కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలుగింటి కోడలు అన్న సంగతి తెలిసిందే. ఒకప్పటి ప్రజారాజ్యం పార్టీ కీలక నేతల్లో ఒకరు, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వంలో సలహాదారుగా వ్యవహరించిన పరకాల ప్రభాకర్ భార్యే నిర్మల. ప్రస్తుతం రైట్ ఫోలియో పేరుతో పొలిటికల్ అనాలసిస్, మార్కెట్ రీసెర్చ్ అనే కంపెనీ పెట్టుకుని దానికి ఎండీగా కొనసాగుతున్నారాయన. భార్య కేంద్ర మంత్రి అయినపుడు అక్కడి ప్రభుత్వానికి అనుకూలంగానే ఆయన వైఖరి …
Read More »మందుబాబులూ ఆంధ్రాలోనే కొనండ్రా !
ఆంధ్రప్రదేశ్లో కొన్ని నెలలుగా మందుబాబుల కష్టాలు మామూలుగా లేవు. లాక్ డౌన్ కారణంగా మూతపబడ్డ మద్యం దుకాణాలు.. రెండు నెలల తర్వాత తెరుచుకున్నాయి కానీ.. అంతకుముందున్న పేరున్న బ్రాండ్లన్నీ తీసి అవతల పడేశారు. పైగా మద్యం రేట్లు విపరీతంగా పెంచి అమ్మడం మొదలుపెట్టారు. లాక్ డౌన్ వల్ల తలెత్తిన నష్టాన్ని పూడ్చుకునేందుకు తాత్కాలికంగా మద్యం ధరలు పెంచారని.. మళ్లీ తగ్గిస్తారని అంతా అనుకున్నారు. కానీ అలాంటి సూచనలేమీ కనిపించడం లేదు. …
Read More »ఆత్మహత్యకు అనుమతివ్వండి.. గవర్నర్కు కుటుంబం లేఖ
ఇదొక విచిత్రమైన వ్యవహారం. తాము సామూహికంగా ఆత్మహత్య చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఒక కుటుంబం రాష్ట్ర గవర్నర్కు, హైకోర్టుకు లేఖలు రాసింది. తమ ఊరి వాళ్లే తమను వెలి వేయడమే ఇందుకు కారణం. ఈ ఉదంతం ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఉదంతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరకు వెళ్లి కలెక్టరుతో విచారణ జరిపించే వరకు వ్యవహారం వెళ్లింది. ఇంతకీ విషయం ఏంటంటే.. ప్రకాశం జిల్లా …
Read More »ఎన్నికల బరిలో రాములమ్మ
హీరోయిన్ టర్న్డ్ పొలిటీషియన్ విజయశాంతి మరోసారి ఎన్నికల బరిలో నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆమె దుబ్బాక అసెంబ్లీ స్థానంలో పోటీకి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణించడంతో ఉప ఎన్నికలకు రంగం సిద్ధమైంది. రామలింగారెడ్డి కుటుంబ సభ్యుల్లోనే ఒకరు ఆ స్థానంలో బరిలో నిలవబోతున్నారు. ఐతే సానుభూతి కోణంలో ప్రధాన పార్టీలేవీ ఎన్నికలకు దూరమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికే బీజేపీ …
Read More »జగన్ సర్కారును వదలని నిమ్మగడ్డ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్కు మధ్య నెలకొన్న వివాదం ఒక పట్టాన తెగేలా లేదు. ఆర్డినెన్స్ తీసుకొచ్చి మరీ తనపై వేటు వేయడాన్ని కోర్టులో సవాలు చేసి.. మళ్లీ పదవిలోకి రాగలిగారు రమేష్ కుమార్. అంతటితో ఈ వ్యవహారానికి తెరపడిందని అంతా అనుకున్నారు. కానీ అలా ఏమీ జరగలేదు. రమేష్ కుమార్ మరోసారి హైకోర్టు గడప తొక్కడం గమనార్హం. రాష్ట్ర ఎన్నికల కమిషన్ విధుల్లో …
Read More »కరోనా టైం..ప్రపంచంలో బెస్ట్ థింకర్ గా భారతీయురాలు
ప్రచారం, హంగు, ఆర్భాటాలే పరమావధిగా ఉన్న ఈ జమానాలోనూ ఒట్టి మాటలు కట్టి పెట్టి గట్టి మేల్ తలపెట్టవోయ్…అన్న మాటలను నమ్మిన పొలిటిషియన్లు కూడా ఉన్నారు. అటువంటి రాజకీయ నేతలలో ముందు వరుసలో కేరళ వైద్య ఆరోగ్య శాఖా మంత్రి కే.కే. శైలజ ఉంటారు. కరోనా విపత్తు చాపకింద నీరులా వ్యాప్తి చెందుతున్న సమయంలో ఆ మహమ్మారిని ముందుగానే గుర్తించారు శైలజ. గుర్తించడమే కాదు….కరోనా కట్టడిలో ఏ మాత్రం అలసత్వ …
Read More »మందుబాబులకు జగన్ సర్కార్ మరో షాక్
ఏపీలో దశలవారీగా మద్యపాన నిషేధం విధించే దిశగా ఏపీ సీఎం జగన్ అడుగులు వేస్తోన్న సంగతి తెలిసిందే. దీంతో, ఏపీలోని మందుబాబులంతా జగన్ సర్కార్ పై గుర్రుగా ఉన్నారు. ఓ పక్క మద్యం ధరలను అమాంతం పెంచేసిన ప్రభుత్వం…మరో పక్క మద్యం షాపుల సంఖ్యను తగ్గిస్తూ వచ్చింది. ఇక, ఏపీలో కొన్ని బ్రాండ్ల మద్యాన్నే అమ్మడం వంటి చర్యలతో…తమ ఫేవరెట్ బ్రాండ్లు దొరక్క మందుబాబులకు కిక్కు చాలడం లేదు. దీంతో, …
Read More »విద్యుత్ కు నగదు బదిలీ… రైతుల్లో ఎన్నో భయాలు
ఏపీలో వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి పూర్తి స్థాయిలో అమలుకాబోతోన్న ‘ఉచిత విద్యుత్ పథకం-నగదు బదిలీ’ పథకం ఇపుడు ఏపీలో చర్చనీయాంశమైంది. రైతులకు గతంలో మాదిరిగానే ఉచిత విద్యుత్ అందిస్తానని జగన్ సర్కార్ చెబుతోంది. ఒక్క కనెక్షన్ కూడా తొలగించబోమని, కనెక్షన్ ఉన్నవారి స్మార్ట్ మీటర్లు బిగించి వారి బ్యాంకు ఖాతాలోకి ప్రభుత్వం కరెంటు బిల్లుకు సరిపడా డబ్బులు చెల్లిస్తుందని చెబుతోంది. రైతులు ఒక్క రూపాయి కూడా కట్టే పనిలేదని, …
Read More »తగ్గేదే లేదు.. నీటి ప్రాజెక్టులపై కేసీఆర్కు జగన్ సవాల్
తెలుగు రాష్ట్రాల మధ్య నీటి తగాదా అంత తేలిగ్గా తెగేలా లేదు. ఇంతకుముందు మెతక వైఖరితో కనిపించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీశైలం ప్రాజెక్టులో ఆంధ్రప్రదేశ్ వాటాను వాడుకునే విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. ఈ విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్తో సై అంటే సై అన్నట్లుగా వ్యవహరించడానికి ఆయన సిద్ధం అయిపోతున్నారు. రాయలసీమ కరవు నివారణ పథకం ద్వారా 14 ప్రాజెక్టులు పనులను …
Read More »రఘురామకృష్ణరాజుపై పవన్ ప్రశంసలు…మతలబేంటి?
జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ నిన్న 50వ పడిలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ కు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు, పార్టీ కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ ట్విట్టర్ లో పవన్ ధన్యవాదాలు తెలిపారు. ఈ క్రమంలోనే వైసీపీ రెబల్, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై పవన్ ప్రశంసలు కురిపించారు. రఘురామకృష్ణరాజుకు ధన్యవాదాలు తెలిపిన పవన్… రఘురామకృష్ణరాజును పొగడ్తలతో …
Read More »అచ్చెన్నను అధ్యక్షుణ్ని చేయబోతున్నారా?
తెలుగుదేశం పార్టీలో ఓ కీలక పరిణామం జరగబోతున్నట్లు సమాచారం. ఈ మధ్య వార్తల్లో వ్యక్తిగా మారిన అచ్చెన్నాయుడికి ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ బాధ్యతలు అప్పగించనున్నట్లు వార్తలొస్తున్నాయి. తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయాక చంద్రబాబు నాయుడు పార్టీ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతుండగా.. ఏపీ అధ్యక్షుడిగా కళా వెంకట్రావు ఉన్నారు. ఐతే గత ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన అంత యాక్టివ్గా లేని నేపథ్యంలో త్వరలో ఆయన స్థానంలోకి శాసనసభా పక్ష ఉపనేత …
Read More »ఇంగ్లిషు మీడియం విషయంలో జగన్ కు సుప్రీం షాక్
గత కొద్ది నెలలుగా ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు, సుప్రీం కోర్టులో వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్న సంగతి తెలిసిందే. నిమ్మగడ్డ వ్యవహారం, ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు….ఇళ్ల స్థలాల పంపిణీ….ఇలా దాదాపుగా అనేక విషయాల్లో జగన్ సర్కార్ కు న్యాయస్థానాల్లో చుక్కెదురైంది. మరోవైపు, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియంలో బోధన వ్యవహారంపై ఏపీ సర్కార్ సుప్రీం కోర్టు గడప తొక్కిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా, మరోసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates