Trends

ఒకే రోజు ఒకే ఆలయంలో 400 పెళ్లిళ్లు

భారతదేశ సంస్కృతిలో వివాహాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు. జీవితంలో ఒక్కసారే పెళ్లి జరుగుతుందని ఇక్కడి ప్రజల్లో అత్యధికులు నమ్ముతారు. అందుకే మంచి ముహూర్తం కోసం ఎదురు చూస్తారు. మేళతాళాలతో వైభవంగా పెళ్లి చేస్తారు. దేవుడు అడుగుపెట్టిన నేలగా చెప్పుకునే కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గురువాయుర్ శ్రీకృష్ణ దేవాలయంలో అద్భుత ఘట్టం చోటు చూసుకోబోతుంది.

కేరళ ప్రజలకు మలయాళ క్యాలెండర్ ప్రకారం చింగం మాసం అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఇది మలయాళ సౌర క్యాలెండర్ లో మొదటి మాసం. ఈ మాసంలో కొత్త ఇంట్లోకి మారడం, కొత్త వాహనం కొనడం, కొత్తగా వ్యాపారం ప్రారంభించడం చేస్తారు. పెళ్లిళ్లకు కూడా ఇది చాలా మంచి ముహూర్తంగా విశ్వసిస్తారు. ఈ మాసంలో కేరళలో అతి పెద్ద పండుగ ఓణం వస్తుంది.

అయితే ఈసారి ఓణం పండుగ కంటే పెళ్లిళ్ల పండుగ పెద్దగా జరగబోతుంది. ఈ నెల 23 వ తేదీన గురువాయుర్ శ్రీకృష్ణ దేవాలయం ప్రాంగాణంలో 377 పెళ్లిళ్లు జరగబోతున్నాయి. 2024 సెప్టెంబర్ 8 వ తేదీన 334 వివాహాలు జరిగాయి. ఇప్పటి వరకు అదే రికార్డుగా వుంది. ఈ రికార్డు ఇప్పుడు బ్రేక్ చేస్తున్నారు కొత్త జంటలు. ఈ పెళ్లిళ్ల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం వుందని చెబుతున్నారు దేవాలయం నిర్వాహకులు. ఏక కాలంలో 400 పెళ్లిళ్లు జరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఈ భారీ పెళ్లిళ్ల తాకిడిని తట్టుకోవడానికి ఇప్పటినుంచే సన్నాహాలు చేస్తున్నారు.

ఆలయంలో ప్రస్తుతం నాలుగు కళ్యాణ మండపాలు వున్నాయి. ఈ నాలుగు మండపాల్లో ఒకేసారి 200 వివాహాలు చేయడానికి సౌకర్యం వుంది. కనుక మరోకొత్త కళ్యాణ మండపం కట్టడం ఒక్కటే దీనికి పరిష్కారం అని నిర్ణయించారు. ఆఘమేఘాల మీద కొత్త మండపం నిర్మించేందుకు పనులు ప్రారంభించారు. చింగం మొదటి రోజే ఈ మండపాన్ని ప్రారంభించనున్నట్లు కమిటీ పెద్దలు ప్రకటించారు.

This post was last modified on August 11, 2026 5:06 pm

Share

Recent Posts

బూతులతో ప్యారడైజ్ చూడాలంటే అక్కడే

ట్రైలర్ రాలేదు. అసలు సమయమే లేదని ఆ ఆలోచన మానుకున్నారు. రెండు మాస్ సాంగ్స్ తీసుకొచ్చిన బజ్ తప్ప ఇంకే…

24 minutes ago

మీ టూత్ పేస్టులో నాన్ వెజ్ ఉందా?

మీ పేస్టులో ఉప్పుందా అనే ప్రకటన ఎంతగా పాపులర్ అయ్యిందో మనందరికీ తెలిసిందే. నిజంగా ఉప్పుందో లేదో తెలియదు కానీ…

1 hour ago

ప్రీమియర్లు నేడే…. తాడోపేడో తేలేదిప్పుడే

ఇంకొద్ది గంటల్లో అంటే రాత్రి తొమ్మిది నుంచి ప్యారడైజ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్…

2 hours ago

జగన్ తో రాజీపడే ప్రసక్తే లేదు

వైసీపీ అధినేత జగన్ కు, ఆయన చెల్లెలు పీసీసీ అధ్యక్షురాలు షర్మిలకు మధ్య రాజీ చర్చలు జరుగుతున్నట్లు కొంతకాలంగా సోషల్…

2 hours ago

రాజమౌళి వేగానికి వారణాసే సాక్ష్యం

రాజమౌళి వేగంగా సినిమాలు తీస్తారంటే ఎవరూ ఒప్పుకోరు. ఆయన మేకింగ్ స్టయిల్, తీసుకునే కథలు, క్యాస్టింగ్ ఇవన్నీ అంచనాలకు అతీతంగా…

2 hours ago

శ్రీకాంత్ ఓదెల ఆ విషయంలో రాక్షసుడు

తెలుగులో గొప్ప దర్శకులు అని పేరు తెచ్చుకున్న వాళ్లందరూ పని రాక్షసులే. ఇండియాలోనే నంబర్ వన్ దర్శకుడిగా ఎదిగిన రాజమౌళి…

3 hours ago