Political News

జ‌న‌సేన‌కు క‌మ‌లం చెక్‌.. తిరుపతి ఉప ఎన్నిక‌కు బీజేపీ సిద్ధం!!

తిరుప‌తి పార్ల‌మెంటు స్థానానికి త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న ఉప ఎన్నిక‌కు షెడ్యూల్ కానీ, ప్ర‌క‌ట‌న కానీ.. ఇంకా ప్ర‌క‌టించ‌క‌పోయినా.. బీజేపీ మాత్రం దూకుడుగా ముందుకు సాగుతోంది. వాస్త‌వానికి ఈ టికెట్‌ను బీజేపీ పొత్తు పార్టీ జ‌న‌సేన భారీ ఎత్తున డిమాండ్ చేస్తోంది. తెలంగాణ‌లోని గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల్లో తాము పోటీకి దూరంగా ఉండి.. బీజేపీకి స‌హ‌క‌రించాం క‌నుక ఈ టికెట్‌ను త‌మ‌కు ఇవ్వాల‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ ప‌ట్టుబ‌డుతున్నారు. దీనికి సంబంధించి …

Read More »

అప్పుడు నారా దేవాన్ష్ కాలనీ.. ఇప్పుడు వైఎస్ జగన్మోహనపురం

ప్రజలు కట్టే పన్నులతో ప్రభుత్వాన్ని నడిపే నేతలు జేబుల్లోంచి డబ్బులు తీసి ఖర్చు పెడుతున్నట్లుగా ప్రతి పథకానికీ తమతో తమ కుటుంబీకులు, తమ పార్టీ నేతల పేర్లు పెట్టేయడం పట్ల ఎప్పట్నుంచో అభ్యంతరాలున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ ఒరవడికి ప్రధానంగా తెరతీసింది కాంగ్రెస్ పార్టీ. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉండగా పథకాలతో పాటు అన్నింటికీ రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీల పేర్లు పెట్టుకుంటూ వెళ్లిపోయారు. ఆ ఒరవడిని తర్వాత …

Read More »

తాడిపత్రిలో నిప్పు రాజుకుందా ?

అనంతపురం జిల్లా తాడిపత్రిలో రెండుపార్టీల మధ్య నిప్పు రాజుకున్నట్లే ఉంది. ఇంతకాలం నివురుగప్పిన నిప్పులాగున్న వ్యవహారం ఒక్కసారిగా ఎంఎల్ఏ కేతిరెడ్డి పెద్దారెడ్డి చర్య వల్ల ఒక్కసారిగా ఓపెన్ అయిపోయింది. ఇంతకీ విషయం ఏమిటంటే మొన్నటి ఎన్నికల్లో తాడిపత్రిలో వైసీపీ తరపున పోటీ చేసిన కేతిరెడ్డి పెద్దారెడ్డి గెలిచారు. దాంతో జేసీ బ్రదర్స్ దశాబ్దాల ఆధిపత్యానికి ఒక్కసారిగా బ్రేకులు పడినట్లయ్యింది. దానికితోడు టీడీపీ కూడా ఘోరంగా ఓడిపోవటంతో బ్రదర్స్ కు ఇబ్బందులు …

Read More »

క్షమాపణలు కోరిన జగన్

సొంతజిల్లా కడపలో మూడు రోజుల పర్యటనలో ఉన్న జగన్ ఓ విషయంలో ప్రజలను క్షమాపణలు కోరారు. గండికోట రిజర్వాయర్ విషయమై మాట్లాడుతూ ప్రజల త్యాగాల వల్లే గండికోట రిజర్వాయర్ నిర్మాణం పూర్తి చేసుకున్నట్లు చెప్పారు. ‘పునరావాసం విషయంలో ఎవరికైనా ఇబ్బందులు కలిగి ఉంటే మీ బిడ్డగా నన్ను క్షమించండి’ అని వేదిక మీదనుండి చేతులు జోడించి వేడుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో మొదలైన గండికోట రిజర్వాయర్ పనులు మొదలయ్యాయి. …

Read More »

బీజేపీ వ‌ర్సెస్ జ‌న‌సేన‌.. మ‌న‌సులు క‌ల‌వ‌ని మిత్ర‌త్వం

రాజ‌కీయాల్లో శాశ్వ‌త మిత్రులు, శాశ్వ‌త శ‌త్రువులు ఉండ‌ర‌ని అంటారు. ఇది ఎలా ఉన్నా.. రాను రాను.. రాజ‌కీయాల్లో మిత్రుల మ‌ధ్య మ‌రో కోణం కూడా క‌నిపిస్తోంది. క‌లిసే ఉన్నా.. ఎవ‌రి ప్ర‌యోజ‌నం వారిది.. ఎవ‌రి వ్యూహాలు వారివి.. ఎవ‌రికి రేంజ్ పెరిగితే.. వారు సైడ్ అయిపోవ‌డం.. అనేవి కామ‌న్ అయిపోయాయి. ఇదే ప‌రిస్థితి కాదుకానీ.. ఇలాంటి వాతావ‌ర‌ణ‌మే ఏపీ రాజ‌కీయాల్లో కీల‌కంగా ఉన్న బీజేపీ-జ‌న‌సేన కూట‌మిలోనూ క‌నిపిస్తోంది. జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను …

Read More »

విలేజి క్లినిక్కులపై జగన్ దృష్టి

రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో అందరికీ ఆరోగ్యం అందించేందుకు విలేజ్ క్లినిక్కుల ఏర్పాటు ఒక్కటే మార్గమని జగన్మోహన్ రెడ్డి భావించారు. ప్రతి మండలంలోను రెండు ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ) ఏర్పాటు చేయాలని జగన్ ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రతీ పీహెచ్సీలోను ఇద్దరు డాక్టర్లుండాలని వైద్య, ఆరోగ్య ముఖ్య కార్యదర్శి, కమీషనర్ కు స్పష్టంగా చెప్పారు. వంతుల వారీగా పీహెచ్సీలోని డాక్టర్లు రెగ్యులర్ గా గ్రామాలకు వెళ్ళి ప్రజారోగ్యంపై వాకాబు చేయాలన్నారు. అవసరమైన …

Read More »

చిత్తూరు నేత‌ల‌ను మెప్పించ‌లేక పోయిన‌.. చంద్ర‌బాబు!

టీడీపీలో తిరుప‌తి ఎఫెక్ట్ బాగా క‌నిపిస్తోంది. త్వ‌ర‌లో తిరుప‌తి పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది. దీనికి సంబంధిం చి అంద‌రిక‌న్నా ముందుగానే టీడీపీ అధినేత అభ్య‌ర్థిని ప్ర‌క‌టించేశారు. వాస్త‌వానికి ఇది పార్టీలో ఎవ‌రూ ఊహించ‌ని విష‌యం. ఒక వేళ చంద్ర‌బాబు ఏమైనా సొంతంగా నిర్ణ‌యం తీసుకున్నారా? అంటే.. అలా జ‌రిగే అవ‌కాశం కూడా క‌నిపించ‌డం లేదు. సీనియర్ల‌ను ఒక‌రో ఇద్ద‌రినో సంప్ర‌దించ‌కుండా ఈ నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం లేదు. …

Read More »

ఇండియాలో కూడా స్ట్రెయిన్ కలకలం

బ్రిటన్ను కుదిపేస్తున్న స్ట్రెయిన్ కరోనా వైరస్ తాజాగా మనదేశంలో కూడా టెన్షన్ పెంచేస్తోంది. బ్రిటన్ నుండి ఇండియాకు వచ్చిన విమానంలో 25 మందికి కరోనా వైరస్ ఉండటమే ఇందుకు ప్రధానకారణం. కరోనా వైరస్సే రూపాంతరం చెంది స్ట్రెయిన్ కరోనాగా మారిందన్న విషయం అందరికీ తెలిసిందే. కొత్తగా రూపం మార్చుకున్న కరోనా వైరస్ దెబ్బకు బ్రిటన్ తల్లకిందులైపోతోంది. కరోనా వైరస్ కన్నా స్ట్రెయిన వైరస్ చాలా వేగంగా వ్యాపిస్తోంది బ్రిటన్లో. దాంతో …

Read More »

కేసీఆర్ కు జగన్ భయపడుతున్నారు:ఉండవల్లి

పోలవరం ప్రాజెక్టు విషయంలో సీనియర్ పొలిటిషియన్, రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పలు మార్లు సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు హయాంలో పోలవరంపై బహిరంగ చర్చకు సిద్ధమని టీడీపీ నేతలకు, నాటి జలవనరుల శాఖా మంత్రి దేవినేని ఉమకు ఉండవల్లి పలుమార్లు సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. పోలవరం విషయంలో నాటి ఏపీ ప్రభుత్వ అలసత్వ వైఖరితో ఏపీకి తీరని నష్టం కలుగబోతోందని ఉండవల్లి …

Read More »

పవన్ మళ్లీ ఢిల్లీకి… ఈసారి ఎందుకెళుతున్నాడబ్బా ?

పోయినసారంటే రాష్ట్రప్రయోజనాలని, తిరుపతి లోక్ సభలో పోటీ చేసే విషయమై చర్చించేందుకు చెప్పిన పవన్ కల్యాణ్ ఈసారి ఎందుకు ఢిల్లీకి వెళుతున్నట్లు ? ఈనెలాఖరులో రెండు రోజుల ఢిల్లీ టూర్ పెట్టుకున్నారట పవన్. ఎందుకెళుతున్న విషయంపై పార్టీ నేతల్లోనే పూర్తి స్పష్టతైతే లేదు. కాకపోతే తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల్లో పోటీ చేసే అవకాశం అడగటానికే వెళుతున్నారనే టాక్ అయితే నడుస్తోంది. ఇలా ఢిల్లీకి వెళ్ళి అలా అవకాశం ఇవ్వమని …

Read More »

జనసేనకు అర్జెంటుగా కావల్సిందేంటి?

ప్ర‌శ్నిస్తామంటూ.. పార్టీ పెట్టిన ప‌వ‌న్‌కు అనేక ప్ర‌శ్న‌లు చుట్టుముట్టాయి. రాజ‌కీయ వేదిక‌పై అన్న చాటు త‌మ్ముడిగా అరంగేట్రం చేసిన ప‌వ‌న్‌.. ప్ర‌జారాజ్యం విభాగం యువ‌రాజ్యం చీఫ్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌హించారు. ఆ త‌ర్వాత కాలంలో పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయ‌డంతో వేచి చూసి 2014 ఎన్నిక‌ల‌కు ముందు పార్టీ పెట్టినా.. ఆ ఎన్నిక‌ల్లో పోటీకి దూరంగా ఉన్నారు. అదే స‌మ‌యంలో జ‌గ‌న్‌కు వ్య‌తిరేకంగా చంద్ర‌బాబు కూట‌మికి మద్ద‌తు ప‌లికారు. ప్ర‌చారం చేశారు. …

Read More »

రాజా సింగ్ కు సీపీ వార్నింగ్

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర లేదు. తన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు రాజాసింగ్. గోరక్షణ కోసం అవసరమైతే సొంతపార్టీపైనా పోరాటం చేస్తానంటూ రాజా సిింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, గోరక్షణ కోసం మరింత కఠిన చట్టాలు తేవాలని కోరుకునే రాజాసింగ్…అందుకోసం తన పదవినైనా త్యాగం చేస్తానంటూ గతంలో ప్రకటించారు. అయితే, బీజేపీ పెద్దలు తనను రాజీనామా చేయవద్దని వారించడంతో ఆ నిర్ణయం వాయిదా …

Read More »