ఆస్ట్రేలియాలో చదువుకునేందుకు వెళ్లాలనుకునే విద్యార్థులకు అక్కడ ప్రభుత్వం ఒక షాకింగ్ న్యూస్ చెప్పింది. మే 10 నుండి ఆస్ట్రేలియాలో చదువుకోవాలనుకునే భారతీయ విద్యార్థులు ఆస్ట్రేలియన్ విద్యార్థి వీసా పొందడానికి 29,710 ఆస్ట్రేలియా డాలర్లు, భారత కరెన్సీలో రూ.16,36,806 లక్షలు బ్యాంక్ బ్యాలెన్స్ చూయించాల్సి ఉంటుంది. వలసలు వచ్చే వారి సంఖ్యను తగ్గించేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం తమ ఇమ్మిగ్రేషన్ చట్టాలలో మార్పులు చేసింది.
గత ఏడాది అక్టోబరులో కనీస పొదుపు మొత్తం రూ.11,58,498 నుండి రూ. 13,49,223 కి పెంచిన ఆస్ట్రేలియా ప్రభుత్వం ఏడు నెలలలో ఆ మొత్తాన్ని మరోసారి పెంచడం గమనార్హం. అక్కడికి వచ్చే విద్యార్థుల ఖాతాలలో కనీసం ఒక ఏడాది నివాసానికి సరిపడా ఖాతాలో ఉండాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం నిబంధన విధించింది. విద్య మరియు వృత్తి అవకాశాల కోసం ఆస్ట్రేలియాకు వస్తున్న భారతీయ విద్యార్థులకు ఈ పరిణామం ఇబ్బందికరమే. 1,20,000 మంది భారతీయ విద్యార్థులు ఆస్ట్రేలియాలో చదువుతున్నారు.