91 దేశాల్లో టీకాల కొరతగా ఉందా ?

అవును ప్రపంచ ఆరోగ్య సంస్ధ (డబ్ల్యుహెచ్ఓ)చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్యా స్వామినాధన్ చెప్పారంటే ఆలోచించాల్సిన విషయమే. ఇంతకీ విషయం ఏమిటంటే మన కేంద్రప్రభుత్వం చేసిన పనివల్ల 91 దేశాల్లో కరోనా వైరస్ టీకాల కార్యక్రమానికి తీవ్ర ఇబ్బందులు మొదలయ్యాయట. కరోనా వైరస్ కు విరుగుడుగా కోవీషీల్డ్ టీకాలను సరఫరా చేస్తానని సీరమ్ కంపెనీ కాంట్రాక్టు కుదుర్చుకుందట.

సీరమ్ కంపెనీ కుదుర్చుకున్న ఒప్పందాల్లో అత్యధికం ఆఫ్రికా దేశాలే ఎక్కువగా ఉన్నాయట. అయితే భారత్ లో ఒక్కసారిగా పెరిగిపోయిన డిమాండ్ వల్ల టీకాల ఎగుమతిపై కేంద్రప్రభుత్వం బ్యాన్ విధించినట్లు సౌమ్య చెప్పారు. కేంద్రం పెట్టిన బ్యాన్ వల్ల సీరమ్ కంపెనీ ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం టీకాలను ఆప్రికా దేశాలకు సరఫరా చేయలేకపోయిందని మండిపడ్డారు.

వస్తుందని అనుకున్న టీకాలు అందక, ఇప్పటికప్పుడు ఇతర కంపెనీలతో టీకాల కోసం ఒప్పందాలు చేసుకోలేక ఆఫ్రికాదేశాలు నానా అవస్తలు పడుతున్నాయట. సౌమ్య చెప్పినదాని ప్రకారమైతే చాలా దేశాల్లో 0.5 శాతం మందికి మాత్రమే వ్యాక్సినేషన్ కార్యక్రమం జరిగిందట. చాలా దేశాల్లో ఆరోగ్య సిబ్బందికి కూడా టీకాలు వేయలేదని సౌమ్య చెప్పారు. మొత్తంమీద కేంద్రప్రభుత్వం అనాలోచిత చర్యల వల్ల దేశంలోపలే కాదు ప్రపంచదేశాలు కూడా టీకాల కోసం ఇబ్బందులు పడుతున్నాయి.