బీహార్ కు లోకేష్.. పెద్ద బాధ్యతే!

ఏపీ ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ పై పెద్ద బాధ్యత ఉంచారు. ఎన్డీఏ తరపున పాట్నాలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. కళ్యాణదుర్గం పర్యటన ముగించుకొని మధ్యాహ్నం పాట్నాకు నారా లోకేశ్ వెళ్లనున్నారు. ఎన్డీఏ తరపున పాట్నాలో లోకేష్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ రోజు సాయంత్రం పాట్నాలో రెండు సమావేశాల్లో మంత్రి నారా లోకేశ్ పాల్గొననున్నారు. సాయంత్రం 6 గంటలకు బీహార్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశంలో పాల్గొంటారు. 7.30 కి బీహార్ పారిశ్రామికవేత్తలతో అవుతారు. రేపు (ఆదివారం) ఉదయం 10 గంటలకు పాట్నా లో ఎన్డీఏ కు మద్దతు గా మంత్రి నారా లోకేష్ ప్రెస్ మీట్ నిర్వహిస్తారు. మధ్యాహ్నం పాట్నా నుండి బయలుదేరి విజయవాడ చేరుకుంటారు. సీఎం చంద్రబాబు నాయుడు బీహార్ ఎన్నికల ప్రచారానికి వెళ్తారని మొదట్లో అనుకున్నారు. దానిపై ఇంకా స్పష్టత రాలేదు, ఈ నేపథ్యంలో లోకేష్ అక్కడికి వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఏపీలో కూటమి ప్రభుత్వం ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉంది. గతంలో ఉత్తరాదిలో జరిగిన పలు ఎన్నికల సమయంలో కూటమి నేతలు ప్రచారం నిర్వహించారు. గతంలో ఢిల్లీలో ప్రచారంలో పాల్గొన్న చంద్రబాబు జాతీయస్థాయిలో ఇమేజ్ తెచ్చుకున్నారు. మహారాష్ట్రలో జరిగిన ప్రచారంలో పాల్గొంటారని భావించినా.. కుటుంబం లో జరిగిన విషాదంతో మధ్యలో తిరిగి వచ్చారు. ఈసారి బీహార్ ప్రచారంలో తన పాల్గొనబోతున్నట్లు చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. త్వరలో ఆయన ప్రచారానికి వెళతారో చూడాలి. మరోవైపు విశాఖపట్నం భాగస్వామ్య సమ్మిట్ పనుల్లో ఆయన బిజీగా ఉన్నారు. ఎన్డీఏ కూటమి తరపున మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన పవన్ కళ్యాణ్.. ఆ స్థానాల్లో మహాయుతి అభ్యర్థుల గెలుపులో కీలక పాత్ర పోషించారు.

మూడోసారి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏకు బీహార్ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. ఇండియా కూటమి బలంగా నిలుస్తున్న వేళ, అక్కడ గెలుపు సాధించాలంటే స్టార్ ప్రచారకర్తల అవసరం ఉంది. ఈ నేపథ్యంలో లోకేష్ అక్కడికి వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇది ఆయనకు పెద్ద బాధ్యతే అని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. జాతీయ స్థాయి నేతలతో లోకేష్ టచ్ లో ఉంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీని, కేంద్ర మంత్రులను కూడా కొన్నిసార్లు కలిశారు. ఇప్పుడు బీహార్ లో ఆయన పర్యటన అక్కడ. బీజేపీ కూటమి విజయానికి ప్లస్ అవుతుందని భావిస్తున్నారు.