఉద్యోగం ఇవే ప్రపంచమన్న ఆయన పిల్లలు కూడా మన నుంచి ఇవే విషయాల్ని గమనించి ఆచరిస్తుంటారు. ఇక్కడ ఎవరు శాశ్వితంగా ఉండిపోవటానికి రాలేదన్న గౌతమ్ అదానీ.. ‘‘ఈ విషయం అర్థమైనప్పుడు మన జీవితం సరళంగా మారుతుంది’’ అంటూ ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి గతంలో వెలుబుచ్చిన వ్యాఖ్యలను తప్పు పడుతూ.. వ్యాఖ్యలు చేశారు.
గతంలో ఒక పాడ్ కాస్ట్ లో మాట్లాడిన నారాయణమూర్తి.. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్ లో ఉత్పాదకత తక్కువన్న ఆయన.. దీనికి బదులుగా దేశ యువత మరిన్ని గంటలు అధికంగా శ్రమించాలని చెప్పటం తెలిసిందే. రెండో ప్రపంచ యుద్దం తర్వాత జపాన.. జర్మనీ దేశాలు ఎలా అయితే.. కష్టపడ్డాయో.. మనమూ అలానే కష్టపడాలన్నారు.
ఇందుకు యువత వారానికి 70 గంటలు పని చేయాలని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వెలువడ్డాయి. నారాయణ మూర్తి ఆలోచన తీరును పలువురు వ్యతిరేకించారు. తప్పు పట్టారు. ఆ జాబితాలో ఇప్పుడు గౌతమ్ అదానీ కూడా చేరారు.