Movie News

షూట్ లేకున్నా ప్రభాస్ ఫౌజి సెట్లోనే

ప్ర‌భాస్ సినిమా అంటే చాలు.. హైప్‌కు ఏమీ లోటు ఉండ‌దు. రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డేకొద్దీ అభిమానుల‌తో పాటు సామాన్య ప్రేక్ష‌కుల్లోనూ అంచ‌నాలు పెరిగిపోతాయి. అందులోనూ ఈసారి హ‌ను రాఘ‌వ‌పూడి లాంటి అభిరుచి ఉన్న ద‌ర్శ‌కుడితో ప్ర‌భాస్ జ‌ట్టు క‌ట్ట‌డంతో త‌న కొత్త చిత్రం ఫౌజిపై అంచ‌నాలు ముందు నుంచే భారీగా ఉన్నాయి. ఆ సినిమా గురించి మేక‌ర్స్ చెబుతున్న మాట‌లు ఆ అంచ‌నాలు మ‌రింత పెంచేలా ఉన్నాయి.

తాజాగా త‌మ బేన‌ర్లో తెర‌కెక్కిన కొత్త చిత్రం ఇరుముడి ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో మైత్రీ మూవీ మేక‌ర్స్ అధినేత ర‌విశంక‌ర్.. ఫౌజి గురించి చెప్పిన ముచ్చ‌ట్లు ప్ర‌భాస్ అభిమానుల్లో ఆ సినిమాపై ఎగ్జైట్మెంట్‌ను పెంచాయి.
స్పిరిట్ మూవీ నుంచి బ్రేక్ తీసుకుని ప్ర‌భాస్ వ‌రుస‌గా నెల రోజుల పాటు ఫౌజి షూటింగ్‌లో పాల్గొంటున్న‌ట్లు ఇటీవ‌ల వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

ఈ విష‌యాన్ని ధ్రువీక‌రిస్తూ.. ప్ర‌భాస్ ఉద‌యం 8 నుంచి సాయంత్రం 6.30 వ‌ర‌కు ప్ర‌తి రోజూ ఫౌజి షూట్లోనే ఉంటున్న‌ట్లు ర‌విశంక‌ర్ తెలిపారు. ఈ మంగ‌ళ‌వారం అయితే త‌న వ‌ర్క్ ఏమీ లేక‌పోయినా ప్ర‌భాస్సెట్‌కు వ‌చ్చి మానిట‌ర్ ద‌గ్గ‌రే కూర్చుని జాగ్ర‌త్త‌గా అన్నీ చూసుకుంటున్న‌ట్లు ర‌విశంక‌ర్ తెలిపారు.

ఫౌజి విష‌యంలో ఎట్టి ప‌రిస్థితుల్లోనూ తేడా జ‌ర‌గ‌ద‌ని, సినిమా వేరే లెవెల్లో ఉంటుంది, ఇది నేను భీమ‌వ‌రంలో చేస్తున్న ప్రామిస్ అని ఆయ‌న చెప్ప‌డంతో ఇరుముడి ఈవెంట్ హోరెత్తిపోయింది. ప్ర‌భాస్ స‌ర‌స‌న ఇమాన్వి న‌టిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబ‌రు 3న రిలీజ్ చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ముందు ఈ డేట్ ప్ర‌క‌టించిన‌పుడు అనుమానాలు వ్య‌క్త‌మ‌య్యాయి కానీ.. ఆ డేట్‌కు ప‌క్కాగా సినిమాను విడుద‌ల చేయాల‌ని టీం ప‌ట్టుద‌ల‌తో ఉన్న‌ట్లే క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ శివార్ల‌లోని అల్యూమినియం ఫ్యాక్ట‌రీలో వేసిన ఛార్మినార్ సెట్లో ఈ మూవీ యాక్ష‌న్ ఘ‌ట్టాల చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోంది.

This post was last modified on August 12, 2026 11:19 pm

Share

Recent Posts

జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి?

ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…

30 minutes ago

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

8 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

11 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

11 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

11 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

11 hours ago