Movie News

‘ఇరుముడి’ సరుకులు… అన్నీ సరిపోయాయి

మాస్ మహారాజా రవితేజ ఇరుముడి ఆగస్ట్ 21 విడుదల కానుంది. వరస ఫ్లాపుల నుంచి బయటపడేసే సినిమాగా అభిమానులు దీని మీద మాములు అంచనాలు పెట్టుకోలేదు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం, కూతురు సెంటిమెంట్, శివ నిర్వాణ దర్శకత్వం వెరసి హైప్ తెచ్చేందుకు ఇవి సరిపోయాయి. ముఖ్యంగా అయ్యప్ప మాలలో రవితేజ గెటప్, దీక్ష చుట్టూ అల్లిన కథా కథనాలు, పాటలు ఫ్యామిలీ ఆడియన్స్ లో అంచనాలు పెంచాయి. తాజాగా ట్రైలర్ లో స్టోరీ చెప్పేశారు.

ఎక్కడో ఒక మారుమూల ప్రాంతం చిన్న ఊరిలో లగేజ్ వ్యాన్ నడుపుకునే డ్రైవర్ త్రినాధ్ (రవితేజ). అయిదో క్లాసు చదువుతున్న కూతురంటే (బేబీ నక్షత్ర) ప్రాణం. భార్యని, బిడ్డని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తుంటాడు. అయితే స్థానిక స్కూల్లో వరసగా ఆడపిల్లల చావులు జరుగుతాయి. వీటి వెనుక ఒక పెద్ద ముఠా ఉంటుంది. పిల్లల విషయంలో ఎక్కడ తప్పు జరిగినా తుప్పురేపే త్రినాధ్ అయ్యప్ప మాల వేసుకున్నాక ప్రమాదాలను ఎదురుకుంటాడు. అవేంటో తెరమీద చూడాలి.

సెన్సిబుల్ కథలను తెరకెక్కించే శివ నిర్వాణ మొదటిసారి పూర్తి కమర్షియల్ జోన్ లోకి వెళ్లిపోయారు. గతంలో టక్ జగదీశ్ లో ఆ ప్రయత్నం చేసినప్పటికీ ఎమోషన్, యాక్షన్ బ్యాలన్స్ చేయలేక తడబడ్డారు. ఇరుముడి అలా కనిపించడం లేదు. క్రాక్ తరహాలో మంచి విలనిజంతో పాటు క్లాస్, మాస్ ఆడియన్స్ కి కావాల్సిన అన్ని అంశాలు పొందుపరిచినట్టు ఉంది. నేటివిటీ గట్రా కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ లో ఉన్నప్పటికీ మన ఆడియన్స్ కి ఈ బ్యాక్ డ్రాప్స్ బాగా నచ్చుతున్నాయి.

గురుస్వామిగా సాయికుమార్ కీలక పాత్ర పోషించిన ఇరుముడిలో లేడీ విలన్ సెటప్ తో పాటు రౌడీ గ్యాంగ్ ని పెద్దదే పెట్టారు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం, ఆర్ట్ వర్క్, నటీనటులు మొత్తం నేపథ్యం ఆసక్తికరంగా ఉంది. పెద్ది, మా ఇంటి బంగారం, లెనిన్ తరహాలో మాస్ ని టార్గెట్ చేసుకున్న ఇరుముడికి ఆగస్ట్ 21 పెద్ద పోటీ లేదు. అయిదు రోజుల తర్వాత టాక్సిక్ ని తట్టుకుని నిలబడే కంటెంట్ ఉందని ఋజువు చేయాలంటే యునానిమస్ టాక్ రావాలి. ఆ వైబ్స్ అయితే శాంపిల్ గా కనిపిస్తున్నాయి.

This post was last modified on August 13, 2026 9:12 am

Share

Recent Posts

యూపీలో కాంగ్రెస్ పొత్తు ఉంటుందా? ఊడుతుందా??

"మేము ఆడుకునేవాళ్ళం కాదు..." ఈ మాటలు అన్నది ఎవరో దారినపోయే దానయ్య కాదు. ఏళ్ళ తరబడి దేశాన్ని పాలించిన కాంగ్రెస్…

1 hour ago

బాబు స్పీడుగా ఉన్నారు: ప్ర‌పంచ బ్యాంకు ప్ర‌శంస‌!

ఏపీ సీఎం చంద్ర‌బాబు స్పీడుగా ప‌నిచేస్తున్నార‌ని, ఈ స్పీడు చూస్తే.. అమ‌రావ‌తి రాజ‌ధాని నిర్మాణ ప‌నులు అనుకున్న స‌మ‌యానికంటే కూడా…

4 hours ago

ఈ సర్ మాకొద్దు బాబోయ్

కేంద్ర ఎన్నిక‌ల సంఘం దేశ‌వ్యాప్తంగా అమ‌లు చేస్తున్న ఓట‌ర్ల జాబితా ప్ర‌త్యేక స‌వ‌ర‌ణ ప్ర‌క్రియ‌(స‌ర్‌)పై దేశంలోని ప‌లు రాష్ట్రాలు అభ్యంత‌రం…

5 hours ago

టీడీపీ సంచ‌ల‌న మిలియన్ రికార్డు

ఏపీ అధికార పార్టీ టీడీపీ సంచ‌ల‌న రికార్డును సొంతం చేసుకుంది. పార్టీ ప్రారంభించిన `మై-టీడీపీ` యాప్‌.. స్వ‌ల్ప‌కాలంలోనే 10 ల‌క్ష‌ల…

6 hours ago

ప‌వ‌న్‌తో బెంగాల్ టైగ‌ర్ చేద్దామ‌నుకుంటే

ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ర‌చ్చ ద‌ర్శ‌కుడు సంప‌త్ నంది కాంబినేష‌న్లో ఒక సినిమా కోసం స‌న్నాహాలు జ‌రిగి.. ఏడాదికి…

7 hours ago

బ్యాటర్ లేకుండానే బౌలింగ్.. ఇదేం విచిత్రమైన ఔట్!

క్రికెట్‌లో బౌలర్‌కు ఫ్రీ హిట్ లాంటి అవకాశం వస్తే ఎలా ఉంటుంది? ఆస్ట్రేలియాలో జరుగుతున్న మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో సరిగ్గా…

7 hours ago