జగన్‌కి బెయిల్‌ ఇక దొరకదా?

జగన్‌కి బెయిల్‌ ఇక దొరకదా?

సుప్రింకోర్టు వ్యాఖ్యలు చూస్తుంటే వై.ఎస్‌.ఆర్‌.కాంగ్రెస్‌ అద్యక్షుడు జగన్మోహన్‌రెడ్డికి బెయిల్‌ అన్నది ఎప్పటికి రాదేమోననిపిస్తున్నదంటూ కాంగ్రెసు పార్టీ నెల్లూరు ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. జగన్‌ కు బెయిల్‌ వస్తుందనుకున్నవారంతా రాజకీయ అజ్ఞానులేనని ఆయన అన్నారు.

సుప్రింకోర్టు తీర్పు తనకైతే ఆశ్చర్యం కలిగించలేదని ఆయన చెప్పారు. చంద్రబాబు ఢిల్లీలో ఉండి మోకాలి శస్త్ర చికిత్స చేయించుకుంటే, ఆయనపై ఆరోపణలు చేయడం, మోకాలికి, బోడిగుండుకు లింకుపెట్టినట్లు ఉందని ఆనం విమర్శించారు. ఆనం వివేకానందరెడ్డి కొన్నాళ్ళుగా అనారోగ్యంతో బాధపడ్డారు. అంతకుముందు ఆయన మీడియా ముందుకొస్తే ఏదో ఒక సంచలన వ్యాఖ్య చేయడంతోపాటు ఆయన చేష్టలూ విచిత్రంగా ఉండేవి. వివిధ రకాలైన పబ్లిసిటీ స్టంట్లు చేయడంలో ఆనం వివేకానందరెడ్డి దిట్ట. మీడియాని ఆకర్షించడంలోను, సంచలన వ్యాఖ్యలు చేయడంలోనూ తన ప్రత్యేకతను జగన్‌ బెయిల్‌ విషయంలోనూ ఆయన ఇలా చాటుకున్నారు.

ఏ కేసులో అయినా ఎవరికైనా ఎప్పటికీ బెయిల్‌ రాదని చెప్పడం సబబు కాదు. నేరం నిరూపణ అయితే శిక్ష పడవచ్చునుగాని, శిక్ష పడ్డవారికీ బెయిల్‌ వచ్చిన సందర్భాలున్నాయి. ఆనం వివేకానందరెడ్డికి ఇది తెలియదేమో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు