Political News

`ల‌డ్డూ`పై జ‌నం అప్పట్లో ఏమన్నారు?

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూపై ప్ర‌జ‌ల ఆలోచ‌న ఎలా ఉంది?  వారు ఏమ‌న్నారు?  ముఖ్యంగా వైసీపీ హ‌యాంలో ఎలాంటి అభిప్రాయం ప్ర‌జ‌ల నుంచి వ్య‌క్త‌మైంది?.. ఇదీ.. ఇప్పుడు తెర‌మీదికి వ‌చ్చిన కీల‌క విష‌యం. ఐ-టీడీపీ విభాగం.. గ‌తంలో సాధార‌ణ ప్ర‌జ‌ల నుంచి ప్ర‌ముఖుల వ‌ర‌కు సోష‌ల్ మీడియాలో శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదంపై చేసిన కామెంట్ల‌ను, పోస్టుల‌ను గుదిగుచ్చి.. ఇప్పుడు ప్ర‌చారంలోకి తీసుకువ‌చ్చారు. దీనిలో ప‌దుల సంఖ్య‌లో పోస్టులు క‌నిపిస్తున్నాయి.

చాలా మంది చెప్పిన ఏకైక కార‌ణం.. నెయ్యి గురించే. నెయ్యి వాస‌న రావ‌డం లేద‌ని.. నూనె మాదిరిగా ఉంద‌ని..ముక్క కంపు కొడుతోంద‌ని ఎక్కువ మంది పేర్కొన్నారు. మ‌రికొందరు క‌నీసం.. ఒక్క‌రోజు కూడా నిల్వ ఉండ‌డం లేద‌న్నారు. ఇంకొంద‌రు త‌మ స్థానిక దేవాల‌యాల్లో కూడా ఇలాంటి ప్ర‌సాదాలు ఎప్పుడూ పెట్ట‌లేద‌ని వ్యాఖ్యానించారు.

ఇవ‌న్నీ.. 2020-23 మ‌ధ్య చేసిన పోస్టులే కావడం గ‌మ‌నార్హం. అంతేకాదు.. వారు త‌మ భ‌క్తికి కొంత ప‌రిధిలు వేసుకుని.. `ఇంత‌క‌న్నా వ్యాఖ్యానించ‌లేక పోతున్నాం.“ అని చెప్ప‌డం కూడా ఈ పోస్టుల్లో స్ప‌ష్టంగా ఉంది.

ఎందుకిలా?
ప్ర‌స్తుతం..  తిరుమల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యి వ్య‌వ‌హారం.. కేవ‌లం రాజ‌కీయం కోస‌మేన‌ని వైసీపీ ఎదురు దాడి చేస్తోంది. సీఎం చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్‌లు ఉద్దేశ పూర్వ‌కంగానే త‌మ‌పై దాడి చేస్తున్నార‌ని వ్యాఖ్యానిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో ఈ వ్య‌వ‌హారానికి, రాజ‌కీయాల‌కు సంబంధం లేద‌ని.. సామాన్య భ‌క్తుల మ‌నోభావాల‌నే తాము ప్ర‌స్తావిస్తున్నామ‌ని ప్ర‌భుత్వం చెబుతోంది. అయితే.. దీనికి బ‌ల‌మైన ప్రాతిప‌దిక క‌నిపిస్తున్నా.. ప్ర‌చారంలో వెనుక‌బ‌డి ఉన్నార‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే.. సాధార‌ణ భ‌క్తులు గ‌తంలో చేసిన పోస్టుల‌ను ఇప్పుడు తెర‌మీదికి తీసుకువ‌చ్చారు. ఇది రాజ‌కీయం కాద‌ని నిరూపిస్తున్నారు.

This post was last modified on February 7, 2026 7:50 pm

Share

Recent Posts

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

6 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

9 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

9 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

9 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

9 hours ago

రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…

10 hours ago