Political News

వేర్ ఈజ్ అవంతి?

కీల‌క శాఖ కాక‌పోయినా.. వైసీపీ స‌ర్కారులో ఆయ‌న కీల‌క నేత‌, కీల‌క మంత్రి కూడా..! నిత్యం మీడియా మీటింగులు పెట్టి ప్ర‌తి ప‌క్షంపైనా.. ప్ర‌భుత్వాన్ని వ్య‌తిరేకించే వారిపైనా విమ‌ర్శ‌లు సంధించ‌డంలో ఆయ‌న ముఖ్య పాత్ర పోషించేవారు. అయితే.. గ‌డిచి న నెల రోజులుగా అంటే..కార్పొరేష‌న్ ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డిన త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న స్పందించ‌లేదు. క‌నీసం మీడియా ముందుకు  కూడా రాలేదు. ఎక్క‌డ ఉన్నారు.. ? అంటే.. ఇంటికే …

Read More »

ఆ మంత్రి కుర్చీకి గండం.. ఇవిగో రీజ‌న్లు..!

త్వ‌ర‌లోనే మంత్రి వ‌ర్గాన్ని ప్ర‌క్షాళ‌న చేయాల‌ని భావిస్తున్న జ‌గ‌న్ కేబినెట్ నుంచి దిగిపోయే వారిలో ప్ర‌ముఖంగా వినిపిస్తున్న రెండు పేర్ల‌లో రాయ‌ల‌సీమ ప్రాంతానికి చెందిన కీల‌క మంత్రి, బీసీ వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు.. శంక‌ర‌నారాయ‌ణ పేరు ఒక‌టి. అనంత‌పురం జిల్లా పెనుకొండ నియోజ‌క‌వ‌ర్గం నుంచి తొలి సారి గెలిచిన ఈయ‌నకు జ‌గ‌న్ మంత్రి ప‌దవి ఇచ్చారు. నిజానికి ఈ నియోజ‌క‌వ‌ర్గం టీడీపీకి కంచుకోట‌. మ‌రి అలాంటి నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌జ‌లు ఆద‌రించినందుకు.. …

Read More »

మోడీకి ఏం చేయాలో చెబుతూ లేఖ రాసిన మన్మోహన్.. ఏముంది?

రాజకీయాల్ని పక్కన పెడితే.. మేధావిగా.. దేశ ఆర్థిక సమస్యలకు చికిత్స చేసే సత్తా ఉన్న ఆర్థికవేత్త కమ్ రాజకీయ నేతగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను చెప్పాలి. సోనియమ్మ చేతిలో రిమోట్ గా మారి సొంతంగా నిర్ణయాలు తీసుకోలేకపోయారు కానీ.. ఆయన హయాంలో దేశ ఆర్థిక పరిస్థితి కాస్తంత మెరుగ్గానే ఉందని చెప్పాలి. వరుసగా చోటు చేసుకున్న కుంభకోణాల్ని అరికట్టటంలో ఆయన ఫెయిల్ అయ్యారే కానీ.. ఏదైనా ఇష్యూ …

Read More »

మ‌ళ్లీ వ‌ర్క్ ఫ్రం హోమ్‌.. రెడీ అయిపోవ‌డ‌మే!

దేశంలో మ‌ళ్లీ గ‌త ఏడాది ప‌రిస్థితే.. తెర‌మీద‌కి వ‌స్తోంది. క‌రోనా నేప‌థ్యంలో గ‌త ఏడాది ఇదే స‌మ‌యానికి లాక్ డౌన్ అమ‌ల్లో ఉంది. ఈ క్ర‌మంలో ప్ర‌బుత్వ, ప్రైవేటు సంస్థ‌లు వ‌ర్క్ ఫ్రం హోంను అమ‌లు చేశారు. ఇక‌, ఇప్పుడు కూడా ఇదే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ క‌రోనా విజృంభిస్తోంది. ముఖ్యంగా ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లో ఉద్యోగులు చ‌నిపోతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఈనేప‌థ్యంలో వ‌ర్క్ ఫ్రం హోంను మించిన …

Read More »

తిరుప‌తి ఉప పోరు: టీడీపీది ద‌య‌నీయ ప‌రిస్థితి!

తిరుప‌తి పార్ల‌మెంటు స్థానానికి శ‌నివారం జ‌రిగిన ఉప ఎన్నిక‌.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీకి పెద్ద దెబ్బ‌గా మారే ప‌రిస్తితి క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఈ క్ర‌మంలో అధికార పార్టీ వైసీపీ త‌న విశ్వ‌రూ పం చూపించిందంటూ.. టీడీపీ అధినేత‌, మాజీ సీఎం చంద్ర‌బాబు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. అయితే.. ఎగ్జిట్ పోల్ ఫ‌లితాలు మాత్రం.. టీడీపీ ప‌రిస్థితిని క‌ళ్ల‌కు క‌డుతున్నాయి. మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో 38శాతం ఉన్న టీడీపీ ఓటు బ్యాంకు.. తిరుప‌తి …

Read More »

ఏపీ పాలిటిక్స్‌లో తండ్రి చాటు త‌న‌యులు.. పుంజుకునేదెన్న‌డు ?

రాష్ట్ర వ్యాప్తంగా రాజ‌కీయ వార‌సులు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎక్కువ‌గా తెర‌మీద‌కి వ‌చ్చే అవ‌కాశం క‌నిపిస్తోంది. నిజానికి గ‌త ఎన్నిక‌ల్లోనూ వార‌సులు పోటీ చేశారు. అయితే.. ఇది ఏక‌ప‌క్షంగా టీడీపీ నుంచే క‌నిపించింది. కానీ.. ఇప్పుడు వైసీపీ నుంచి కూడా వ‌చ్చే ఎన్నిక‌ల్లో రాజ‌కీయ తెర‌మీదికి వ‌చ్చేందుకు కొంద‌రు వార‌సులు ఇప్ప‌టి నుంచే ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టేశారు. అయితే.. వీరంతా ప్ర‌జ‌ల్లోకి వ‌స్తున్నారా ? రాజ‌కీయంగా చ‌క్రం తిప్పుతున్నారా ? అనేది …

Read More »

అయ్యా సీఎం సార్‌.. జ‌గ‌న్‌కు లోకేష్ లేఖ‌..

జ‌గ‌న్ పేరు వినిపిస్తే.. చాలు టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేష్‌.. ఏవిధంగా నిప్పులు చెరుగుతారో.. ఎలాంటి విమ‌ర్శ‌లు చేస్తారో.. అంద‌రికీ తెలిసిందే. జ‌గ‌న్‌.. అంటే జే ట్యాక్స్ అని.. జ‌గ‌న్ ప్ర‌భుత్వం జేసీబీ ప్ర‌భుత్వ‌మ‌ని.. నిన్న మొన్న‌టి తిరుప‌తి ఉప ఎన్నిక ప్ర‌చారంలోనూ విరుచుకుప‌డిన నారా లోకేష్‌.. ఒక్క‌సారిగా యూట‌ర్న్ తీసుకున్నారా? అన్న‌ట్టుగా మారిపోయారు. సీఎం జ‌గ‌న్‌పై నిప్పులు చెరిగే లోకేష్ నోటి నుంచి సుతిమెత్త‌ని సూచ‌న‌లు బ‌య‌ట‌కు …

Read More »

తిరుపతిపై పెరిగిపోతున్న టెన్షన్

తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల పోలింగ్ తర్వాత వైసీపీలో టెన్షన్ పెరిగిపోతోంది. మిగిలిన ఆరు నియోజకవర్గాలతో పోల్చితే తిరుపతిలో చాలా తక్కువగా పోలింగ్ జరిగింది. మిగిలిన చోట్ల సగటున 70 శాతం పోలింగ్ జరిగిత తిరుపతిలో మాత్రం 50 శాతమే పోలింగ్ నమోదైంది. ఇంత తక్కువ పోలింగ్ గతంలో ఎప్పుడు జరగలేదు. మామూలుగానే ఓవరాల్ గా పోలింగ్ తగ్గిపోవటం ఒక ఎత్తైతే తిరుపతిలో మరీ దారుణంగా పడిపోవటం మరో ఎత్తుగా …

Read More »

గాల్లో కరోనా.. సోషల్ మీడియాలో వైరల్ ..

గాల్లో కరోనా.. ఇప్పుడీ మాట సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ గ్రూపుల్లోనూ మస్తుగా వైరల్ గా మారుతోంది. ఒక అంతర్జాతీయ సంస్థ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడైనట్లుగా పేర్కొంటూ కొన్ని కథనాలు వార్తా పత్రికల్లో జోరుగా దర్శనమిస్తున్నాయి. దీంతో.. అప్రమత్తత కంటే ఆందోళనకు గురి అవుతున్న వారే ఎక్కువ. ఇలాంటి వేళ.. గాల్లో కరోనా వాదనలో వాస్తవం ఎంతన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సీసీఎంబీకి చెందిన నిపుణులుకొందరు గాల్లో కరోనా …

Read More »

ఫోన్ కు దొరకని ప్రధానమంత్రి

అవును ఓ ముఖ్యమంత్రి అర్జంటుగా మాట్లాడాలని ప్రధానమంత్రి నరేంద్రమోడికి ఫోన్ చేస్తే మాట్లాడేందుకు నిరాకరించారట. ఒకవైపు కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు మహారాష్ట్ర వణికిపోతున్న విషయం చెబుదామని ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ఎంత ప్రయత్నించినా మోడి మాత్రం మాట్లాడేందుకు ఇష్టపడలేదు. థాక్రే ఎన్నిసార్లు ఫోన్ చేసినా ప్రధానమంత్రి బిజీబిజీ అని సిబ్బంది చెప్పారట. దాంతో తనతో మాట్లాడటం మోడికి ఇష్టంలేదని సీఎంకు అర్ధమైపోయిందట. ఇదే విషయాన్ని థాక్రే బయటపెట్టడంతో పెద్ద …

Read More »

షర్మిలది కంప్లీటుగా రాంగ్ డెసిషనేనా?

జరిగింది చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. తెలంగాణాలో రాజన్న రాజ్యం తెస్తానని చెప్పి కొత్త రాజకీయపార్టీ పెట్టడానికి రెడీ అవుతున్నారు. ఇందులో భాగంగానే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆరోపణలు, విమర్శలు మొదలుపెట్టేశారు. మొన్నటికి మొన్ననే ఖమ్మంలో బహిరంగ సభ కూడా నిర్వహించారు. ఉద్యోగాలు భర్తీ చేయకపోవటంపై బహిరంగసభలోనే కేసీయార్ ను సూటిగా ప్రశ్నించారు. ఇంతవరకు ఇంతవరకు బాగానే ఉంది. ఇంతటితో ఆగితే బాగుండేది. ఉద్యోగాల భర్తీ డిమాండ్ తో హైదరాబాద్ లోని ఇందిరా …

Read More »

సాగ‌ర్‌, తిరుప‌తి రిజ‌ల్ట్ వ‌చ్చిన వెంట‌నే ఈ ఎమ్మెల్యేలూ కూడా జంపే ?

రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు ముగిసిన‌ప్ప‌టి నుంచి అధికార పార్టీల్లోకి ప్ర‌జా ప్ర‌తినిధుల జంపింగ్‌లు కంటిన్యూగా సాగాయి. తెలంగాణ‌లో అయితే కాంగ్రెస్ నుంచి గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలు, టీడీపీ నుంచి గెలిచిన ఇద్ద‌రు ఎమ్మెల్యేలు కారెక్కేశారు. వారం రోజుల క్రిత‌మే అశ్వారావుపేట టీడీపీ ఎమ్మెల్యే మ‌చ్చా నాగేశ్వ‌ర‌రావు సైతం గులాబి గూటికి చేరిపోయారు. తెలంగాణ‌లో జంపింగ్‌ల వార్త‌ల‌కు బ్రేక్ పడేలా లేదు. ఇక ఏపీలోనూ టీడీపీ నుంచి …

Read More »