ఆ ఎమ్మెల్యేల‌పై ‘విజిటింగ్’ ముద్ర‌..!

అధికార పార్టీ వైసీపీలో కొంద‌రు ఎమ్మెల్యేల‌పై ‘విజిటింగ్‌’ ముద్ర ప‌డింది. ఇప్ప‌టికే వారిని.. ఆయా నియోజకవ‌ర్గాల్లో విజిటింగ్ ఎమ్మెల్యేలుగానే ప్ర‌స్తావిస్తుండ‌డం గ‌మ‌నార్హం. అయితే.. ఇలా విజిటింగ్ ఎమ్మెల్యేలుగా ముద్రప‌డిన వారిలో ఎక్కువ‌మంది కొత్త‌గా గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్న వారే కావ‌డం గ‌మ‌నార్హం. అయితే.. వీరు.. గ‌త రెండేళ్లుగా త‌మ సొంత వ్య‌వ‌హారాలు, వ్యాపారాల్లో మునిగి తేలుతున్నార‌నే వాద‌న బ‌లం గా వినిపిస్తోంది. నియోజ‌క‌వ‌ర్గాల‌కు కొత్తే అయినా.. వారు ఏమాత్రం పుంజుకునేందుకు ప్ర‌య‌త్నించ‌క‌పోవ డం గ‌మ‌నార్హం. వాస్త‌వానికి ఏ ప్ర‌జాప్ర‌తినిధికైనా.. ప్ర‌జ‌ల్లో పేరు లేక‌పోతే.. ఒకింత భ‌యం వెంటాడుతుంది.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకుంటామో.. లేదో అన్న బెంగ వారిని వెంటాడుతుంది. కానీ, వైసీపీలోకి కొంద‌రు ఎమ్మెల్యేల‌కు మాత్రం ఇలాంటి బెంగ, భ‌యం ఏమాత్రం లేక పోవ‌డం గ‌మ‌నార్హం. ఇలాంటి వారిలో చిత్తూరు జిల్లా ప‌ల‌మ‌నేరు ఎమ్మెల్యే వెంక‌ట‌గౌడ, ప్ర‌కాశం జిల్లా క‌నిగిరి ఎమ్మెల్యే బుర్రా మ‌ధుసూద న్ యాదవ్‌, అనంత‌పురం జిల్లా క‌ళ్యాణ‌దుర్గం ఎమ్మెల్యే ఉష‌శ్రీ చ‌ర‌ణ్ పేర్లు ప్ర‌ముఖంగా వినిపిస్తున్నాయి. వీరితో పాటు.. సీనియ‌ర్ల పేర్లు కూడా విజిటింగ్ ఎమ్మెల్యేల జాబితాలో ఉండ‌డం గ‌మ‌నార్హం. వెంక‌ట గౌడ‌, ఉష‌శ్రీ చ‌ర‌ణ్ వంటివారు గ‌త ఎన్నిక‌ల్లో తొలిసారి విజ‌యం ద‌క్కించుకున్న వారే కావ‌డం గ‌మ‌నార్హం.

అయిన‌ప్ప‌టికీ.. వీరిలో ఎలాంటి బెరుకు క‌నిపించ‌డం లేదు. దీంతో రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారాలు, ఇత‌ర‌త్రా బిజినెస్‌ల‌లో బిజీగా ఉంటూ.. నియోజ‌క‌వ‌ర్గాల‌ను గాలికి వ‌దిలేశార‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. కొంద‌రైతే.. ఏకంగా, నియోజ‌క‌వ‌ర్గాల‌కు వ‌చ్చి మూడు నాలుగు నెల‌లైందంటే.. కూడా ఆశ్చ‌ర్యం లేదు. తొలి నాళ్ల‌లో క‌రోనా పేరు చెప్పి త‌ప్పించుకున్నారు. దీంతో స‌రేలే అని అంద‌రూ అనుకున్నారు. కానీ, త‌ర్వాత కూడా ఇదే ప‌రిస్థితి కొన‌సాగింది. ఇప్ప‌టికే రెండున్న‌రేళ్లు గ‌డిచిపోయిన ద‌రిమిలా.. నియోజ‌క‌వ‌ర్గంలో ఎక్క‌డా గుప్పెడు అభివృద్ధి జ‌ర‌గ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. అయిన‌ప్ప‌టికీ.. వీరిలో ఎక్క‌డా ఆ త‌ర‌హా ఆవేద‌న కానీ, బాధ కానీ క‌నిపించ‌డం లేదు.

నియోజ‌క‌వ‌ర్గానికి వ‌చ్చినా.. పైపైనే కొంద‌రు కార్య‌క‌ర్త‌ల‌ను క‌లిసి మ‌మ అని అనిపించి వెళ్లిపోతున్నారు. ఈ క్ర‌మంలో వీరిపై విజిటింగ్ ఎమ్మెల్యేలుగా ముద్ర ప‌డ‌డం గ‌మ‌నార్హం. అయిన‌ప్ప‌టికీ.. వీరిలో మార్పు క‌నిపించ‌డం లేదు. మ‌రి ఇప్ప‌టికైనా వీరు త‌మ తీరు మార్చుకుంటారో లేదో చూడాలి. పైగా ఎవ‌రైనా ప్ర‌శ్నిస్తే.. వీరు త‌మ‌పై కుట్ర చేస్తున్నారంటూ.. సొంత పార్టీ నేత‌ల‌పైనా.. పోలీసుల‌కు ఫిర్యాదు చ‌చేస్తుండ‌డం మ‌రీ చిత్రంగా క‌నిపిస్తోంది. ఈ ప‌రిస్థితి మార‌క‌పోతే.. వైసీపీకి ఈ నియోజ‌క‌వ‌ర్గాలు దూరం కావ‌డం ఖాయ‌మ‌నేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.