తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉన్న మలయాళ భామ అనుపమ పరమేశ్వరన్ పదేళ్ల కెరీర్లో పెద్దగా ఎఫైర్ వార్తలేమీ వచ్చింది లేదు. కానీ ఏడాది ముందు తాను కలిసి నటించిన యంగ్ హీరోతో ప్రేమలో పడ్డట్లు వార్తలు వచ్చాయి. తర్వాత ఆ ప్రచారం నిజమే అని తేలింది. కానీ ఇటీవల ఆ బంధం నుంచి బయటికి వచ్చేసింది అనుపమ. క్రిప్టిక్ పోస్టుల ద్వారా ఆ విషయాన్ని చెప్పకనే చెప్పింది అనుపమ.
నెమ్మదిగా ఆ రిలేషన్‌షిప్ గురించి ఆమె ఓపెన్ అవుతోంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన ప్రేమకథ, బ్రేకప్‌కు సంబంధించి ఆమె సంచలన విషయాలు వెల్లడించింది. తాను ప్రేమలో ఉన్న వ్యక్తి పేరు చెప్పకుండా తాను ఒక విషపూరితమైన బంధం (టాక్సిక్ రిలేషన్‌షిప్)లో ఉన్నట్లు వ్యాఖ్యానించింది అనుపమ.
తన మాజీ లవర్ చాలా ప్రమాదకరం అన్నట్లుగా ఆమె మాట్లాడింది. అతను ఒక్కో రోజు ఒక్కోలా ఉంటాడంటూ అన్నియన్ (అపరిచితుడు) క్యారెక్టర్‌ను గుర్తు చేసింది అనుపమ. ఒక రోజు అతను రెమోలా ఉంటాడని, ఎంతో ప్రేమగా మాట్లాడతాడని, ఇంత ప్రేమించే వ్యక్తి ఇంకొకరు ఉండరన్నట్లే ఉంటాడని.. కానీ తర్వాతి రోజు ఉన్నట్లుండి అపరిచితుడిగా మారిపోతాడని, తనను భరించడం చాలా కష్టమవుతుందని అనుపమ చెప్పింది.
తాను ఆ వ్యక్తితో రిలేషన్‌షిప్‌లోకి వెళ్లిన మూడు నెలలకే అతడి కుటుంబం తమ ఇద్దరికీ ఎంగేజ్మెంట్ చేయాలని అనుకుందని, కానీ అతడికి చాలా తక్కువ వయసు కావడంతో తాను ఆగానని అనుపమ చెప్పింది. ఆ రిలేషన్‌షిప్‌లో ముందుకు వెళ్లే కొద్దీ చాలా ఇబ్బందులు పడ్డానని.. తన కెరీర్లో పెద్ద హిట్ మూవీ అయిన డ్రాగన్‌ను కూడా తాను ప్రమోట్ చేసుకోలేకపోయానని.. అలా తాను ఉచ్చులో బిగుసుకుపోయానని ఆమె వ్యాఖ్యానించింది. ఆ బంధంలో ఉన్నపుడు ఎవరైనా ఎలా ఉన్నావు అని అడిగితే ఏడ్చేసే పరిస్థితుల్లో ఉన్నట్లు ఆమె చెప్పింది. ఈ రిలేషన్‌షిప్ నుంచి బయటికి వచ్చాక తనకు స్వేచ్ఛ లభించినట్లయిందని ఆమె పేర్కొంది.
This post was last modified on August 12, 2026 11:23 pm
కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…
ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…